WhatsApp new feature : ‘ట్యాగ్ చేయండి- లైక్ చేయండి’.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్ వచ్చేశాయి
WhatsApp status like feature : వాట్సాప్‌లో ఇన్స్టాగ్రామ్ తరహా కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మీరు ఇతరుల స్టేటస్‌ని లైక్ చేయవచ్చు. అంతేకాదు ఇతరులను మీ స్టేటస్‌లో ట్యాగ్ కూడా చేసుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటి వాట్సాప్. కొన్ని సంవత్సరాలుగా, మెటా యాజమాన్యంలోని ఈ యప్ కస్టమర్స్‌ను ఆకర్షించేందుకు వివిధ ఫీచర్స్‌ని తీసుకొస్తోంది.ఇందులో భాగంగానే ఇన్స్టాగ్రామ్ తరహాలోనే అనేక ఫీచర్స్‌ని వాట్సాప్‌లోకి తీసుకొచ్చింది. ఫలితంగా వాట్సాప్ యూజర్స్‌కి ఆప్షన్స్ మరింత పెరిగాయి. ఇక ఇప్పుడు.. ఇలాంటి ఫీచర్స్‌నే వాట్సాప్‌లోకి తీసుకొచ్చింది మెటా ఆధారిత సంస్థ. ఇప్పుడు మీరు స్టేటస్‌లో ఇతరులను ట్యాగ్ చేయొచ్చు, ఇతరుల స్టేటస్‌ని లైక్ చేయొచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వాట్సాప్ కొత్త ఫీచర్- స్టేటస్‌ని 'లైక్' చేయండి..
వాట్సాప్ వినియోగదారులు ఇప్పుడు స్క్రీన్ దిగువ కుడి వైపు కనిపించే కొత్త లైక్ బటన్ని చూడవచ్చు. ఒక్క ట్యాప్‌తో మీరు ఇతరుల స్టేటస్‌ని లైక్ చేయవచ్చు. వారి స్టేటస్ నచ్చిందని తెలియజేయవచ్చు. ఈ స్టేటస్ లైక్‌లు ప్రైవేట్‌గా ఉంటాయి. వాటికి రిప్లై ఇవ్వలేరు. కాబట్టి మీరు స్టేటస్ లైక్ చేసిన వ్యక్తి మాత్రమే దాన్ని చూడగలరు.
ఇదీ చూడండి:- WhatsApp group: మోసపూరిత వాట్సప్ గ్రూప్ లతో జాగ్రత్త; రూ. 1.2 కోట్లు పోగొట్టుకున్న డాక్టర్
ట్యాగ్స్/ ప్రైవేట్ మెన్షన్స్..
మీరు ఇప్పుడు మీ వాట్సాప్ స్టేటస్‌లో ఇతర వినియోగదారులను కూడా ప్రైవేట్‌గా మెన్షన్/ ట్యాగ్ చేయవచ్చు. మీకు దగ్గరగా ఉన్నవారు మీ స్టేటస్‌ను చూసేలా చూసుకోవచ్చు. ఒక వేళ మిమ్మల్ని ఎవరైనా ట్యాగ్ చేస్తే, దాన్ని మీకు కావాల్సిన వారితో రీ-షేర్ చేసుకోవచ్చు. మిమ్మల్ని ఎవరైనా మెన్షన్ చేస్తే ప్రైవేట్‌గా మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది.
ఈ ఫీచర్లు ఇప్పుడు ఒక్కొక్కరికి అందుబాటులోకి వస్తున్నాయి. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.
వాట్సాప్ వీడియో కాల్ ఫిల్టర్లు, బ్యాక్ గ్రౌండ్స్
వీడియో కాల్స్ కోసం ఫిల్టర్లు, బ్యాక్గ్రౌండ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు వాట్సాప్ ఈ వారం ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్‌తో మీరు ఇప్పుడు మీ బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చుకోచ్చు లేదా మరింత పర్సనల్ టచ్ కోసం వీడియో కాల్ సమయంలో ఫిల్టర్‌ని జోడించవచ్చు. 10 ఫిల్టర్లు, 10 బ్యాక్గ్రౌండ్లు ఉంటాయి. మీరు ప్రత్యేకమైన రూపాన్ని సృష్టించడానికి విస్తృత శ్రేణి ఆప్షన్స్‌ని ఎంచుకోవచ్చు. వార్మ్, కూల్, బ్లాక్ అండ్ వైట్, లైట్ లీక్, డ్రీమీ, ప్రిజం లైట్, ఫిష్ఐ, వింటేజ్ టీవీ, ఫ్రాస్టెడ్ గ్లాస్, డుయో టోన్ వంటి ఫిల్టర్ ఆప్షన్లు ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ ఆప్షన్లలో బ్లర్, లివింగ్ రూమ్, ఆఫీస్, కేఫ్, పెబుల్స్, ఫూడీ, స్మూష్, బీచ్, సన్ సెట్, సెలబ్రేషన్ అండ్ ఫారెస్ట్ ఉన్నాయి.
ఫోన్ నెంబర్ లేకుండానే వాట్సాప్‌లో కనెక్ట్ అవ్వొచ్చు..!
అవతలివారికి వాట్సాప్‌లో మెసేజ్ చేయాలంటే వారి ఫోన్ నెంబర్ ఉండాలి. కానీ ఇకపై ఫోన్ నెంబర్ లేకపోయినా.. అవతలి వ్యక్తికి కనెక్ట్ అయ్యేలా వాట్సాప్ కొత్త ఫీచర్ మీద వర్క్ చేస్తోంది. పిన్ సపోర్ట్‌తో అడ్వాన్స్ యూజర్ నేమ్ ఫీచర్ వాట్సాప్ యూజర్ల కోసం అందుబాటులోకి రానుంది. ఇది ఒక అద్భుతమైన ఫీచర్. ఫోన్ నెంబర్లను షేర్ చేయాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. వాట్సాప్ కొత్త ఫీచర్ స్క్రీన్ షాట్‌ను కూడా డబ్ల్యూఏబీటాఇన్ఫో షేర్ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం