మీరు కారు రుణం, గృహ రుణం, వ్యక్తిగత రుణం లేదా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా, వాణిజ్య బ్యాంకులు మీ క్రెడిట్ అర్హతను తనిఖీ చేస్తాయి. క్రెడిట్ స్కోర్ అనేది 300 నుంచి 900 మధ్య ఉండే మూడు అంకెల సంఖ్య. మీ పేమెంట్ హిస్టరీ, మొత్తం క్రెడిట్ మిక్స్, క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (సియుఆర్) తో సహా అనేక అంశాలు మీ క్రెడిట్ స్కోరును ప్రభావితం చేస్తాయి. క్రెడిట్ స్కోర్ల గురించి అనేక అపోహలు ఉన్నాయి. ఇక్కడ, ఆ అపోహలలో కొన్నింటిని తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.
మీకు అప్పు ఎంత ఉంది అన్న విషయం ముఖ్యమైనదే కానీ, క్రెడిట్ స్కోర్ విషయంలో మీ క్రెడిట్ యుటిలైజేషన్ నిష్పత్తి, పేమెంట్ హిస్టరీ, మీ క్రెడిట్ అకౌంట్లను ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు వంటి అంశాలు ఎక్కువ ప్రభావం చూపుతాయి.
ఇది నిజం కాదు దీనికి విరుద్ధంగా, పాత క్రెడిట్ ఖాతాలను మూసివేయడం వల్ల మీ సగటు క్రెడిట్ హిస్టరీ తగ్గుతుంది. దాంతో, మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని పెరుగుతుంది. తద్వారా మీ క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది.
ఇది అవాస్తవం. ఒక్క మిస్డ్ పేమెంట్ కూడా మీ క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రత్యేకించి మీ క్రెడిట్ హిస్టరీ ఇప్పుడే ప్రారంభమైతే, పేమెంట్స్ ను మిస్ చేయడం మీ స్కోర్ ను భారీగా దెబ్బతీస్తుంది. పేమెంట్ హిస్టరీ అనేది కీలకమైన అంశం. ఇది మీ స్కోరులో దాదాపు 35 శాతం ఉంటుంది.
ఆర్థిక క్రమశిక్షణకు ఒక క్రెడిట్ కార్డు మాత్రమే కలిగి ఉండడం మంచిదే. కానీ, మీ అవసరాలకు అనుగుణంగా, మీ పేమెంట్ సామర్ధ్యాన్ని అంచనా వేసుకుని, ఒకటికి మించి క్రెడిట్ కార్డులు కలిగి ఉండడం మీ క్రెడిట్ స్కోర్ పెరగడానికి ఉపయోగపడుతుంది. సుదీర్ఘ క్రెడిట్ చరిత్ర కలిగి ఉండటం దీర్ఘకాలికంగా మీ స్కోరును పెంచడానికి సహాయపడుతుంది.
డెబిట్ కార్డ్ యాక్టివిటీ మీ క్రెడిట్ స్కోర్ పై ఎటువంటి ప్రభావం చూపదు. ఎందుకంటే ఇది క్రిఫ్, హై మార్క్ వంటి క్రెడిట్ బ్యూరోలు డెబిట్ కార్డు యాక్టివిటీలను పరిగణనలోకి తీసుకోవు. క్రెడిట్ కార్డులు, రుణాలు వంటి క్రెడిట్ ప్రొడక్ట్స్ మాత్రమే మీ స్కోరును ప్రభావితం చేస్తాయి.
మీ క్రెడిట్ స్కోర్ ను మీరే చెక్ చేయడాన్ని సాఫ్ట్ ఎంక్వైరీ అంటారు. ఇది మీ స్కోరుపై ఎటువంటి ప్రభావం చూపదు. హార్డ్ ఎంక్వైరీలు మాత్రమే మీ స్కోరును ప్రభావితం చేస్తాయి. అప్పుడు కూడా, వాటి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది.
సూచన: ఈ వ్యాసం రుణాలు, క్రెడిట్ కార్డులు, క్రెడిట్ స్కోర్ వంటి క్రెడిట్ అవసరాల గురించి అవగాహన కల్పించడానికి మాత్రమే ఉద్దేశించబడింది. అధిక వడ్డీ రేట్లు, హిడెన్ ఛార్జీల వంటి రిస్క్ లతో వస్తుంది కాబట్టి క్రెడిట్ తీసుకోవడాన్ని హెచ్ టీ తెలుగు ప్రోత్సహించదు. ఏదైనా క్రెడిట్ తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులతో చర్చించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.
సంబంధిత కథనం