Premium SUV : స్పోర్టీ లుక్స్‌తో వోక్స్వ్యాగన్ కొత్త ఎస్యూవీ- ధర ఎంతంటే..
Volkswagen Tiguan R-Line : వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ ఎస్యూవీ లాంచ్ అయ్యింది. స్టాండర్డ్ టిగువన్కి ఇది స్పోర్టియర్ వర్షెన్. ఈ ఎస్యూవీ ధర, ఫీచర్స్‌తో పాటు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మచ్ అవైటెడ్ టిగువాన్ ఆర్-లైన్ ఎస్‌యూవీని భారతదేశంలో రూ .49 లక్షలకు (ఎక్స్-షోరూమ్- ఇంట్రొడక్టరీ) వోక్స్వ్యాగన్ ఇండియా విడుదల చేసింది. కొన్ని రోజుల క్రితం జర్మన్ ఆటో తయారీదారు భారత పోర్ట్ఫోలియో నుంచి నిలిపివేసిన మునుపటి వోక్స్వ్యాగన్ టిగువాన్ స్థానాన్ని ఈ స్పోర్టీ ఎస్యూవీ భర్తీ చేయనుంది. కొత్త వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ ఎస్యూవీ అనేక కాస్మెటిక్ అప్డేట్లు, ఫీచర్లతో వస్తుంది. కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సీబీయూ) మార్గం ద్వారా ఇది ఇండియాకు రానుంది. పూర్తి వివరాలు..
వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్..
వోక్స్ వ్యాగన్ గోల్ఫ్ జీటీఐతో పాటు వోక్స్ వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్‌ను విక్రయించనున్నారు. ఈ స్పోర్టీ ప్రీమియం ఎస్‌యూవీని వాహన తయారీ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫిజికల్ సేల్స్ ఔట్‌లెట్స్‌లో బుక్ చేసుకోవచ్చు. అయితే, రాబోయే వోక్స్వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ హాట్ హ్యాచ్ మాత్రం కంపెనీకి చెందిన ఆన్లైన్ సేల్స్ ఛానల్ ద్వారా మాత్రమే సేల్‌లో ఉంటుంది.
వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్: ఎక్స్టీరియర్
వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ స్పోర్టీ డిజైన్‌తో వస్తుంది. ఎంక్యూబీ ఇవో ప్లాట్‌ఫామ్ అప్డేటెడ్ వెర్షన్ ఆధారంగా నిర్మించిన వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ అనేక కాస్మెటిక్ అప్డేట్స్ని పొందుతుంది. అనేక ప్రీమియం ఫీచర్లతో వస్తుంది ఈ ఎస్యూవీ. పెర్సిమోన్ రెడ్ మెటాలిక్, సిప్రెసినో గ్రీన్ మెటాలిక్ వంటి ఆరు విభిన్న కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ మొత్తం సిల్హౌట్ ప్రీమియం ఎస్యూవీ స్టాండర్డ్ వెర్షన్‌ను పోలి ఉంటుంది. డ్యూయెల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, లార్జ్ రేడియేటర్ గ్రిల్, ఆర్ బ్యాడ్జీలు, స్పోర్టీ బంపర్లు, వివిధ డిజైన్లతో పెద్ద 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి.
వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్:
క్యాబిన్ లోపల ఇంటీరియర్, వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్లో రీవ్యాంప్డ్ ఏసీ వెంట్లు, ప్రత్యేక ఆర్ లోగోతో పెద్ద 10.25-ఇంచ్ కస్టమైజబుల్ డిజిటల్ కాక్‌పిట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 15-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, లెవల్ 2 ఏడీఏఎస్, హెడ్-అప్ డిస్ప్లే (హెచ్యూడీ), డ్రైవ్ సెలెక్టర్ స్విచ్, 8-స్పీకర్ ఆడియో సిస్టెమ్, వైర్లెస్ ఛార్జింగ్ మొదలైనవి ఉంటాయి.
వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్: ఇంజిన్..
సరికొత్త వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ ఎస్‌యూవీలో 2.0-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ డీఎస్జీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది. ఆటోమేకర్ 4 మోషన్ ఏడబ్ల్యూడీ సిస్టెమ్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ అందుతుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 201బీహెచ్పీ పవర్, 320ఎన్ఎమ్ పీక్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. హైస్పీడ్ సమయంలో మెరుగైన స్థిరత్వం కోసం డైనమిక్ ఛాసిస్ కంట్రోల్ టెక్నాలజీ కూడా ఈ ఎస్‌యూవీలో ఉంటుంది.
సంబంధిత కథనం