Budget 2025: బడ్జెట్ తరువాత వేటి ధరలు తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి?-whats cheaper and what is costlier after nirmala sitharamans budget ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget 2025: బడ్జెట్ తరువాత వేటి ధరలు తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి?

Budget 2025: బడ్జెట్ తరువాత వేటి ధరలు తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి?

Sudarshan V HT Telugu
Feb 01, 2025 12:49 PM IST

Budget 2025: 2024 లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో తిరిగి అధికారంలోకి వచ్చిన మోదీ 3.0 ప్రభుత్వానికి ఇది రెండో పూర్తిస్థాయి బడ్జెట్. ఈ బడ్జెట్ అనంతరం కొన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. మరికొన్ని వస్తువుల ధరలు తగ్గుతాయి.

 బడ్జెట్ తరువాత వేటి ధరలు తగ్గుతాయి?
బడ్జెట్ తరువాత వేటి ధరలు తగ్గుతాయి? (Sansad TV)

Budget 2025: 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ తో ధరలు తగ్గే, లేదా ధరలు పెరిగే వస్తువుల వివరాలు ఇక్కడ ఉన్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో తిరిగి అధికారంలోకి వచ్చిన మోదీ 3.0 ప్రభుత్వానికి ఇది రెండో పూర్తిస్థాయి బడ్జెట్. వ్యవసాయం, తయారీ, ఉపాధి, ఎంఎస్ఎంఈలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఆవిష్కరణలు మొదలుకొని 10 విస్తృత రంగాలపై ఈ ఏడాది బడ్జెట్ దృష్టి సారించింది. పరివర్తనాత్మక సంస్కరణలకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.

బడ్జెట్ 2025 లైవ్ అప్డేట్స్

  • 36 లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ కు బేసిక్ కస్టమ్ డ్యూటీల నుంచి మినహాయింపు.
  • సీసం, జింక్, మరో 12 ఖనిజాలను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయించాలని కేంద్రం ప్రతిపాదించింది.
  • నౌకల తయారీకి అవసరమైన ముడి సరుకులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని మరో పదేళ్ల పాటు మినహాయించారు.
  • సముద్ర ఉత్పత్తులపై బేసిక్ కస్టమ్ డ్యూటీని 35 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
  • గత ఏడాది కేంద్ర బడ్జెట్లో మొబైల్ ఫోన్, బంగారం, వెండి, రాగి ధరలను తగ్గిస్తూ ఆర్థిక మంత్రి చర్యలు ప్రకటించారు.
  • మూడు క్యాన్సర్ చికిత్స మందులకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చారు.
  • నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్లపై కస్టమ్స్ సుంకాన్ని 25 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రతిపాదించింది. నిర్దిష్ట టెలికాం పరికరాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచారు.

Whats_app_banner