‘Call back’ in WhatsApp: వాట్సాప్ లో త్వరలో ‘కాల్ బ్యాక్’ ఆప్షన్-whatsapp introduces new call back button what does it do ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ‘Call Back’ In Whatsapp: వాట్సాప్ లో త్వరలో ‘కాల్ బ్యాక్’ ఆప్షన్

‘Call back’ in WhatsApp: వాట్సాప్ లో త్వరలో ‘కాల్ బ్యాక్’ ఆప్షన్

HT Telugu Desk HT Telugu
Jun 16, 2023 08:38 PM IST

‘Call back’ in WhatsApp: వాట్సాప్ యూజర్లకు మరో ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. మిస్డ్ వాయిస్, వీడియో కాల్స్ కు కాల్ బ్యాక్ (Call back) ఆప్షన్ త్వరలో అందుబాటులోకి రానుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

‘Call back’ in WhatsApp: వాట్సాప్ యూజర్లకు మరో ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. మిస్డ్ వాయిస్, వీడియో కాల్స్ కు కాల్ బ్యాక్ (Call back) ఆప్షన్ త్వరలో అందుబాటులోకి రానుంది.

WhatsApp callback: నేరుగా కాల్ బ్యాక్ చేసుకోవచ్చు..

మిస్డ్ కాల్ వివరాలు మరింత స్పష్టంగా తెలిసేలా వాట్సాప్ ను అప్ డేట్ చేస్తున్నారు. అలాగే, మిస్డ్ వాయిస్, వీడియో కాల్స్ కు కాల్ బ్యాక్ (Call back) ఆప్షన్ ను తీసుకువస్తున్నారు. ఈ విషయాన్ని వాట్సాప్ తాజా అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు వినియోగదారులకు అందించే వాబీటాఇన్ఫో (WABetaInfo) శుక్రవారం వెల్లడించింది. అందుకు సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేసింది. ఆ స్క్రీన్ షాట్ లో వాట్సాప్ లో ప్రస్ఫుటంగా కనిపించేలా కాల్ బ్యాక్ (Call back) ఆప్షన్ ఉంది. మెసేజెస్ లోనే మిస్డ్ కాల్ వివరాలతో పాటు, కాల్ బ్యాక్ ఆప్షన్ కూడా కింద ఫొటోలో చూపిన విధంగా కనిపిస్తుంది. ఆ కాల్ బ్యాక్ ఆప్షన్ ను టచ్ చేయడం ద్వారా నేరుగా ఆ కాంటాక్ట్ కు వాట్సాప్ కాల్ ద్వారా కాల్ బ్యాక్ చేయవచ్చు.

వాట్సాప్ కాల్ బ్యాక్ ఆప్షన్ స్క్రీన్ షాట్
వాట్సాప్ కాల్ బ్యాక్ ఆప్షన్ స్క్రీన్ షాట్

త్వరలో అందరికీ అందుబాటులోకి..

ప్రస్తుతానికి ఈ ఫీచర్ ప్రయోగ దశలో ఉంది. అందువల్ల ఈ ఫీచర్ కొద్దిమంది ఎంపిక చేసిన బీటా యూజర్లకు మాత్రమే తమ వాట్సాప్ లో ఇది కనిపిస్తుంది. ప్రయోగ దశ ముగిసిన తరువాత, తప్పులు, బగ్స్, టెక్నికల్ ఎర్రర్స్ వంటివేమైనా ఉంటే.. వాటిని సరిదిద్ది, మరోసారి పరీక్షించి, ఆ తరువాత వాట్సాప్ యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకువస్తారు.

WhatsApp channel