Vodafone lay offs: వొడాఫోన్ ఉద్యోగులకు షాక్; 11 వేల ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయం
Vodafone lay offs: టెలీకాం రంగంలో ప్రత్యర్థులతో పోటీ పడలేక, ఆశించిన స్థాయిలో ఆదాయం పొందడంలో విఫలమవుతున్న వొడాఫొన్ (Vodafone) ఆర్గనైజేషన్ స్థాయిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి సుమారు 11 వేల మంది ఉద్యోగుల తొలగింపు.

Vodafone lay offs: ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశల్లో నెట్ వర్క్ ఉన్న బ్రిటన్ కు చెందిన టెలీకాం సంస్థ వొడాఫోన్ (Vodafone) ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించలేకపోతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థ నెట్ వర్క్ నుంచి 11 వేల మంది ఉద్యోగులను తొలగించాలని (lay off) నిర్ణయించినట్లు సంస్థ (Vodafone) సీఈఓ (CEO) మార్గెరిటీ డెల్లా ప్రకటించారు. 2022- 23 ఆర్థిక సంవత్సరం ఫలితాలు నిరాశాజనకంగా వచ్చాయని వెల్లడించారు.
Vodafone lay offs: వచ్చే మూడేళ్లలో..
వొడాఫోన్ ను మళ్లీ విజయం దిశగా తీసుకువెళ్లడానికి కొన్ని మార్పులు అవసరమని నిర్ధారించినట్లు డెల్లా వెల్లడించారు. ఇందుకు గానూ మూడు ప్రాధాన్యతాంశాలను గుర్తించామని, అవి కస్టమర్ (customer), సింప్లిసిటీ (simplicity), అభివృద్ధి(growth) అని వివరించారు. ఈ మూడు కీలక విభాగాల్లో వ్యవస్థీకృత మార్పులకు శ్రీకారం చుట్టామని, అందులో భాగంగానే ఈ లే ఆఫ్ (lay off) నిర్ణయమని తెలిపారు. రానున్న మూడేళ్లలో వొడాఫోన్ (Vodafone) ప్రధాన కార్యాలయంలోని, అలాగే వివిధ దేశాల్లోని వొడాఫోన్ ఆఫీస్ ల్లోని ఉద్యోగులలో 11 వేల మందిని తొలగించాలని నిర్ణయించామన్నారు. సంస్థలో మరింత సరళత్వం తీసుకురావడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అభివృద్ధి (growth) సంబంధించి టర్నరౌండ్ ప్లాన్ (Germany turnaround plan) ను అమలు చేయనున్నామని వెల్లడించారు. సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్న దేశాల్లో.. ఆయా దేశాల వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వ్యూహాలను రూపొందిస్తామన్నారు. FY23 లో వొడాఫోన్ (Vodafone) ఆదాయం 0.3% పెరిగి, 45.7 బిలియన్ పౌండ్లకు చేరింది.