When to buy own house : ఏ వయస్సులో సొంత ఇల్లు కొనాలి? 30ఏళ్లలోపే కొంటే వచ్చే సమస్యలేంటి?-what is the ideal age to buy own house in india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  When To Buy Own House : ఏ వయస్సులో సొంత ఇల్లు కొనాలి? 30ఏళ్లలోపే కొంటే వచ్చే సమస్యలేంటి?

When to buy own house : ఏ వయస్సులో సొంత ఇల్లు కొనాలి? 30ఏళ్లలోపే కొంటే వచ్చే సమస్యలేంటి?

Sharath Chitturi HT Telugu
Jun 29, 2024 07:30 AM IST

Right age to buy house : ఏ వయస్సులో సొంతిల్లు కొనుక్కోవాలి? 30ఏళ్లలోపు ఇల్లు కొంటే వచ్చే సమస్యలేంటి? అసలు ఇల్లు కొనుక్కోవాలంటే ఏ విషయాలను పరిగణలోకి తీసుకోవాలి? ఇక్కడ చూడండి..

ఏ వయస్సులో సొంత ఇల్లు కొనాలి?
ఏ వయస్సులో సొంత ఇల్లు కొనాలి?

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల! ఎప్పటికైనా మనకంటూ ఒక ఇల్లు ఉండాలని అందరు భావిస్తూ ఉంటారు. అయితే ఇల్లు కట్టడం లేదా కొనడం అనేది చాలా పెద్ద విషయం. చాలా ఫ్యాక్టర్స్​ దీనిని ప్రభావితం చేస్తాయి. గతంలో 35-40ఏళ్లప్పుడు ప్రజలు సొంతిల్లు కొనుక్కునేవారు. కానీ ఇప్పుడు, చాలా మంది తమ పిల్లలకు ఉద్యోగం వచ్చినప్పుడే సొంత ఇల్లు కొనుక్కోవాలని ఒత్తిడి చేస్తున్నారు. చాలా మంది కొంటున్నారు కూడా! అసలు ఇల్లు కట్టాలంటే ఏ విషయాలను పరిగణలోకి తీసుకోవాలి? ఏ వయస్సులో ఇల్లు కొంటే మంచిది? 30ఏళ్లలోపే ఇల్లు కొంటే వచ్చే సమస్యలేంటి? ఇక్కడ తెలుసుకోండి..

సొంతిల్లు కొనే ముందు ఏ విషయాలను పరిగణించాలి?

సొంత ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కల కాబట్టి.. చాలా మంది దానికి ఎమోషనల్​గా కనెక్ట్​ అవుతారు. ఎమోషనల్​గా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అది సరైనది కాదు. ఇందులో చాలా డబ్బు ఖర్చు ఉంటుంది కాబట్టి చాలా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి.

సొంత ఇంటి కోసం డౌన్​పేమెంట్​ కట్టాల్సి ఉంటుంది. మొత్తం ప్రాపర్టీ వాల్యూలో కనీసం 20శాతం డౌన్​పేమెంట్​ కడితే బెటర్​. ఇలా చేస్తే తీసుకునే లోన్​, వడ్డీ రేటు భారం తగ్గుతుంది.

అంత డౌన్​పేమెంట్​ కోసం డబ్బులు సేవ్​ చేసేందుకు టైమ్​ పట్టినప్పటికీ, మనకి మంచి బెనిఫిట్స్​ ఉంటాయి. మన మీద అధిక రుణభారం ఉండదు. త్వరగా దానిని క్లియర్​ కూడా చేసుకోవచ్చు. మన ఫైనాన్షియల్​ స్టెబిలిటీ కూడా మెరుగ్గా ఉంటుంది.

పైగా.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు అధికంగా ఉన్నాయి. ఈ సమయంలో పెద్ద హోమ్​ లోన్​ తీసుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే, మన జేబు నుంచి ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు తక్కువ ఉన్నప్పుడు కొంటే బెటర్​!

పైగా.. కెరీర్​ స్టెబిలిటీ కూడా చాలా ముఖ్యం. ఇల్లు కట్టడం అనేది దీర్ఘకాలిక పెట్టుబడి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 నుంచి 35ఏళ్లు వచ్చేసరికి కెరీర్​లో స్టెబిలిటీ కనిపిస్తుంది. అందుకే చాలా మంది 35ఏళ్లు దాటిన తర్వాత ఇల్లు కట్టుకునేందుకు ప్లాన్​ చేస్తూ ఉంటారు.

