WhatsApp tips: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్; యూజర్లకు చాలా హెల్ప్ ఫుల్
WhatsApp tips: వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, వారికి మరింత మెరుగైన సేవలను అందించడానికి వీలుగా వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ ను, లేటెస్ట్ అప్ డేట్స్ ను అందిస్తుంటుంది. అందులో భాగంగానే మరో యూజర్ ఫ్రెండ్లీని అందుబాటులోకి తీసుకువస్తోంది.
WhatsApp tips: వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, వారికి మరింత మెరుగైన సేవలను అందించడానికి వీలుగా వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ ను, లేటెస్ట్ అప్ డేట్స్ ను అందిస్తుంటుంది. అందులో భాగంగానే మరో యూజర్ ఫ్రెండ్లీని అందుబాటులోకి తీసుకువస్తోంది.
ఫొటోస్, వీడియోస్ క్యాప్షన్స్ ఎడిటింగ్
తాజాగా, వాట్సాప్ లోని ఫొటోస్ (photos), వీడియోస్ (videos), జీఐఎఫ్ (GIFs), డాక్యుమెంట్స్ (documents) క్యాప్షన్స్ ను ఎడిటింగ్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. ఇప్పటికే కొందరు యూజర్లకు టెస్టింగ్ నిమిత్తం ఈ సదుపాయం కల్పించారు. ఈ కొత్త ఫీచర్ ప్రకారం.. యూజర్లు ఫొటోస్ (photos), వీడియోస్ (videos), జీఐఎఫ్ (GIFs), డాక్యుమెంట్స్ (documents) యొక్క క్యాప్షన్స్ ను మళ్లీ ఎడిట్ చేసి పంపించవచ్చు. త్వరలో ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ తదితర వాట్సాప్ వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉండబోతోందని వాట్సాప్ ప్రకటించింది. ఇప్పటివరకు వీడియోస్ (videos), జీఐఎఫ్ (GIFs) వంటి మీడియా మెసేజెస్ ను ఎడిట్ చేసే సదుపాయం వాట్సాప్ లో లేదు. ఈ ఫీచర్ ను ఉపయోగించడానికి.. యూజర్ ముందుగా తాము పంపించిన ఫొటోస్ (photos), వీడియోస్ (videos), జీఐఎఫ్ (GIFs), లేదా డాక్యుమెంట్స్ వంటి మీడియా మెసేజ్ పై కాసేపు వేలితో నొక్కి పట్టి ఉంచితే, పాప్ అప్ మెన్యూ ఓపెన్ అవుతుంది. అందులో నుంచి ఎడిట్ ఆప్షన్ ను ఎంచుకుని, ఆ ఫొటోస్ (photos), వీడియోస్ (videos), జీఐఎఫ్ (GIFs), డాక్యుమెంట్స్ కాప్షన్ లో ఏవైనా తప్పులుంటే సరి చేసి, లేదా కాప్షన్ ను పూర్తిగా మార్చి, మళ్లీ పంపించవచ్చు. మీడియా మెసేజెస్ ను పంపించిన 15 నిమిషాల లోపు మాత్రమే ఈ ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
ఎడిట్ టెక్స్ట్ మెసేజెస్
ఈ సంవత్సరం మే నెలలో ఒక యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్ ను వాట్సాప్ ప్రారంభించింది. ఆ ఫీచర్ ప్రకారం.. యూజర్లు తాము వేరేవారికి పంపించిన మెసేజెస్ ను, పంపించిన 15 నిమిషాల లోపు రీకాల్ చేసుకుని ఎడిట్ చేసి, మళ్లీ పంపించవచ్చు. ఇందుకు గానూ యూజర్లు తాము పంపించిన మెసేజ్ పై కాసేపు వేలితో నొక్కి పట్టి ఉంచితే, పాప్ అప్ మెన్యూ ఓపెన్ అవుతుంది. అందులో నుంచి ఎడిట్ ఆప్షన్ ను ఎంచుకుని, ఆ మెసేజ్ లో ఏవైనా తప్పులుంటే సరి చేసి, మళ్లీ పంపించవచ్చు.