personal loan: పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిదేనా? లాభనష్టాలేంటి?
Personal loan: అప్పు తీసుకోని వ్యక్తులు చాలా అరుదు. ఏదో ఒక సందర్భంలో దాదాపు ప్రతీ ఒక్కరు అప్పు తీసుకుంటుంటారు. అవి చేబదులు కావచ్చు, బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు ఇచ్చే రుణాలు కావచ్చు. సాధారణంగా, చాలా మంది అనూహ్య ఖర్చులు వచ్చిపడినప్పుడు బ్యాంకుల్లో పర్సనల్ లోన్స్ తీసుకుంటారు.
Personal loan: వ్యక్తిగత రుణాలను బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు ఇస్తాయి. ఇది ఒక నిర్దిష్ట మొత్తాన్ని అప్పుగా తీసుకుని, తరువాత మీరు ముందుగా నిర్ణయించిన వ్యవధిలో, వడ్డీతో సహా నిర్ణీత నెలవారీ వాయిదాల ద్వారా తిరిగి చెల్లిస్తారు.
ఆన్ లైన్ లో కూడా పర్సనల్ లోన్ తీసుకోవచ్చు
ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ పొందడం చాలా వేగవంతమైన, సౌకర్యవంతమైన పద్ధతి. మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థ వెబ్సైట్లో మీ కనీస వేతనం, క్రెడిట్ స్కోరు వంటి వివరాలను నమోదు చేసి, మీకు పర్సనల్ లోన్ పొందే అర్హత ఉందా? లేదా?, ఉంటే ఎంత మొత్తం పర్సనల్ లోన్ లభిస్తుంది? అనే వివరాలను తక్షణమే పొందవచ్చు. వేర్వేరు బ్యాంక్ లు, ఫైనాన్స సంస్థలు వసూలు చేసే వడ్డీ రేట్లు, ఫీజులు, ఈఎంఐ మొత్తాలను అంచనా వేయడానికి ఆన్ లైన్ లోనే ‘లోన్ కంపేర్’ సదుపాయం కూడా ఉంటుంది. పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత ఎక్కడ పర్సనల్ లోన్ తీసుకోవడం లాభదాయకమో గుర్తించి, అక్కడ లోన్ ప్రాసెసింగ్ ను ప్రారంభించండి. సాధారణంగా లోన్ ఇవ్వడానికి ముందు.. మీ పాన్ కార్డు, శాలరీ స్లిప్పులు, బ్యాంక్ స్టేట్మెంట్లు వంటి డాక్యుమెంట్లను స్కాన్ చేసి, ఆ కాపీలను అందించాల్సి ఉంటుంది.
పర్సనల్ లోన్స్ తో లాభనష్టాలు..
పర్సనల్ లోన్ మీ జీవితంలోని ఆర్థిక మైలురాళ్లను పరిష్కరించడానికి అనువైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఇంకా, వ్యక్తిగత రుణాన్ని ఎంచుకోవడంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి, వాటిలో కొన్ని:
- పర్సనల్ లోన్ తీసుకోవడానికి ఎలాంటి పూచీకత్తు (కారు లేదా ఇల్లు వంటివి) ఇవ్వాల్సిన అవసరం లేదు.
- వ్యక్తిగత రుణాల వడ్డీ రేటు మొత్తం వ్యవధికి స్థిరంగా ఉంటుంది. రుణ చెల్లింపు ప్రణాళికను ఇది సులభతరం చేస్తుంది.
- పర్సనల్ లోన్స్ ను ఈఎంఐ విధానంలో ఒకటి నుండి ఏడు సంవత్సరాల లోపు తీర్చేలా ప్లాన్ చేసుకోవచ్చు.
- ఇతర రుణ విధానాలకు భిన్నంగా, పర్సనల్ లోన్స్ కు తక్కువ డాక్యుమెంటేషన్ ఉంటుంది.
- అయితే, పర్సనల్ లోన్స్ పై బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు వసూలు చేసే వడ్డీ, హోం లోన్, వెహికిల్ లోన్ వంటి రుణాలకు వసూలు చేసే వడ్డీ కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది.
- పర్సనల్ లోన్స్ కు ఎలాంటి పూచికత్తు ఉండదు. కనుక, రీపేమెంట్ చేయగల సామర్ధ్యాన్ని ఎక్కువగా పరీక్షిస్తారు.
- ఒకవేళ, ఏదైనా కారణం చేత ఈఎంఐ చెల్లించనట్లైతే, జరిమానాలు కూడా భారీగా ఉంటాయి.