WhatsApp voice chat: వాట్సాప్ వరుస నయా ఫీచర్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. త్వరలో ఒకే ఫోన్ నంబర్ తో, ఒకే మొబైల్ లో ప్రత్యామ్నాయ వాట్సాప్ ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకునే అవకాశం కల్పించనుంది. ఈ ఫీచర్ ఇప్పుడు టెస్టింగ్ దశలో ఉంది. వాట్సాప్ కాల్స్ సమయంలో ఐపీ అడ్రస్ ను దాచి ఉండే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. ఇది యూజర్ కు మరింత సెక్యూరిటీని అందజేస్తుంది.
ఇప్పుడు తాజాగా వాయిస్ చాట్ ఫీచర్ ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ ద్వారా ఇకపై వాయిస్ చాట్ చేసుకోవచ్చు. డిస్కార్డ్ (Discord) నుంచి స్ఫూర్తి పొంది ఈ ఫీచర్ ను వాట్సాప్ రూపొందించింది.ఈ విషయాన్ని వాబీటాఇన్ఫో ఆగస్ట్ నెలలోనే వెల్లడించింది. ఇప్పుడు వాట్సాప్ వాయిస్ చాట్ ఫీచర్ ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు తమ గ్రూప్ చాట్స్ లో ఇక టెక్స్ట్ ద్వారా కాకుండా, నేరుగా మాటలతో సంభాషించుకోవచ్చు.
డిస్కార్డ్ (Discord) యాప్ తరహాలో వాయిస్ చాట్ కు ఇక వాట్సాప్ కూడా అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా యూజర్లు టెక్స్ట్ ద్వారా కాకుండా, మాటలతో చాట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడ్తారు. దాంతో, వాట్సాప్ ఈ వాయిస్ చాట్ ఫీచర్ ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్ తో గ్రూప్ లో వాయిస్ చాట్ ఎవరు చేస్తున్నారో చూడవచ్చు. వారితో వాయిస్ చాట్ లో జాయిన్ కావచ్చు. గ్రూప్ లోని వారంతా చాట్ నుంచి ఎగ్జిట్ అయితే, వాయిస్ చాట్ ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ప్రైమరీ డివైజ్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. సెకండరీ డివైజ్ లో అందుబాటులో ఉండదు. వాయిస్ చాట్ చేస్తున్న సమయంలో, గ్రూప్ మెంబర్స్ కు కానీ, ఇతరులకు కానీ టెక్స్ట్ మెసేజెస్ కూడా పంపించుకోవచ్చు.
వాయిస్ చాట్ ను ప్రారంభించడానికి ముందుగా..