Passenger vehicle sales : ప్యాసింజర్​ వాహనాల విక్రయాల్లో జోరుకు అసలు కారణాలు ఇవే!-weddings and two other factors pushing car sales forward in india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Weddings And Two Other Factors Pushing Car Sales Forward In India

Passenger vehicle sales : ప్యాసింజర్​ వాహనాల విక్రయాల్లో జోరుకు అసలు కారణాలు ఇవే!

Sharath Chitturi HT Telugu
Mar 06, 2023 11:01 AM IST

India Passenger vehicle sales : ఇండియాలో ప్యాసింజర్​ సెగ్మెంట్​ కళకళలాడుతోంది. ఇటీవలి కాలంలో పీవీలో సేల్స్​ విపరీతంగా పెరిగిపోయాయి. ఇందుకు పలు కారణాలను వివరించింది ఫాడా.

 ప్యాసింజర్​ వాహనాల విక్రయాల్లో జోరుకు అసలు కారణాలు ఇవే
ప్యాసింజర్​ వాహనాల విక్రయాల్లో జోరుకు అసలు కారణాలు ఇవే (Bloomberg)

India Passenger vehicle sales : ఇండియాలో ఆటోమొబైల్​ మార్కెట్ గత కొన్ని నెలలుగా​ కళకళలాడుతోంది. ఇందుకు తగ్గట్టుగానే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్​ మార్కెట్​గా ఎదిగింది ఇండియా. ముఖ్యంగా ప్యాసింజర్​ వెహికిల్​ (పీవీ) సెగ్మెంట్​లో డిమాండ్​ విపరీతంగా కనిపిస్తోంది. ఫాడా (ఫెడరేషన్​ ఆఫ్​ ఆటోమొబైల్​ డీలర్స్​ అసోసియేషన్​) డేటా ప్రకారం.. 2022 ఫిబ్రవరితో పోల్చుకుంటే.. 2023 ఫిబ్రవరిలో పీవీ సెగ్మెంట్​లో విక్రయాలు 11శాతం మేర పెరిగాయి. 2020 ఫిబ్రవరితో పోల్చుకుంటే ఈసారి ఏకంగా 16శాతం ఎక్కువగా సేల్స్​ జరగడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

భారీ డిమాండ్​కు కారణాలు ఇవే..

పీవీ సెగ్మెంట్​లో డిమాండ్​ నానాటికి పెరుగుతుండటానికి పలు కారణాలను వివరించింది ఫాడా. వీటిల్లో ప్రధానమైనది దేశంలోని పెళ్లిళ్ల సీజన్​. పెళ్లి సమయంలో చాలా మంది కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఫలితంగా సేల్స్​ సంఖ్య పెరుగుతోందని ఫాడా పేర్కొంది. మరికొన్ని నెలల పాటు ఈ జోరు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు వివరించింది. మరోవైపు.. సంస్థలు కొత్త కొత్త మోడల్స్​ను లాంచ్​ చేస్తూ ఉండటం, వాటిపై కస్టమర్లలో ఆసక్తి పెరుగుతుండటం కూడా ఓ కారణం అని స్పష్టం చేసింది.

Demand for Passenger vehicles in India : కొవిడ్​ నేపథ్యంలో రెండేళ్ల పాటు ఆటోమొబైల్​ మార్కెట్​లో సప్లై చెయిన్​ వ్యవస్థ సమస్యలు ఉండేవి. ఇప్పుడు క్రమక్రమంగా సమస్యలు తగ్గి, పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఫలితంగా ఆటోమొబైల్​ సంస్థలు వాహనాల తయారీని వేగవంతం చేస్తున్నాయి. గతంలో అనేక విడిభాగాలు దొరికేవి కావు. ఇప్పుడు కూడా సమస్యలు ఉన్నప్పటికీ, అప్పటితో పోల్చుకుంటే పరిస్థితులు చాలా వరకు మెరుగుపడినట్టే! ఈ పరిణామాలతో వివిధ సంస్థల మోడల్స్​కు బుకింగ్స్​ జోరుగా జరుగుతున్నాయి.

అక్కడ ఆందోళనకరమే..!

India Automobile sector : దేశీయంగా పీవీ సెగ్మెంట్​కు మంచి డిమాండ్​ కనిపిస్తున్నప్పటికీ.. గ్రామీణ భారతంలో పరిస్థితులు ఇంకా మెరుగుపడలేదని ఫాడా చెబుతోంది. ద్రవ్యోల్బణం కారణంగా.. గ్రామీణ మార్కెట్​లో కొనుగోళ్లు ఆశించినంత మేర ఉండటం లేదని స్పష్టం చేస్తోంది. ఇండియాకు గ్రామీణ మార్కెట్​ ఎంతో కీలకమని, ఇక్కడ పరిస్థితులు మెరుగుపడితేనే ఆటోమొబైల్​ భవిష్యత్తు బాగుంటుందని అంటోంది.

WhatsApp channel

టాపిక్