ఇక్కడ క్రెడిట్​ స్కోర్​ కూడా చాలా ముఖ్యం. మీరు ఎంత మంచి క్రెడిట్​ స్కోర్​ని బిల్డ్​ చేసుకుంటే, మీ మీద ఆర్థిక భారం అంత తగ్గుతుంది. క్రెడిట్​ స్కోర్​ 750 కన్నా ఎక్కువ ఉంటే తక్కువ వడ్డీకి హోమ్​ లోన్​ పొందడానికి అవకాశం ఉంటుంది. క్రెడిట్​ స్కోర్​ తక్కువగా ఉంటే మాత్రం, అంత పెద్ద లోన్​ తీసుకోవాలంటే ఆలోచించాల్సి ఉంటుంది.

సొంతింటి కలపై రియల్​ ఎస్టేట్​ ప్రభావం కూడా ఉంటుంంది. పరిస్థితులు మనకి అనుకూలంగా ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోవాలి. ప్రాపర్టీ ధరలు లొకేషన్​ బట్టి మారుతుంటాయి కాబట్టి, ముందు మీరు మీ బడ్జెట్​పై ఒక నిర్ణయం తీసుకోవాలి. దానికి తగ్గట్టుగానే అడుగులు వేయాలి.

ఏ వయస్సులో సొంతిల్లు ఎప్పుడు కొనాలి?

ఇండియాలో సాధారణంగా 22, 23ఏళ్లు వచ్చేసరికి ఉద్యోగం మొదలుపెడుతుంటారు. అప్పుడే, సొంతిల్లు వంటి పెద్ద విషయాల గురించి ఆలోచించకపోవడం ఉత్తమం! పైన చెప్పినట్టు.. డౌన్​పేమెంట్​, కెరీర్​ స్టెబిలిటీపై ఫోకస్​ చేసి డబ్బులను సేవ్​ లేదా ఇన్​వెస్ట్​ చేస్తూ ఉండాలి. క్రెడిట్​ స్కోర్​ని పెంచుకునే పని చేయాలి. ఇవన్నీ చేయాలంటే కచ్చితంగా టైమ్​ పడుతుంది.

30ఏళ్లలోపే ఇల్లు కొంటే మన మీద చాలా భారం పడుతుంది. చాలీచాలనీ జీతాలు వస్తుంటే, పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. చాలా మందికి.. చేస్తున్న ఉద్యోగం నచ్చదు. కానీ చేసిన అప్పులను తీర్చుకునేందుకు వేరే ఆప్షన్​ లేక ఉండిపోతారు. పైగా.. 30ఏళ్లలోపే పెళ్లి, కారు వంటి ఖర్చులు ఉంటాయి. అవేమీ చిన్న ఖర్చులు కావు! అందుకే.. 30ఏళ్లలోపు కెరీర్​ని సెట్​ చేసుకోవడంపై ఫోకస్​ చేయాలి. 'సొసైటీ ప్రెజర్'లో అస్సలు పడకండి. వాళ్లు కొన్నారు, వీళ్లు కొన్నారు అని మీ మీద మీరు ఒత్తిడి పెంచుకోకండి. అందరి ఆర్థిక పరిస్థితి ఒకే విధంగా ఉండదు. సరైన నిర్ణయాలు తీసుకుంటే, మీరు ఇల్లు కట్టుకోవచ్చు.

కెరీర్​, ట్రావెలింగ్​, ఎడ్జ్యుకేషన్​పై ఆలోచించేవారు.. 30ఏళ్లలోపు ఇల్లు తీసుకోవడం ఉత్తమం కాదు. 30ఏళ్లు దాటి తర్వాత.. సెటిల్​ అవ్వడానికి రెడీగా ఉన్నట్టు మీకు అనిపిస్తే, అప్పుడు ఇల్లు కొనడంపై ఆలోచనలు మొదలుపెట్టొచ్చు. ఆ సమయానికి మీ దగ్గర తగిన సేవింగ్స్​ కూడా ఉంటాయి. 35ఏళ్ల వయస్సులో ఇల్లు కట్టుకోవడం అనేది బ్యాలెన్స్​డ్​ అప్రోచ్​గా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కెరీర్​, ఇన్​వెస్ట్​మెంట్స్​ అన్నీ ట్రాక్​లో పడతాయి.

చివరిగా.. 20ఏళ్లైనా, 30ఏళ్లైనా, 40ఏళ్లైనా.. మీరు ఫైనాన్షియల్​గా ఫిట్​గా ఉంటేనే హోం లోన్​ వంటి భారీ భారాన్ని మీ భుజాల మీద మోసేందుకు సిద్ధమవ్వండి.

Whats_app_banner

సంబంధిత కథనం