Volvo C40 Recharge Electric Car: ఈ ఏడాదిలోనే భారత్‍కు వోల్వో నయా ఎలక్ట్రిక్ కారు: 508 కిలోమీటర్ల వరకు రేంజ్-volvo c40 recharge electric car set to launch in india by 2023 q4 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Volvo C40 Recharge Electric Car Set To Launch In India By 2023 Q4

Volvo C40 Recharge Electric Car: ఈ ఏడాదిలోనే భారత్‍కు వోల్వో నయా ఎలక్ట్రిక్ కారు: 508 కిలోమీటర్ల వరకు రేంజ్

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 15, 2023 11:48 AM IST

Volvo C40 Recharge Electric Car: వోల్వో సీ40 రీచార్జ్ ఎలక్ట్రిక్ కారు ఈ ఏడాదిలోనే ఇండియాలో లాంచ్ కానుంది. రెండు వేరియంట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Volvo C40 Recharge Electric Car: ఈ ఏడాదిలోనే భారత్‍కు వోల్వో నయా ఎలక్ట్రిక్ కారు
Volvo C40 Recharge Electric Car: ఈ ఏడాదిలోనే భారత్‍కు వోల్వో నయా ఎలక్ట్రిక్ కారు

Volvo C40 Recharge Electric Car: భారత్‍లో తన రెండో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసేందుకు వోల్వో (Volvo) సిద్ధమవుతోంది. వోల్వో సీ40 రీచార్జ్ (Volvo C40 Recharge) పేరుతో ఈ నయా ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ రానుంది. ఈ ఏడాదిలోనే ఈ కారును భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్టు వోల్వో అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ఈ కారు ఇండియాలో సేల్‍కు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత మార్కెట్‍లో వోల్వో నుంచి ఎక్స్‌సీ40 రీచార్జ్ (XC40 Recharge) ఎలక్ట్రిక్ కారు అందుబాటులో ఉంది. ఇక తమ రెండో ఎలక్ట్రిక్ ఎస్‍యూవీగా ఇండియాకు సీ40 రీచార్జ్‌ను వోల్వో తీసుకొస్తోంది. ఈ కారు ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‍లో అందుబాటులోకి రావటంతో రేంజ్ సహా మరిన్ని విషయాలు బయటికి వచ్చాయి. ఆ వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

ఇక్కడే అసెంబుల్

Volvo C40 Recharge Electric Car: కొత్త మోడళ్లతో భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‍లో కంపెనీ షేర్‌ను పెంచుకోవాలని వోల్వో ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా వోల్వో సీ40 రీచార్జ్ ఎలక్ట్రిక్ కారును ఈ ఏడాది తీసుకురానుంది. సీ40 రీచార్జ్ విడిభాగాలను వోల్వో ఇండియాకు దిగుమతి చేస్తుంది. బెంగళూరులోని ప్లాంట్‍లో విడి భాగాలను కలిపి (అసెంబుల్) కారును రూపొందిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హైబ్రిడ్ మోడళ్లపై కూడా ఫోకస్ కొనసాగిస్తామని వోల్వో చెబుతోంది.

Volvo C40 Recharge Electric Car: ఇండియాలో లగ్జరీ కార్ మార్కెట్‍లో వోల్వోకు పెద్దగా వాటా లేదు. అయితే వోల్వో ఎక్స్40 రీచార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ మాత్రం సక్సెస్ అయింది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.56.90లక్షలుగా ఉంది. ఈ కారుకు ఇండియాలో మంచి డిమాండ్ ఏర్పడటంతో సీ40 రీచార్జ్ మోడల్‍ను తీసుకొస్తోంది ఆ సంస్థ.

రెండు వేరియంట్లు

Volvo C40 Recharge Electric Car: ప్రస్తుతం గ్లోబల్‍గా కొన్ని దేశాల్లో వోల్వో సీ40 రీచార్జ్ ఎలక్ట్రిక్ కారు అందుబాటులో ఉంది. రెండు వేరియంట్లలో ఈ కారు లభిస్తోంది. సింగిల్ మోటార్ వేరియంట్ 236 hp పీక్ పవర్ జనరేట్ చేస్తుంది. ఈ మోడల్‍ని బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 482 కిలోమీటర్లు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల (0 - 100 kmph) వేగానికి ఈ మోడల్ 7.4 సెకన్లలోనే యాక్సలరేట్ అవుతుంది. ఇక ట్విన్ మోటార్ వేరియంట్ 408 hp పీక్ పవర్‌ను ప్రొడ్యూజ్ చేస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ వేరియంట్ 508 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. 0 - 100 kmph వేగానికి ఈ మోడల్ 4.7 సెకన్లలోనే యాక్సలరేట్ అవుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం