ChatGPT prompts : చాట్​జీపీటీ ఎక్కువ వాడుతున్నారా? ఈ 5 ప్రాంప్ట్​లు చాలా ఎఫెక్టివ్​..-want better answers from chatgpt openai reveals these 5 tried and tested prompts ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Chatgpt Prompts : చాట్​జీపీటీ ఎక్కువ వాడుతున్నారా? ఈ 5 ప్రాంప్ట్​లు చాలా ఎఫెక్టివ్​..

ChatGPT prompts : చాట్​జీపీటీ ఎక్కువ వాడుతున్నారా? ఈ 5 ప్రాంప్ట్​లు చాలా ఎఫెక్టివ్​..

Sharath Chitturi HT Telugu

చాట్​జీపీటీ సమాధానాల ఎఫీషియెన్సీని పెంచే విధంగా ఓపెన్​ఏఐ కొన్ని ప్రాంప్ట్​లను ఇటీవలే షేర్​ చేసింది. అవి ట్రైడ్​ అండ్​ టెస్టెడ్​ అని చెప్పింది. ఆ ప్రాంప్ట్​లను ఇక్కడ చూసేయండి, వాడేయండి..

చాట్​జీపీటీ ప్రాంప్ట్​లు.. (AI generated)

ఇప్పుడంతా ఆర్టిఫీషియల్​ టెక్నాలజీ హవా నడుస్తోంది! మనకి తెలియకుండానే చాలా విషయాలకు ఇప్పుడు మనం ఏఐని వాడేస్తున్నాము. మరీ ముఖ్యంగా చాట్​జీపీటీని ఉపయోగించకుండా చాలా మందికి రోజు కూడా గడవడం లేదు! చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద ఆఫీస్​ పనుల వరకు చాట్​జీపీటీని ఉపయోగించి, తమ ఎఫీషియెన్సీని పెంచుకుంటున్నారు, సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు. ఇలాంటి వారిలో మీరూ ఉన్నారా? అయితే ఇది మీకోసమే! చాట్​జీపీటీ నుంచి ఎఫెక్టివ్​ సమాధానాలు పొందేందుకు ఉపయోగపడే 5 టెస్టెడ్​ ప్రాంప్ట్​లను ఓపెన్​ఏఐ ఇటీవలే వెల్లడించింది. ఆ ప్రాంప్ట్​లు వాడితే మీకు మరింత మెరుగైన రిజల్ట్స్​ వస్తాయని సంస్థ చెబుతోంది. అవేంటంటే..

ఈ చాట్​జీపీటీ ప్రాంప్ట్​లు చాలా ఎఫెక్టివ్​..

ప్రాంప్ట్​ 1:

​"Explain this like I'm five, like I'm a college student, and like I'm an expert."

ఏదైనా టాపిక్​ని ఎంచుకోండి. ఆ తర్వాత..

​“Explain stock markt like I'm five, like I'm in college, and like I'm an expert”

ఈ ప్రాంప్ట్​లో చెప్పిన వయస్సుకు తగ్గట్టు చాట్​జీపీటీ తన సమాధానాలను సరళతరం చేస్తుంది! మీరు ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి వీలు ఉంటుంది.

ప్రాంప్ట్​ 2:

​"Plan a [goal] for me step-by-step and give me a first action I can take today."

ఉదాహరణ: "Plan a 4-week beginner strength routine I can do at home with only dumbbells. Include a shopping list and today's first workout."

ఈ ప్రాంప్ట్​ ద్వారా ప్లాన్నింగ్​, పర్సనలైజేషన్​ వంటివి ఎఫెక్టివ్​గా ఉంటాయని ఓపెన్​ఏఐ చెబుతోంది.

ప్రాంప్ట్​ 3: Turn messy info into a clear, usable format.

పెద్ద ఈమెయిల్​, నోట్స్​, టెక్ట్స్​ని పేస్ట్​ చేసి..

​"Summarize these notes into 3 key decisions, 5 action items, and a one-sentence," అని ప్రాంప్ట్​ ఇవ్వండి చాలు!

ప్రాంప్ట్​ 4:

​"Generate 10 creative ideas with unexpected twists."

ఉదాహరణ: "Give me 10 Instagram video ideas to promote a small coffeeshop, each with a surprising hook or trend to ride."

ఈ ప్రాంప్ట్​ ద్వారా క్రియేటివ్​ బ్రెయిన్​స్టార్మింగ్​ వంటివి అన్​లాక్​ అవుతాయని చాట్​జీపీటీ చెబుతోంది.

ప్రాంప్ట్​ 5:

​"Be my [role] and help me practice."

ఉదాహరణ: "Pretend you're a hiring manager. Give me 5 tough interview questions for a product manager role and critique my answers."

ఈ ప్రాంప్ట్​ ద్వారా ఇంటెరాక్టివ్​ రోల్​- ప్లే, కోచింగ్​, ఫీడ్​బ్యాక్​ వంటివి జనరేట్​ అవుతాయని ఓపెన్​ఏఐ చెబుతోంది.

ఈ ఎక్స్​ట్రా టిప్​ మీకోసమే:

​ప్రతి స్పందన తర్వాత "Can you push this further?" or "Give me 3 wild alternatives," అని మీరు అడిగితే, ఇంకా మెరుగైన రిజల్ట్స్​ వస్తాయని ఓపెన్​ఏఐ చెప్పింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం