Vodafone Idea New Plans: మూడు ప్లాన్‍లను లాంచ్ చేసిన వొడాఫోన్ ఐడియా: బెనిఫిట్స్, వ్యాలిడిటీ వివరాలివే
Vodafone Idea New Plans: వొడాఫోన్ ఐడియా కొత్తగా మూడు ప్లాన్‍లను లాంచ్ చేసింది. రూ.17, రూ.57, రూ.1,999 ప్లాన్‍లను అందుబాటులోకి తెచ్చింది.
Vodafone Idea New Plans: టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (Vi) కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్‍లను లాంచ్ చేసింది. రూ.17, రూ.57, రూ.1,999 ప్లాన్‍లను ప్లాన్‍లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఇందులో రూ.17, రూ.57 ప్లాన్‍లను నైట్ డేటా బెనిఫిట్‍తో వొడాఫోన్ ఐడియా తీసుకొచ్చింది. ఇక రూ.1,999 ప్లాన్ అన్‍లిమిటెడ్ ప్లాన్‍గా ఉంది. ఈ ప్లాన్‍ల బెనెఫిట్స్, వ్యాలిడిటీ సహా వివరాలను ఇక్కడ చూడండి.
వొడాఫోన్ ఐడియా రూ.1,999 ప్లాన్
వొడాఫోన్ ఐడియా రూ.1,999 ప్లాన్ తీసుకుంటే 250 రోజుల వ్యాలిడిటీ దక్కుతుంది. ప్రతీ రోజు 1.5జీబీ డేటా లభిస్తుంది. అన్‍లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే ప్రతీ రోజు 100ఎస్ఎంఎస్‍లు దక్కుతాయి. రోజులో 1.5జీబీ డేటా అయిపోతే అనంతరం 64కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వస్తుంది. రోజులో 100ఎస్ఎంఎస్‍లు అయిపోతే లోకల్ ఎస్‍ఎంఎస్‍కు రూ.1, ఎస్‍టీడీ ఎస్‍ఎస్‍కు రూ.1.50 చార్జ్ పడుతుంది. ఇక ఈ ప్లాన్‍తో హీరో అన్‍లిమిటెడ్ అదనపు బెనిఫిట్స్ లేవు.
వొడాఫోన్ ఐడియా రూ.17 ప్లాన్
వొడాఫోన్ ఐడియా రూ.17 ప్లాన్ తీసుకుంటే 24 గంటల వ్యాలిడిటీ ఉంటుంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య అన్‍లిమిటెడ్ డేటా వస్తుంది. అయితే ఈ ప్లాన్‍తో ఎలాంటి కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉండవు. అంటే, వేరే ఏదైనా ప్లాన్ వాడుతుంటే.. దానికి అదనంగా నైట్ డేటా కోసం ఈ రూ.17 ప్లాన్ రీచార్జ్ చేసుకోవచ్చు.
వొడాఫోన్ ఐడియా రూ.57 ప్లాన్
వొడాఫోన్ ఐడియా రూ.57 ప్లాన్ కూడా నైట్ డేటా ప్లానే. ఇది తీసుకుంటే ఏడు రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ప్రతీ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య అన్‍లిమిడెట్ డేటా ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి ఔట్‍గోయింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. కాల్స్, ఎస్ఎంఎస్‍లు చేసుకోవాలంటే వేరే ప్లాన్ కూడా తీసుకొని ఉండాలి.
వొడాఫోన్ ఐడియా ఇటీవల రూ.549 ప్లాన్‍ను ఎత్తేసింది. ఈ ప్లాన్‍ను ప్రవేశపెట్టిన కొన్ని రోజులకే తీసేసింది. ఈ ప్లాన్‍తో 150 రోజుల వ్యాలిడిటీ ఉండేది. ప్రతీ రోజు 1జీబీ డేటా, రూ.549 టాక్‍టైమ్ లభించేది. కాల్‍కు ప్రతీ సెకనుకు 2.5 చార్జ్ పడేది. ఈ ప్లాన్‍ను వొడాఫోన్ ఐడియా ఇటీవలే తొలగించింది.
ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా కంపెనీ ఆర్థిక నష్టాలతో ఉంది. క్రమంగా యూజర్లను కూడా కోల్పోతోంది. ఇంత వరకు 5జీ నెట్‍వర్క్ ను కూడా లాంచ్ చేయలేదు. ఈ క్రమంలో ఆదాయం, యూజర్ల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది వొడాఫోన్ ఐడియా. కొత్త ప్లాన్‍లను ప్రవేశపెడుతోంది.