WhatsApp new feature: వాట్సాప్ లో కొన్నాళ్ల క్రితం చానల్స్ అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అందులో వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ఇతర ఆర్గనైజేషన్స్ తమ రెగ్యులర్ అప్ డేట్స్ ను అప్ డేట్ చేయవచ్చు. ఆ అప్ డేట్ ఆ చానల్ ను ఫాలో అవుతున్న అందిరికీ చేరుతుంది.
ఆ తరువాత ఆ వాట్సాప్ చానల్ ఫీచర్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ వస్తున్నారు. మేసేజ్ లకు రియాక్ట్ అయ్యే అవకాశం, ఎమోజీలను పంపించే అవకాశం, ఇమేజ్ లను షేర్ చేసే అవకాశం మొదలైనవి కల్పించారు. త్వరలో, వాట్సాప్ చానల్ మెసేజ్ ను ఫార్వర్డ్ చేసే అవకాశం కూడా కల్పించనున్నారు.
ఈ మెసేజ్ ఫార్వర్డ్ ఫీచర్ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉందని, త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానుందని ఎప్పటికప్పుడు వాట్సాప్ వివరాలను వెల్లడించే వాబీటాఇన్ఫో (WABetaInfo) తెలిపింది. ‘‘వాట్సాప్ ఛానెల్‌ల కోసం మెసేజ్ ఫార్వార్డింగ్ ఫీచర్‌ను వాట్సాప్ అభివృద్ధి చేస్తోంది. ఇది యూజర్లు ఒక గ్రూప్ లేదా వ్యక్తి నుండి మరొక గ్రూప్ లేదా వ్యక్తులకు సందేశాలను ఫార్వార్డ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం వాట్సాప్ (WhatsApp) తరహా లోనే, ఇకపై టెక్స్ట్ లేదా ఇమేజ్‌లను ఈ వాట్సాప్ చానల్స్ లోనూ ఫార్వార్డ్ చేయవచ్చు. ప్రస్తుతానికి, ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది’’ అని వాబీటాఇన్ఫో వెల్లడించింది.
ఈ కొత్త మెసేజ్ ఫార్వార్డింగ్ ఫీచర్ తో ఛానెల్ ను నిర్వహించేవారు ఇతర వ్యక్తులు, గ్రూప్స్ నుంచి తమకు వచ్చిన సందేశాలు, వీడియోలు, GIFలు, ఆడియో సందేశాలు, స్టిక్కర్‌లు, అప్‌డేట్‌లు, ఫొటోలను తన చానల్ లోకి ఫార్వర్డ్ చేయవచ్చు. అంతేకాదు, తమకు వచ్చిన మెసేజెస్, ఫొటోస్, వీడియోస్ ను ఎడిట్ చేసి, ఫార్వర్డ్ చేసే అవకాశం కూడా లభించనుంది. వాట్సాప్ చానల్ లో పోల్ ఫీచర్, వాయిస్ మెసేజెస్ ను పంపించే ఫీచర్ కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి.