వార్​ 2 హీరో హృతిక్​ రోషన్​ దగ్గర కళ్లు చెదిరే సంపద! ఎన్టీఆర్​ నెట్​ వర్త్​ కంటే చాలా ఎక్కువే..-war 2 hero hrithik roshan net worth revealed its more than jr ntr ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  వార్​ 2 హీరో హృతిక్​ రోషన్​ దగ్గర కళ్లు చెదిరే సంపద! ఎన్టీఆర్​ నెట్​ వర్త్​ కంటే చాలా ఎక్కువే..

వార్​ 2 హీరో హృతిక్​ రోషన్​ దగ్గర కళ్లు చెదిరే సంపద! ఎన్టీఆర్​ నెట్​ వర్త్​ కంటే చాలా ఎక్కువే..

Sharath Chitturi HT Telugu

వార్​ 2 నటుడు హృతిక్​ రోషన్​ నెట్​ వర్త్​ ఎంతో మీకు తెలుసా? సినిమాలు, బ్రాండ్​ డీల్స్​, రియల్​ ఎస్టేట్​తో లగ్జరీ లైఫ్​స్టైల్​ కలిగిన హృతిక్​ రోషన్​ సంపదకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వార్​ 2 సినిమాలో జూనియర్​ ఎన్టీఆర్​, హృతిక్​ రోషన్​..

ఇంకొన్ని రోజుల్లో విడుదలకానున్న జూనియర్​ ఎన్టీఆర్​, హృతిక్​ రోషన్​ వార్​ 2 సినిమాపై మంచి బజ్​ నెలకొంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్​ సైతం హైప్​ని మరింత పెంచేసింది. అయితే, తెలుగు ప్రజలకు బాలివుడ్​ స్టార్​ హృతిక్​ రోషన్​ సుపరిచితమే! కృష్​, ధూమ్​ 2 వంటి సినిమాలతో అలరించిన హృతిక్​ రోషన్​ నెట్​ వర్త్​ ఎంతో మీకు తెలుసా? జూనియర్​ ఎన్టీఆర్​ కన్నా చాలా చాలా ఎక్కువ.

వార్​ 2 : హృతిక్​ రోషన్​ సంపద ఎంతంటే..

పలు నివేదికల ప్రకారం వార్​ 2 నటుడు హృతిక్​ రోషన్​ నెట్​వర్త్​ రూ.31,000 కోట్ల కన్నా ఎక్కువ! జూనియర్​ ఎన్టీఆర్​ సంపద సుమారు రూ. 500 కోట్ల వరకు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఎన్టీఆర్​ మాత్రమే కాదు, హృతిక్​ నెట్​ వర్త్​ సల్మాన్​ ఖాన్​, రణ్​బీర్​ కపూర్​, ఆలియా భట్​ సహా ఎందరో బాలీవుడ్​ ప్రముఖల కన్నా ఎక్కువ. సినిమాలతో పాటు హృతిక్​కి బిజినెస్​ వెంచర్లు, బ్రాండ్​ డీల్స్​, రియల్​ ఎస్టేట్​ నుంచి డబ్బులు వస్తాయి.

హృతిక్​ రోషన్​ స్పోర్ట్స్​వేర్​ బ్రాండ్ "హెచ్​ఆర్​ఎక్స్​"​ నెట్​ వర్త్​ రూ. 7300 కోట్ల వరకు ఉంటుంది. హై-క్వాలిటీ క్లోథింగ్​, యాక్సెసరీలను ఇతర లగ్జరీ సంస్థలతో పోలిస్తే కాస్త చౌకైన ధరకే విక్రయిస్తోంది హెచ్​ఆర్​ఎక్స్​.

ఇక హృతిక్​ రోషన్​ సంపదలో సినిమాలదే అధిక వాటా అని చెప్పాలి. బాలీవుడ్​లోని మోస్ట్​ ఎక్స్​పెన్సివ్​ స్టార్స్​లో హృతిక్​ ఒకరు. ఆయన ప్రతి సినిమాకు రూ. 50కోట్ల నుంచి రూ. 85కోట్ల వరకు తీసుకుంటాడని సమచారం.

హృతిక్​ రోషన్​కి ప్రొడక్షన్​ హౌజ్​ కూడా ఉంది. వాస్తవానికి దానిని ఆయన తండ్రి, ప్రముఖ డైరక్టర్​ రాకేశ్​ రోషన్​ 1980లో స్థాపించారు. దాని ద్వారా కూడా హృతిక్​కి మంచి లాభాలు వస్తుంటాయి.

బిగ్​ స్క్రీన్​ని మినహాయిస్తే ఈ వార్​ 2 నటుడు బ్రాండ్​ ఎండోర్స్​మెంట్స్​​ రూపంలోనూ ప్రజలకు చేరువవుతారు. టీవీ యాడ్స్​, ప్రింట్​ యాడ్స్​ సహా ఇతర బ్రాండ్​ డీల్స్​ రూపంలో ఆయనకు వందల కోట్లు వస్తుంటాయని తెలుస్తోంది.

హృతిక్​ రోషన్​ ఒక సక్సెస్​ఫుల్​ నటుడే కాదు, సక్సెస్​ఫుల్​ ఇన్వెస్టర్​ కూడా! రెండు ప్రముఖ హెల్త్​ స్టార్టప్స్​లో ఆయన పెట్టుబడులు పెట్టారు. వాటిల్లో ఒకటి బెంగళూరులో ఉంది. అది బాగా రాణిస్తోంది.

హృతిక్​ రోషన్​ రియల్​ ఎస్టేట్​- లగ్జరీ లైఫ్​..

హృతిక్​ రోషన్​ నెట్​ వర్త్​లో అనేక లగ్జరీ ప్రాపర్టీలు కూడా ఉన్నాయి. ముంబై జూహులో ఆయనకున్న సీ-ఫేసింగ్​ హౌజ్​ ఖరీదు రూ.100 కోట్ల పైమాటే! లొనావొలాలో ఒక ప్రీమియం ఫార్మ్​ హౌజ్​ కూడా ఉంది. దాని ఖరీదు రూ. 33కోట్లు అని సమాచారం. ఇక హృతిక్​ దగ్గర లెక్కలేనన్ని లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.

హృతిక్​ రోషన్​, జూనియర్​ ఎన్టీఆర్​, కియారా అడ్వానీ నటించిన వార్​ 2 సినిమా ఆగస్ట్​ 14న విడుదలకానుంది. ఆ తర్వాత వచ్చే ఏడాది హృతిక్​ నటిస్తున్న కృష్​ 4 విడుదల అవుతుంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం