పర్సనల్​ లోన్​ ఈఎంఐ- ఒక్కసారి మిస్​ అయితే ఎంత నష్టమో తెలిస్తే షాక్​ అవుతారు!-what happens if you miss a personal loan emi find out here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  పర్సనల్​ లోన్​ ఈఎంఐ- ఒక్కసారి మిస్​ అయితే ఎంత నష్టమో తెలిస్తే షాక్​ అవుతారు!

పర్సనల్​ లోన్​ ఈఎంఐ- ఒక్కసారి మిస్​ అయితే ఎంత నష్టమో తెలిస్తే షాక్​ అవుతారు!

Sharath Chitturi HT Telugu

పర్సనల్​ లోన్​ తీసుకునే ముందు చాలా విషయాలను పరిగణించాలి. అయితే, అసలు ఒక్కసారి పర్సనల్​ లోన్​ ఈఎంఐ మిస్​ అయితే ఎంత నష్టమో మీకు తెలుసా? తెలిస్తే షాక్​ అవుతారు..

పర్సనల్​ లోన్​ ఈఎంఐ మిస్​ అయితే?

దేశంలో పర్సనల్​ లోన్స్​ తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్న వేళ డిఫాల్ట్‌లు కూడా పెరుగుతున్నాయి! కానీ వ్యక్తిగత రుణ ఈఎంఐలను చెల్లించకపోవడం తీవ్రమైన ఆర్థిక పొరపాటు అవుతుంది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రుణగ్రహీతలను అప్రమత్తంగా ఉండాలని, బాధ్యతాయుతంగా ఉండాలని సూచించింది. అసలు ఒక్కసారి పర్సనల్​ లోన్​ ఈఎంఐ కట్టకపోతే ఎంత నష్టమో మీకు తెలుసా?

పర్సనల్​ లోన్​ ఈఎంఐ చెల్లించకపోతే ఎదురయ్యే ఐదు పరిణామాలు..

క్రెడిట్ స్కోర్ పతనం: ఒక ఈఎంఐ మిస్ అయినా మీ క్రెడిట్ స్కోర్ 50 నుంచి 70 పాయింట్ల వరకు పడిపోవచ్చు. ఈ పతనం వడ్డీ రేట్లను పెంచవచ్చు లేదా కొత్త రుణ దరఖాస్తులను నిరోధించవచ్చు. ఇది మీ మొత్తం క్రెడిట్ ప్రొఫైల్‌పై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే పర్సనల్​ లోన్​ ఈఎంఐలను ఎప్పుడూ మిస్ కాకుండా చూసుకోవాలి.

హెచ్​డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ క్రెడిట్ పాలసీ లీడ్ కరమ్‌జీత్ సింగ్ మాట్లాడుతూ.. "పెనాల్టీ ఛార్జీలు- ఓవర్‌డ్యూ వడ్డీని భరించడమే కాకుండా, ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది, మీ ఫైనాన్షియర్ ద్వారా అసౌకర్య రుణ వసూలు ప్రక్రియకు దారితీస్తుంది. దెబ్బతిన్న క్రెడిట్ స్కోర్ భవిష్యత్తులో రుణం పొందే మీ సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది," అని అన్నారు.

పెనాల్టీ ఛార్జీలు - వడ్డీ పేరుకుపోవడం: బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు వంటి ఆర్థిక సంస్థలు సాధారణంగా ఈఎంఐలో 1–2% ఆలస్య రుసుముగా వసూలు చేస్తాయి. అంతేకాకుండా, గడువు మీరిన ఈఎంఐలకు పెనాల్టీ వడ్డీ వర్తిస్తుంది. ఇది రుణ భారాన్ని పెంచుతుంది. ఈ పరిణామాలు ఖర్చులు తీవ్రంగా పెరగడానికి దారితీస్తాయి.

ట్రాన్స్‌యూనియన్ సిబిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ & డైరెక్ట్ టు కన్స్యూమర్ బిజినెస్ హెడ్ భూషణ్ పడ్‌కిల్ మాట్లాడుతూ.. "మిస్ అయిన పర్సనల్​ లోన్​ ఈఎంఐలు మీ క్రెడిట్ స్కోర్‌ను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. రీ-పేమెంట్​లో మీ పేలవమైన ప్రవర్తనను ప్రతిబింబిస్తాయి. స్థిరమైన తిరిగి చెల్లింపు రికార్డు క్రెడిట్‌ వర్తీనెస్‌ను, మెరుగైన రుణ అవకాశాలను పెంచుతుంది. మీరు క్రెడిట్-రెడీగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి మీ సిబిల్ స్కోర్, క్రెడిట్ ప్రొఫైల్‌ను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని నిర్ధారించుకోండి," అని తెలిపారు.

మైనర్​ వర్సెస్​ మేజర్​ డిఫాల్ట్: ఎన్​పీఏ వర్గీకరణ: 90 రోజుల లోపు చెల్లింపులను మిస్ కావడం ఒక చిన్న డిఫాల్ట్‌గా పరిగణించాలి. అంతకు మించితే, వ్యక్తిగత రుణం నిరర్ధక ఆస్తి (ఎన్​పీఏ)గా మారుతుంది. అప్పుడు క్రెడిట్ బ్యూరోలు, బ్యాంకులు రెండూ దీనిని గుర్తించి ఫ్లాగ్ చేస్తాయి. ఒకసారి ఎన్​పీఏగా వర్గీకరింస్తే, ఆ తర్వాత మీ రుణ రికార్డు చాలా సంవత్సరాలు చెడిపోతుంది. భవిష్యత్తులో వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డ్ దరఖాస్తులతో సమస్యలను సృష్టిస్తుంది.

రికవరీ కాల్స్- చట్టపరమైన చర్యలు: సాధారణంగా 60 రోజుల పాటు బకాయిలు చెల్లించకపోతే రికవరీ కాల్స్, చట్టపరమైన చర్యలు ప్రారంభమవుతాయి. రుణగ్రహీతలు తమ ఇంటి వద్ద రికవరీ ఏజెంట్లను నిత్యం చూడాల్సి వస్తుంది. డిఫాల్ట్ కొనసాగితే, 1881 నాటి నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం కింద చట్టపరమైన చర్యలకు దారితీయవచ్చు.

రుణ సామర్థ్యంపై దీర్ఘకాలిక ప్రభావం: పర్సనల్​ లోన్​ వల్ల నిరంతరం క్షీణిస్తున్న క్రెడిట్ స్కోర్, ఎన్​పీఏ జాబితా ఒక వ్యక్తి భవిష్యత్ రుణ అర్హతను సులభంగా దెబ్బతీస్తాయి. ప్రైవేట్ బ్యాంకులలో వ్యక్తిగత రుణ డిఫాల్ట్‌లు ఇంకా ఎక్కువగా ఉన్నందున, రుణగ్రహీతలు కొత్త రుణం పొందడానికి కష్టపడవచ్చు లేదా చాలా అధిక వడ్డీ రేట్లతో పాటు సౌలభ్యం లేని తిరిగి చెల్లింపు నిబంధనలు, షరతులతో మాత్రమే కొత్త రుణాలను పొందగలుగుతారు.

ఆర్థికంగా నిలదొక్కుకోవడం: మీరు ఏమి చేయగలరు?

ఇవి చేయండిఈ బెనిఫిట్స్​ పొందండి
ఈఐఎంలు ఆటోమెట్​ చేయండిపేమెంట్స్​ మిస్​ అవ్వవు
లెండర్​తో మాట్లాడండిఈఏఎఐ రీస్ట్రక్చరింగ్​ గురించి అభ్యర్థించండి
ఎమర్జెన్సీ బఫర్​ని బిల్డ్​ చేసుకోండిఈఎంఐలను ఇవి కవర్​ చేస్తాయి
క్రెడిట్​ రిపోర్టును చెక్​ చేసుకోండిఎర్రర్​లను కరెక్ట్​ చేసుకోండి

అందువల్ల, రుణగ్రహీతలు ఈఎంఐలను పవిత్రంగా భావించాలి. సకాలంలో చెల్లింపులు చేయడం వ్యక్తిగత క్రెడిట్‌కు మాత్రమే కాకుండా దేశ ఆర్థిక ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం.

(గమనిక- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. పర్సనల్​ లోన్​లు రిస్కీ అని గుర్తుపెట్టుకోవాలి.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం