LIC Bima Sakhi : పది పాసైన మహిళలకు డబ్బులు సంపాదించే అవకాశం.. ఎల్ఐసీ బీమా సఖీ!-what is bima sakhi yojana launched by modi know this scheme eligibility and earnings to women ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Lic Bima Sakhi : పది పాసైన మహిళలకు డబ్బులు సంపాదించే అవకాశం.. ఎల్ఐసీ బీమా సఖీ!

LIC Bima Sakhi : పది పాసైన మహిళలకు డబ్బులు సంపాదించే అవకాశం.. ఎల్ఐసీ బీమా సఖీ!

Anand Sai HT Telugu
Dec 09, 2024 02:33 PM IST

LIC Bima Sakhi : మహిళలను ప్రొత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెడుతోంది. తాజాగా బీమా సఖీ పథకాన్ని తీసుకొచ్చింది. దీనిద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు మంచి ఉపాధి అవకాశం రానుంది.

బీమా సఖీ పథకం
బీమా సఖీ పథకం

గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఎల్‌ఐసీ బీమా సఖీ యోజనను ప్రారంభించారు. బీమా సఖీ యోజన కోసం మెుదట 1 లక్ష మంది మహిళలకు ఎల్‌ఐసీ ఏజెంట్లుగా పనిచేయడానికి శిక్షణ ఇస్తారు. ఇంతకీ కొత్త ప్లాన్ ఏంటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అర్హతలు ఏమిటి? చూద్దాం..

yearly horoscope entry point

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తన పథకం ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో ఉంది. ఈ బీమా సఖీ పథకంలో పనిచేసే వారిని ఏజెంట్లు, బీమా సఖీలు అంటారు.

బీమా సఖీ యోజన ప్రారంభోత్సవ కార్యక్రమం డిసెంబర్ 9న హర్యానాలోని పానిపట్‌లో జరిగింది. ఈ పథకం ద్వారా మహిళలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో మెుదలైంది. గ్రామీణ మహిళలకు ఈ పథకం ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి.

బీమా సఖీ యోజన 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల 10వ తరగతి ఉత్తీర్ణులైన మహిళల కోసం రూపొందించారు. ఈ పథకం కింద మహిళలకు మూడేళ్లపాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. మూడేళ్లపాటు స్టైఫండ్‌ కూడా అందిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత మహిళలు ఎల్ఐసీ ఏజెంట్లుగా పనిచేయడానికి అర్హులుగా పరిగణిస్తారు. ఇది మాత్రమే కాదు గ్రాడ్యుయేట్ స్థాయి బీమా సఖీలు ఎల్‌ఐసీలో డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా కూడా అవకాశం పొందుతారు.

ఈ పథకానికి ఎంపికైన మహిళలకు మొదటి సంవత్సరం ప్రతి నెలా రూ.7,000 అందజేస్తారు. రెండో సంవత్సరంలో ఈ మొత్తాన్ని రూ.6000 వస్తుంది. మూడో సంవత్సరంలో ప్రతినెలా రూ.5వేలు ఇస్తారు. తమ లక్ష్యాలను పూర్తి చేసిన వారికి ప్రత్యేక కమీషన్ కూడా దక్కుతుంది. ఈ పథకంలో మొదటి దశలో 35 వేల మంది మహిళలకు బీమా ఏజెంట్లుగా ఉపాధి కల్పించనున్నారు. ఆ తర్వాత మరో 50 వేల మంది మహిళలకు పథకం లబ్ధి చేకూరనుంది.

బీమా ఏజెంట్లుగా పని చేస్తున్నప్పుడు గ్రామీణ మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి బీమా సఖి యోజన ఈ పథకాన్ని అభివృద్ధి చేసింది. ఈ పథకం కమీషన్ ఆధారిత ప్రోత్సాహకాలతో పాటు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. మరిన్ని వివరాల కోసం ఎల్ఐసీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఎవరు అర్హులు

ఈ పథకం కోసం వయోపరిమితి 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీసం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.

గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

గ్రామీణ మహిళలకు బీమా ఏజెంట్లుగా వృత్తిపరమైన అవకాశాలను అందించడం ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయడం ఈ పథకం లక్ష్యం.

Whats_app_banner