యూజర్స్‌కి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ని తీసుకొచ్చే వాట్సాప్ నుంచి మరో బిగ్ అప్డేట్ రాబోతోంది! మేసేజ్ ట్రాన్స్లేషన్ ఫీచర్‌పై సంస్థ పనిచేస్తోంది. ఇది ఇప్పటికే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్‌లోని వాట్సాప్ బీటా వర్షెన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ కొత్త వాట్సాప్ ‘ట్రాన్స్‌లేట్ మెసజ్’ ఫీచర్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ వాట్సాప్ మేసేజ్ ట్రాన్స్లేషన్ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. వాట్సాప్ లేటెస్ట్ బీటా వర్షెన్‌లో.. ఆటోమెటిక్ ఆన్-డివైజ్ మెసేజ్ ట్రాన్స్‌లేషన్స్ కోసం సెట్టింగ్స్‌లో కొత్త ఆప్షన్ కనిపించింది. వాస్తవానికి వాట్సాప్‌లో మెసేజెస్‌కి ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. అందువల్ల ఈ కొత్త 'ట్రాన్స్‌లేట్ మెసేజ్' ఫీచర్ కంపెనీ సర్వర్ల దగ్గర కాకుండా, యూజర్ల స్మార్ట్‌ఫోన్స్‌లోనే మెసేజ్‌ల భాష మారుతాయి. దానికన్నా ముందు వివిధ లాంగ్వేజ్ ప్యాక్స్‌ని డౌన్లోడ్ చేసుకోవాలని, వాటిల్లో నుంచి ఒకటి ఎంచుకుని మేసేజ్‌లను ట్రాన్స్‌లేట్ చేయాలని వాట్సాప్ యూజర్లను కోరుతుంది. ఈ లాంగ్వేజ్ ప్యాక్స్ ఆఫ్‌లైన్ ఆప్షన్‌తో వస్తాయి. ఫలితంగా ఆఫ్‌లైన్‌లో మెసేజ్‌లు ట్రాన్స్‌లేట్ అవుతాయి.
ఆండ్రాయిడ్ 2.25.12.25లో వాట్సాప్ బీటాని అప్డేట్ చేసిన తర్వాత బీటా టెస్టర్లకు ఈ 'ట్రాన్స్‌లేట్ మెసేజ్' ఫీచర్ కనిపించింది. చాట్ లాక్ సెట్టింగ్ కింద కొత్త టాగిల్ వచ్చింది. ఫీచర్ ట్రాకర్ వాబీటాఇన్ఫో ప్రకారం గతేడాది జులై నుంచే ఈ తరహా ఫీచర్‌ను వాట్సాప్ టెస్ట్ చేస్తంది. వాట్సాప్ ఛాట్స్‌తో పాటు వాట్సాప్ ఛానెల్స్‌లో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.
ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. సంబంధిత చాట్స్‌లో యూజర్లు ట్రాన్స్‌లేట్ మెసేజ్ టాగిల్ని ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసిన తర్వాత, లాంగ్వేజ్ ప్యాక్‌లో నుంచి భాషను ఎంచుకోవాలి. ప్రస్తుతం ఈ లాంగ్వేజ్ ప్యాక్‌లో స్పానిష్, అరబిక్, పోర్చ్యుగీస్, హిందీ, రష్యన్ భాషలు ఉన్నాయి. రానున్న కాలంలో అనేక భాషలను ఇందులో జోడించవచ్చు.
మొత్తం అన్ని చాట్స్‌కి లేదా ఒక్కో చాట్‌ని ఈ కొత్త ఫీచర్ ద్వారా ట్రాన్స్‌లేట్ చేయవచ్చు. ఇందుకోసం ట్రాన్స్‌లేట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఈ ఫీచర్ డీఫాల్ట్‌గా డిసెబుల్ చేసి ఉంటుంది. యాప్ సెట్టింగ్స్ నుంచి దీనిని మేనేజ్ చేసుకోవచ్చు.
వాట్సాప్‌లో వస్తున్న తొలి ఆన్-డివైజ్ లాంగ్వేజ్ ఫీచర్ ఇది కాదు! కొన్ని నెలల క్రితమ వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్షన్ని వాట్సాప్ తీసుకొచ్చింది. ఆడియో మెసేజ్‌లకు ఇది ట్రన్స్స్క్రైబ్స్ని ఇస్తుంది. ఈ ఫీచర్‌కి కూడా లాంగ్వేజ్ ప్యాక్ అవసరం. యూజర్ డివైజ్‌లో ఈ ప్యాక్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ట్రాన్స్క్రిప్షన్స్ అనేవి ఆన్-డివైజ్‌లో జరుగుతాయి.
ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? అన్న విషయంపై సంస్థ ఇంకా స్పందించలేదు. కానీ ఇంగ్లీష్ పాటు ఇతర భాషలు అర్థం కాని వారికి, వారి సొంత భాషల్లో మెసేజ్‌లను ట్రాన్స్‌లేట్ చేసుకుని చదవడానికి ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
సంబంధిత కథనం