PAN Card to NRIs: పాన్.. పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అనేది అంకెలు, ఇంగ్లీష్ అక్షరాలతో కూడిన ప్రత్యేక సంఖ్య. భారత్ లోని ఆదాయ పన్ను శాఖ ఈ పాన్ నెంబర్ తో కూడిన కార్డును జారీ చేస్తుంది. భారత్ లో ఆదాయ పన్ను చెల్లించే వారంతా కచ్చితంగా పాన్ కార్డ్ (PAN Card) కలిగి ఉండాలి. ,PAN Card to NRIs: ఎన్ఆర్ఐ లకు పాన్ కార్డుఎన్ఆర్ఐ (NRI) లకు కూడా పాన్ కార్డ్ (PAN Card) అవసరముంటుంది. ముఖ్యంగా, భారత్ లో పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్నవారు కచ్చితంగా పాన్ కార్డ్ కలిగి ఉండాలి. ఎన్ఆర్ఐ (NRI) లు ఇతర అవసరమైన డాక్యుమెంట్లతో పాటు ఫామ్ 49ఏ ను UTIITSL లేదా Protean వంటి పాన్ అప్లికేషన్ సెంటర్ లో సబ్మిట్ చేసి పాన్ కార్డు (PAN Card) ను పొందవచ్చు. అలాగే, UTIITSL లేదా Protean websites ల ద్వారా ఆన్ లైన్ లో కూడా అప్లై చేయవచ్చు. Protean ను గతంలో NSDL eGov గా పేర్కొనేవారు. ,Who can apply for NRI PAN card: ఎవరు అప్లై చేయాలి?క్రింద పేర్కొన్న కేటగిరీల ఎన్ఆర్ఐ (NRI) లు పాన్ కార్డ్ (PAN Card) కోసం దరఖాస్తు చేసుకోవాలి.,భారత్ లో ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్న ఎన్ఆర్ఐ (NRI) లు.భారత్ లోని మ్యుచ్చువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలన్న ఆసక్తి ఉన్నఎన్ఆర్ఐ (NRI) లు.భారత్ లోని స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న ఎన్ఆర్ఐ (NRI) లు.భారత్ లో స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునే ఎన్ఆర్ఐ (NRI) లు.Online application: ఆన్ లైన్ లో అప్లై చేసుకోవడం ఇలా..UTIITSL లేదా Protean పోర్టల్ కు వెళ్లి Apply Online" ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.అప్లికేషన్ టైప్ కింద ఫామ్ 49 ఏ ఫర్ ఎన్ఆర్ఐ ని సెలెక్ట్ చేసుకోవాలి. విదేశీ పౌరసత్వం ఉన్నవారైతే ఫామ్ 49ఏఏ ను సెలెక్ట్ చేసుకోవాలి.అన్ని వివరాలు ఫిల్ చేసి, క్యాప్చా ను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఎన్ఆర్ఐ పాన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని పూర్తిగా ఫిల్ చేసి, అవసరమైన డాక్యుమెంట్లను, డిజిటల్ సిగ్నేచర్ ను అప్ లోడ్ చేసి, సబ్మిట్ నొక్కాలి.అనంతరం, ఒపెన్ అయ్యే పేమెంట్ పేజీలో ఫీ పే చేయాలి.ఆ తరువాత మీకు అకనాలెడ్జ్ మెంట్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు.Offline application: ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవడం ఇలా..ఆన్ లైన్ లో అప్లై చేసుకోలేని వారు ఎన్ఆర్ఐ పాన్ కార్డు కోసం ఆఫ్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.అందుకు వారు దగ్గరల్లోని IT PAN service centre లేదా TIN facilitation centre కు వెళ్లాల్సి ఉంటుంది.అక్కడ లభించే అప్లికేషన్ ఫామ్ ను నింపి, అవసరమైన డాక్యుమెంట్లను జతచేసి, ఫీజు చెల్లించి అక్కడే సబ్మిట్ చేయాలి. డీడీ ద్వారా కూడా ఫీజు చెల్లించవచ్చు.వారు ఇచ్చే అకనాలెడ్జ్ మెంట్ స్లిప్ ను మీ పాన్ కార్డ్ వచ్చేవరకు జాగ్రత్త చేసుకోవాలి.