What is cruise control in car : క్రూజ్ కంట్రోల్ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది?
క్రూజ్ కంట్రోల్.. ఈ టెక్నాలజీకి ఈ మధ్య కాలంలో డిమాండ్ పెరుగుతోంది. అసలు క్రూజ్ కంట్రోల్ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుంది? ఇక్కడ తెలుసుకోండి..

Cruise control in car : ఇప్పుడు కారు అనేది.. కేవలం ప్రయాణాలకు ఉపయోగించే ఒక సాధానం మాత్రమే కాదు. అంతకు మించి! అధునాత సాంకేతికతపై ఫోకస్ చేస్తున్న ఆటోమొబైల్ సంస్థలు.. ఇప్పుడు తమ వాహనాల్లో అనేక ఫీచర్స్‌ని ఇస్తున్నాయి. వాటిల్లో క్రూజ్ కంట్రోల్ ఒకటి. ఇటీవలి కాలంలో ఈ క్రూజ్ కంట్రోల్‌కి మంచి డిమాండ్ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే, వాహనాలు తయారు చేసే సంస్థలు.. మిడ్ రేంజ్ వేరియంట్స్ నుంచే ఈ ఫీచర్‌ని అందిస్తున్నాయి. మరి.. అసలు క్రూజ్ కంట్రోల్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? ఇక్కడ డిటైల్డ్‌గా తెలుసుకుందాము..
క్రూజ్ కంట్రోల్ అంటే ఏంటి?
క్రూజ్ కంట్రోల్ గురించి తెలుసుకునే ముందు.. అడాస్ గురించి తెలుసుకోవాలి. అడాస్ (ఏడీఏఎస్) అంటే.. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టెమ్స్. ఈ మధ్యకాలంలో ఈ పేరు చాలా ఎక్కువ వినిపిస్తోంది. వెహికిల్ సేఫ్టీకి సంబంధించిన అన్ని ఫీచర్స్ దీని కిందకి వస్తాయి. క్రూజ్ కంట్రల్, క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, పార్క్ అసిస్ట్, రేర్ కొలిజన్ వార్నింగ్, సరౌండ్ వ్యూ, లేన్ డిపార్చర్ వార్నింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నీషన్, ఆటోమెటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటివి కొన్ని అడాస్ ఫీచర్స్. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ సాయంతో ఇవి పనిచేస్తాయి. సెన్సార్లు, రాడార్, కెమెరాలు హార్డ్‌వేర్ కిందకి వస్తాయి.
ఈ మధ్య కాలంలో చాలా వాహనాలకు అడాస్ ఫీచర్ ఉంటోంది. ఇందులో లెవల్ 1, లెవల్ 2 అని ఉంటాయి. తాజాగా విడుదలైన మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఎస్‌యూవీలో లెవల్ 2 అడాస్ ఫీచర్స్‌ని ఇస్తోంది సంస్థ. ఇతర కార్లలో లెవల్ 1 అడాస్ ఫీచర్స్ ఉంటాయి.
Best car with cruise control : ఇక క్రూజ్ కంట్రోల్ విషయానికొస్తే.. దీని అర్థం దీని పేరులోనే ఉంది. తగిన స్పీడ్‌లో కాన్స్టెంట్గా వెళ్లడమే క్రూజ్ కంట్రోల్. డ్రైవర్.. ఒక స్పీడ్ లిమిట్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇక యాక్సలరేటర్ని ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు.
క్రూజ్ కంట్రోల్లో ఇంకో అడ్వాన్స్డ్ ఫీచర్ కూడా ఉంది. దీని పేరు అడాప్టివ్ క్రూజ్‌కంట్రోల్. సాధారణ క్రూజ్ కంట్రోల్‌కి అప్డేటెడ్ వర్షెన్లా ఉంటుంది ఇది. ఇదొక అడ్వాన్స్డ్ ఆటోమేటెడ్ టెక్నాలజీ. ఇందులో.. ఒకసారి స్పీడ్ సెట్ చేస్తే.. వాహనం ఆ స్పీడ్‌లో ప్రయాణించడమే కాదు, పరిసర ట్రాఫిక్‌కి అనుగుణంగా స్పీడ్‌ని అడ్జెస్ట్ కూడా చేసుకుంటుంది! ఫలితంగా.. సేఫ్టీ మరింత పెరుగుతుంది. ఇది.. ఆటోమెటిక్ బ్రేకింగ్ టెక్నాలజీని వాడుకుని.. కారు వేగాన్ని తగ్గిస్తుంది, పెంచుతుంది.
క్రూజ్ కంట్రోల్ టెక్నాలజీలో అక్చుయేటర్ ఉంటుది. ఇది థ్రాటిల్ ఇన్‌పుట్‌ని కంట్రోల్ చేసి, ప్రీ-సెట్ స్పీడ్‌ని మెయిన్టైన్ చేస్తుంది. డ్రైవర్ ఒక స్పీడ్‌లో బండిని నడిపినట్టే.. ఇది కూడా పనిచేస్తుంది. ఇక అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్లో కూడా ఇదే టెక్నాలజీ ఉంటుందని కానీ.. ఇందులో ఆటోమెటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సెటప్ ఉంటుంది. ట్రాఫిక్ సమయంలో డ్రైవర్ యాక్సలేటర్- బ్రేక్‌ని ఎలా వాడతాడో.. ఇది కూడా అలాగే సొంతంగా పనిచేస్తుంది.
How does cruise control work : సాధారణంగా.. క్రూజ్ కంట్రోల్‌ని ఒక బటన్ ద్వారా యాక్టివేట్, డీయాక్టివేట్ చేయవచ్చు. స్టీరింగ్ వీల్ మీద ఉండే కన్సోల్‌లో క్రూజ్ కంట్రోల్ సెట్టింగ్స్ ఉంటాయి.
సంబంధిత కథనం