Volvo EX90: 10నిమిషాల చార్జింగ్‍తో 180కిలోమీటర్ల రేంజ్.. అదిరిపోయేలా వోల్వో ఫ్లాగ్‍షిప్ ఎలక్ట్రిక్ కార్-volvo ex90 powerful safest electric suv unveiled know features range and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Volvo Ex90 Powerful Safest Electric Suv Unveiled Know Features Range And More

Volvo EX90: 10నిమిషాల చార్జింగ్‍తో 180కిలోమీటర్ల రేంజ్.. అదిరిపోయేలా వోల్వో ఫ్లాగ్‍షిప్ ఎలక్ట్రిక్ కార్

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 10, 2022 06:09 PM IST

Volvo EX90 Electric Car Unveiled: శక్తివంతమైన ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని వోల్వో ఆవిష్కరించింది. అదిరిపోయే ఫీచర్లు, సుదీర్ఘ రేంజ్, ఫాస్ట్ చార్జింగ్ సహా ఎన్నో అధునాతన సదుపాయాలను ఈ వెహికల్ కలిగి ఉంది.

Volvo EX90: 10నిమిషాల చార్జింగ్‍తో 180కిలోమీటర్ల రేంజ్
Volvo EX90: 10నిమిషాల చార్జింగ్‍తో 180కిలోమీటర్ల రేంజ్

Volvo EX90 Electric Car Unveiled: ఆటోమొబైల్ కంపెనీ వోల్వో అదిరిపోయే ఫ్లాగ్‍షిప్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. వోల్వో ఈఎక్స్ 90 (Volvo EX90)ను పరిచయం చేసింది. Volvo XC90 ఎస్‌యూవీకి సరితూగే ఏకైక ఎలక్ట్రిక్ కారు ఇది. ఎంతో శక్తిమంతమైన, సురక్షితమైన ఫీచర్లను కలిగి ఉన్న ఎలక్ట్రిక్ కారుగా వోల్వో ఈఎక్స్90 ఎస్‍యూవీ ఉంది. ఈ ఫ్లాగ్‍షిప్ ఎలక్ట్రిక్ కారు గురించిన వివరాలు ఇవే..

ట్రెండింగ్ వార్తలు

Volvo EX90 Electric car Range : 600 కిలోమీటర్ల వరకు రేంజ్

111 కిలో వాట్ హవర్ (kWh) బ్యాటరీని ఈఎక్స్90 ఎలక్ట్రిక్ ఎస్‍‍యూవీలో వోల్వో ఇస్తోంది. 250kW వరకు DC ఫాస్ట్ చార్జింగ్‍కు ఇది సపోర్ట్ చేస్తుంది. దీంతో కేవలం ఈ బ్యాటరీని 10 నిమిషాలు చార్జ్ చేస్తే ఏకంగా 180 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అంటే 10 నిమిషాల చార్జ్ తో ఈ కార్ 180 రేంజ్‍ను ఇస్తుంది. అలాగే గంటన్నరలోనే ఈ బ్యాటరీ 80 శాతం చార్జ్ అవుతుందని వోల్వో పేర్కొంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే Volvo EX90 కారు ఏకంగా 600 కిలోమీటర్ల వరకు రేంజ్‍ను ఇస్తుంది.

Volvo EX90 ఎస్‍యూవీకి బిడ్ డైరెక్షనల్ చార్జింగ్ ఆప్షన్‍ను కూడా వోల్వో ఇచ్చింది. అంటే ఇంట్లో పవర్ కట్ ఉంటే ఈ కారు నుంచి పవర్ ను ఇన్వర్టల్‍లా వినియోగించుకోవచ్చు.

517 హార్స్ పవర్ (hp) గరిష్ఠ పవర్‍ను, 910 vన్యూటన్ మీటర్ల (Nm) పీక్ టార్క్యూను ఈ ప్రీమియమ్ ఎస్‍యూవీ జనరేట్ చేస్తుంది. కేవలం 4.9 సెకన్లలోనే సున్నా నుంచి గంటకు 100 కిలోమీటర్ల వేగానికి చేరుకుంటుంది.

Volvo EX90 Electric Car Unveiled: అధునాతన ఫీచర్లతో..

తాము ఉత్పత్తి చేసిన అన్ని కార్లలో ఈఎక్స్90 అత్యంత సేఫెస్ట్ కార్ అని వోల్వో పేర్కొంది. కారు ముందు 250 మీటర్ల వరకు కనిపించేలా హై రెజల్యూషన్ LiDARను ఇది కలిగి ఉంది. అలాగే మొత్తంగా 16 అదనపు ఫీచర్లను ఈ అధునాతన ఎలక్ట్రిక్ కారు కలిగి ఉంది. LiDar సెన్సార్ రూఫ్ ముందుగా భాగంలో ఉంటుంది.

ప్లాస్టిక్ బాటిళ్లు రిసైకిల్ చేసిన మెటీరియల్‍ను వోల్వో ఈఎక్స్ 90 ఇంటీరియర్ కోసం వోల్వో వినియోగించింది. ఇక ఈ ఫ్లాగ్‍షిప్ కారులో 14.5 ఇంచుల సెంట్రల్ డిస్‍ప్లే ఉంటుంది. గూగుల్ మ్యాప్స్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ ప్లే, వైర్‍లెస్ యాపిల్ కార్ ప్లే లాంటి గూగుల్, యాపిల్ సర్వీస్‍లు ఈ డిస్‍ప్లేలో ఇన్‍బుల్ట్ గా ఉంటాయి.

Volvo EX90 Electric Car Unveiled: వోల్వో ఈఎక్స్90 లాంచ్ వివరాలు

ఈ Volvo EX90 ఫ్లాగ్‍షిప్ సెవెన్ సీటర్ ఎస్‍యూవీ 2023 రెండో అర్ధభాగంలో మార్కెట్‍లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఎస్‍యూవీ భారత మార్కెట్‍లోకి రాకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి.

WhatsApp channel