WhatsApp: ఒకే ఫోన్ లో, ఒకే వాట్సాప్ యాప్ లో ఒకటికి మించిన వాట్సాప్ అకౌంట్స్..! ఇకపై సాధ్యమే..-whatsapp multi account feature check what lies in store ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Whatsapp Multi-account Feature? Check What Lies In Store

WhatsApp: ఒకే ఫోన్ లో, ఒకే వాట్సాప్ యాప్ లో ఒకటికి మించిన వాట్సాప్ అకౌంట్స్..! ఇకపై సాధ్యమే..

HT Telugu Desk HT Telugu
Aug 12, 2023 01:49 PM IST

WhatsApp: మల్టీ పర్పస్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో సరికొత్త ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఒకే ఫోన్ లో, ఒకే వాట్సాప్ యాప్ లో ఒకటికి మించి వాట్సాప్ ఖాతాలను నిర్వహించుకునే అవకాశాన్ని త్వరలో కల్పించనుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

WhatsApp: మల్టీ పర్పస్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో సరికొత్త ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఒకే ఫోన్ లో, ఒకే వాట్సాప్ యాప్ లో ఒకటికి మించి వాట్సాప్ ఖాతాలను నిర్వహించుకునే అవకాశాన్ని త్వరలో కల్పించనుంది.

ట్రెండింగ్ వార్తలు

ఒకే యాప్ లో మల్టిపుల్ అకౌంట్స్

జీమెయిల్ లో మనం ఒకటికి మించిన అకౌంట్లను ఒకే యాప్ లో నిర్వహించుకోవచ్చు. కానీ వాట్సాప్ లో అలా కుదరదు. సాధారణంగా ఒకటికి మించిన వాట్సాప్ అకౌంట్లను ఒకే ఫోన్ లో నిర్వహించుకోవడం కుదరదు. వాట్సాప్ అందుకు అంగీకరించదు. మరో వాట్సాప్ అకౌంట్ ను ఉపయోగించాలంటే, మరో ఫోన్ అవసరం ఉంటుంది. ఇకపై, అలాంటి అవసరం ఉండబోదు. ఒకే ఫోన్ లో, ఒకే వాట్సాప్ యాప్ లో మీరు ఒకటికి మించిన వాట్సాప్ అకౌంట్లను వాడుకోవచ్చు. ఈ దిశగా కొత్త అప్ డేట్ ను వాట్సాప్ తీసుకువస్తోంది. ప్రస్తుతానికి ఈ అప్ డేట్ కొందరు ఎంపిక చేసిన బీటా యూజర్లకు టెస్టింగ్ నిమిత్తం అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఎలా ఓపెన్ చేయడం..

ఈ అప్ డేట్ మీకు అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఈ మల్టీ అకౌంట్ సదుపాయాన్ని మీ ఫోన్ లో యాడ్ చేసుకోవడం చాలా ఈజీ. ఇందుకు మీరు చేయాల్సిందల్లా.. మీ ఫోన్ లోని వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేసి, అక్కడ కనిపించే క్యూఆర్ కోడ్ (QR code) బటన్ పక్కన ఉన్న బాణం (arrow) గుర్తుపై క్లిక్ చేయాలి. అక్కడ మీ వేరే వాట్సాప్ అకౌంట్ ను యాడ్ చేసుకోవాలి. ఆ తరువాత, మీరు ఈ రెండు వాట్సాప్ అకౌంట్స్ ను ఒకే యాప్ లో యూజ్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే, ఆ అకౌంట్ నుంచి లాగౌట్ కావచ్చు. లేదా అకౌంట్ ను డిలీట్ చేయవచ్చు. యూజర్లకు ఈ సరికొత్త ఫీచర్ ఎంతో ఉపయోగపడ్తుందని వాట్సాప్ భావిస్తోంది. దీనివల్ల, వేర్వేరు అవసరాలకు వేర్వేరు వాట్సాప్ అకౌంట్లను వాడే వారికి, అందుకోసం ప్రత్యేకంగా వేరే ఫోన్ ను క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా, ఒకే ఫోన్ లో, ఒకే యాప్ లో ఒకటికి మించిన వాట్సాప్ ఖాతాలను వాడుకునే అవకాశం లభిస్తుంది.

WhatsApp channel