WhatsApp: వాట్సాప్ వీడియో కాల్స్ లో ఇకపై స్క్రీన్ షేరింగ్ ఫెసిలిటీ..
WhatsApp: మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఇప్పుడు నిత్యావసరంగా మారింది. అందుకు తగ్గట్టుగానే వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో వినియోగదారుల అవసరాలను తీరుస్తూ ఆకట్టుకుంటోంది.
WhatsApp: మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఇప్పుడు నిత్యావసరంగా మారింది. అందుకు తగ్గట్టుగానే వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో వినియోగదారుల అవసరాలను తీరుస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. ఈ ఫీచర్ తో వాట్సాప్ లో వీడియో కాల్స్ చేస్తున్న సమయంలో.. వారితో మన స్క్రీన్ షేరింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ విషయాన్ని వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా (Meta) వెల్లడించింది.
ల్యాండ్ స్కేప్ మోడ్ లో కూడా..
అంతేకాదు, వాట్సాప్ వీడియో కాల్స్ ను ఇక విశాలమైన స్క్రీన్ తో ల్యాండ్ స్కేప్ మోడ్ లో చేసుకోవచ్చు. ఈ స్క్రీన్ షేరింగ్, ల్యాండ్ స్కేప్ మోడ్ సదుపాయాలను మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తమ మరో ప్రఖ్యాత సోషల్మీడియా ప్లాట్ ఫామ్ ‘ఫేస్ బుక్’ ద్వారా లాంచ్ చేశారు. వాట్సాప్ లో వీడియో కాల్ సమయంలో స్క్రీన్ షేరింగ్ ఫెసిలిటీని యాడ్ చేస్తున్నామని వెల్లడించారు.
ఆప్షన్స్ ఉన్నాయి..
వాట్సాప్ వీడియో కాల్ సమయంలో స్క్రీన్ షేరింగ్ చేసుకునే విషయంలో కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. యూజర్ కావాలనుకుంటే ఫుల్ స్క్రీన్ మోడ్ ను కానీ, లేదా ప్రత్యేకంగా ఒక అప్లికేషన్ ను కానీ షేర్ చేసుకోవచ్చు. స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ కోసం ముందుగా వీడియో కాల్ చేస్తున్న సమయంలో పైన కనిపిస్తున్న షేర్ (Share) ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి. ఈ స్క్రీన్ షేరింగ్ సదుపాయం ద్వారా మన స్క్రీన్ పై ఉన్న డాక్యుమెంట్స్ ను, ఫొటోలను, ఆన్ లైన్ షాపింగ్ వివరాలను షేర్ చేసుకోవచ్చు. లేదా, యాప్స్ యూజ్ చేయడం వంటి వివిధ విషయాల్లో మన పేరెంట్స్ ను గైడ్ చేయవచ్చు. అయితే, ఈ ఫెసిలిటీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుంది. దశల వారీగా ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్ టాప్ వర్షన్లలో దీన్ని ప్రారంభిస్తారు.