WhatsApp new feature: వాట్సాప్ లో త్వరలో చాట్ బాట్ బటన్
WhatsApp new feature: వాట్సాప్ లో త్వరలో కృత్రిమ మేథ ఆధారిత చాట్ బాట్ బటన్ అందుబాటులోకి రానుంది. వాట్సాప్ లోని ఈ బటన్ ద్వారా మెటా ఏఐ (Meta AI) చాట్ బాట్ తో మాట్లాడవచ్చు.
WhatsApp new feature: ప్రస్తుతం కృత్రిమ మేథ ఆధారిత చాట్ బాట్ ల యుగం నడుస్తోంది. చాట్ జీపీటీ సక్సెస్ తరువాత దాదాపు అన్ని ప్లాట్ ఫామ్స్ ఈ ఏఐ ఆధారిత చాట్ బాట్ లను యూజర్ల అందుబాటులోకి తీసుకువచ్చాయి. గూగుల్ బార్డ్ (Google Bard), కో పైలట్ (Copilot), డిస్కార్డ్ క్లైడ్ ఏఐ (Clyde AI), స్నాప్ చాట్ మై ఏఐ (My AI), చైనా బైదు ఎర్నీ (Ernie) చాట్ బాట్.. ఇవన్నీ ఆ కోవలోవే.
ట్రెండింగ్ వార్తలు
వాట్సాప్ చాట్ బాట్
త్వరలో వాట్సాప్ (WhatsApp new feature) కూడా సొంతంగా ఒక చాట్ బాట్ ను యూజర్ల కోసం తీసుకురానుంది. ఇందుకోసం వాట్సాప్ యాప్ లో ఒక ప్రత్యేకమైన బటన్ ను పొందుపర్చనుంది. “కొత్త చాట్‌లను ప్రారంభించడానికి లోగో పైన ఉన్న చాట్స్ ట్యాబ్‌లో కొత్త బటన్ ను పొందుపర్చనున్నారు. ఈ బటన్‌తో, AI-ఆధారిత చాట్‌లను త్వరగా తెరవడం సాధ్యమవుతుంది. ఇది యూజర్లకు మరింత సులువైన చాట్ ఎక్స్ పీరియెన్స్ ను ఇస్తుంది’’ అని వాబీటా ఇన్ఫో (WABetaInfo) వెల్లడించింది.
లేటెస్ట్ వర్షన్ లలో..
ఈ ఏఐ ఆధారిత చాట్ బాట్ ను వాట్సాప్ ఇప్పటికే బీటా వినియోగదారుల కాంటాక్ట్ లిస్ట్ లో పొందుపర్చింది. కానీ దాన్ని వెతుక్కుని యూజ్ చేయడం ఇబ్బందిగా మారిందన్న ఫిర్యాదుల నేపథ్యంలో.. ప్రత్యేకమైన చాట్ బాట్ బటన్ ను యాప్ హోం స్క్రీన్ పై పొందుపర్చనున్నారు. ఇది ఆండ్రాయిడ్ 2.23.24.26 వర్షన్ లో అందుబాటులోకి రానుందని సమాచారం. ఈ బటన్ కుడి దిగువ మూలలో ఉన్న 'కొత్త చాట్' బటన్ పైన ఉంటుంది. ఇది తెల్లటి చతురస్రాకార బటన్, దానిపై రంగురంగుల రింగ్ ఉంటుంది. దానిపై నొక్కడం వలన Meta AI చాట్‌బాట్ త్వరగా తెరవబడుతుంది. AI చాట్‌బాట్‌లు ఒక ప్రయోగాత్మక ఫీచర్. ఇది ప్రస్తుతం వాట్సాప్ బీటాలో మాత్రమే అందుబాటులో ఉంది.