WhatsApp new feature : వాట్సాప్​లో ఇక మెసేజ్​లను 'ఎడిట్​' చేసుకోవచ్చు..!-whatsapp new feature might soon allow you to edit sent messages check full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Whatsapp New Feature Might Soon Allow You To Edit Sent Messages Check Full Details

WhatsApp new feature : వాట్సాప్​లో ఇక మెసేజ్​లను 'ఎడిట్​' చేసుకోవచ్చు..!

Sharath Chitturi HT Telugu
Mar 28, 2023 07:16 AM IST

WhatsApp message edit feature : వాట్సాప్​కు మరో కొత్త ఫీచర్​ వస్తున్నట్టు తెలుస్తోంది. పంపిన మెసేజ్​ను ఎడిట్​ చేసుకునే ఫీచర్​ను వాట్సాప్​ తీసుకొస్తున్నట్టు సమాచారం.

వాట్సాప్​లో ఇక మెసేజ్​లను ఎడిట్​ చేసుకోవచ్చు..!
వాట్సాప్​లో ఇక మెసేజ్​లను ఎడిట్​ చేసుకోవచ్చు..! (HT_PRINT)

WhatsApp message edit feature : ప్రముఖ టెక్స్టింగ్​ యాప్​ వాట్సాప్​కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. వారి కోసం యాప్​ను ఎప్పటికప్పుడు అప్డేట్​ చేస్తూ, కొత్త ఫీచర్స్​ని తీసుకొస్తుంటుంది ఈ ఫేస్​బుక్​ ఆధారిత వాట్సాప్​. ఇందులో భాగంగానే త్వరలో ఓ ఫీచర్​ బయటకు రానున్నట్టు తెలుస్తోంది. ఇకపై సెంట్​ మెసేజ్​లను కూడా ఎడిట్​ చేసుకునే ఫీచర్​ వాట్సాప్​లో రానున్నట్టు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

వాట్సాప్​ కొత్త ఫీచర్​ ఇదే..

వాట్సాప్​లో 'డిలీట్​ మెసేజ్​ ఫర్​ ఎవరీవన్​' ఫీచర్​ ఇప్పటికే అందుబాటులో ఉంది. తప్పు మెసేజ్​ పంపిస్తే దీనిని ఉపయోగించుకోవచ్చు. కాగా.. మెసేజ్​లను ఎడిట్​ చేసుకునే ఫీచర్​ కూడా వస్తే.. పని మరింత సులభతరం అవుతుందని అనడంలో సందేహం లేదు.

WhatsApp new feature : టెలిగ్రామ్​, స్లాక్​, ఐమెసేజ్​ వంటి ప్రముఖ యాప్స్​లో.. ఈ ఎడిట్​ మెసేజ్​ ఫీచర్​ ఇప్పటికే అందుబాటులో ఉంది. కానీ కోట్లాది మంది వాడే వాట్సాప్​లో ఈ ఫీచర్​ లేదు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. వాస్తవానికి 2022 నుంచే ఈ ఫీచర్​ను టెస్ట్​ చేస్తూ వస్తోంది వాట్సాప్​. ఈ నేపథ్యంలో రానున్న కొన్ని వారాలు, నెలల్లో ఇది యూజర్లకు చేరనుంది.

ఎడిటెడ్​ లెబుల్​తో..

Edit message feature in WhatsApp : ఏదైనా మెసేజ్​ను ఎడిట్​ చేయాలని అనుకుంటే.. ముందుగా దానిని లాంగ్​ ప్రెస్​ చేయాలి. స్క్రీన్​ మీద పెన్సిల్​ ఐకాన్​తో ఎడిట్​ ఆప్షన్​ కనిపిస్తుంది. ఇలా.. మెసేజ్​ను ఎడిట్​ చేసుకోవచ్చు. చివరికి ఆ మెసేజ్​ మీద 'ఎడిటెడ్​' అని లేబుల్​ పడుతుంది.

మెసేజ్​ పంపిన 15 నిమిషాలలోపు దానిని ఎడిట్​ చేసుకునే విధంగా కొత్త ఫీచర్​ను వాట్సాప్​ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

WhatsApp latest news : ఒక్కసారి మెసేజ్​ను ఎడిట్​ చేసిన తర్వాత.. 'వాట్సాప్​ లేటెస్ట్​ వర్షెన్​ని ఉపయోగిస్తూ ఈ చాట్​లో ఉన్నవారందరికీ ఈ మెసేజ్​ ఎడిటెడ్​ చేయడం జరిగింది,' అని ఇంగ్లీష్​లో ఓ టెక్స్ట్​ బాక్స్​ కనిపిస్తుంది.

వాబీటాఇన్​ఫో ప్రకారం.. ఈ ఎడిట్​ ఫీచర్​ ప్రస్తుతానికి మెసేజ్​లకే పరిమితం. ఈ ఫీచర్​ వచ్చిన తర్వాత.. ఫొటోస్​, స్టేటస్​, డాక్యుమెంట్​, వీడియోలకు కూడా ఎడిట్​ ఆప్షన్​ ఇవ్వొచ్చు.

సింగిల్​- ప్లే ఆడియో మెసేజ్​ కూడా..!

WhatsApp latest features : వాట్సాప్​లో ప్రస్తుతం.. 'వ్యూ వన్స్​' ఫీచర్​ ఉంది. దీని ద్వారా ఏదైనా ఫొటో పంపిస్తే.. అవతలి వ్యక్తి దానిని ఒక్కసారి మాత్రమే చూడగలరు. ఈ ఫీచర్​ను ఇక ఆడియో ఫైల్స్​కి కూడా ఇవ్వాలని వాట్సాప్​ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సింగ్​- ప్లే ఆడియో ఫీచర్​ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నట్టు సమాచారం. బీటా యూజర్లకు ఇది త్వరలోనే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం