జియోహాట్​స్టార్​ సబ్​స్క్రిప్షన్​ ఫ్రీ! Vi కొత్త రీఛార్జ్​ ప్లాన్స్​తో ఇక నాన్​-స్టాప్​ క్రికెట్​..-vodafone idea introduces 3 new recharge plans for this ipl 2025 season see details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  జియోహాట్​స్టార్​ సబ్​స్క్రిప్షన్​ ఫ్రీ! Vi కొత్త రీఛార్జ్​ ప్లాన్స్​తో ఇక నాన్​-స్టాప్​ క్రికెట్​..

జియోహాట్​స్టార్​ సబ్​స్క్రిప్షన్​ ఫ్రీ! Vi కొత్త రీఛార్జ్​ ప్లాన్స్​తో ఇక నాన్​-స్టాప్​ క్రికెట్​..

Sharath Chitturi HT Telugu

Vi recharge plan : క్రికెట్​ లవర్స్​కి గుడ్​ న్యూస్​! జియోహాస్ట్​స్టార్​ ఫ్రీగా పొందే అవకాశాన్ని తన యూజర్స్​కి ఇస్తోంది వొడాఫోన్​ ఐడియా. ఈ మేరకు 3 కొత్త ప్రీపెయిడ్​ రీఛార్జ్​ ప్లాన్స్​ని ప్రవేశపెట్టింది. ఆ వివరాలు..

క్రికెట్​ లవర్స్​కోసం వీఐ ప్రత్యేక ప్యాక్​లు.. (REUTERS)

ఐపీఎల్​ 2025లో ఉత్కంఠభరిత మ్యాచ్‌లను నిరాటంకంగా వీక్షించాలనుకునే అభిమానుల కోసం వోడాఫోన్ ఐడియా (వీఐ) కొత్త ప్రీపెయిడ్ ప్యాక్‌లను ప్రవేశపెట్టింది. రూ. 101 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాక్‌లు స్పీడ్​ డేటాతో పాటు జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తాయి. ఈ సీజన్ కోసం వీఐ మూడు ప్రత్యేక రీచార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. వీటితో కస్టమర్లు క్రికెట్ మ్యాచ్‌లను ఎలాంటి అంతరాయం లేకుండా, ప్రతి క్షణం ఆస్వాదించవచ్చు.

వొడాఫోన్​ ఐడియా కొత్త రీఛార్జ్ ప్లాన్స్​ వివరాలు..

1. రూ. 101 ప్యాక్: 5 జీబీ డేటా + 3 నెలల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ (30 రోజుల వేలిడిటీ).

2. రూ. 239 ప్యాక్: అన్‌లిమిటెడ్ కాల్స్ + 2 జీబీ డేటా + జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ (28 రోజుల వేలిడిటీ).

3. రూ. 399 ప్యాక్: అన్‌లిమిటెడ్ కాల్స్ + రాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటా + 2 జీబీ డైలీ డేటా + జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ (28 రోజుల వేలిడిటీ).

ఇతర Vi ప్యాక్‌ల లిస్ట్​ ఇలా..

- రూ. 469: అన్‌లిమిటెడ్ కాల్స్ + రాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 వరకు అన్‌లిమిటెడ్ డేటా + 2.5 జీబీ/రోజు + 3 నెలల జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ (28 రోజులు).

- రూ. 994: అన్‌లిమిటెడ్ కాల్స్ + రాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 వరకు అన్‌లిమిటెడ్ డేటా + 2 జీబీ/రోజు + 3 నెలల జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ (84 రోజులు).

- రూ. 3699: అన్‌లిమిటెడ్ కాల్స్ + రాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 వరకు అన్‌లిమిటెడ్ డేటా + 2 జీబీ/రోజు + 1 ఏడాది జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ (365 రోజులు).

పైన పేర్కొన్న వోడాఫోన్​ ఐడియా రీఛార్జ్​ ప్లాన్స్​ అన్నీ జియోహాట్‌స్టార్ మొబైల్-ఓన్లీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తాయి. అన్ని ప్లాన్‌లలో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఉన్నాయి.

కస్టమర్లు వీఐ యాప్ లేదా www.MyVi.in వెబ్‌సైట్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు.

క్రికెట్ ప్రేమికులు ఇప్పుడు ఈ ప్యాక్‌లతో గేమ్‌లో ప్రతి క్షణాన్ని నిరాటంకంగా ఆనందించవచ్చు అని సంస్థ చెబుతోంది.

జియో కూడా..!

ఐపీఎల్​ సీజన్​ని క్యాష్​ చేసుకునేందుకు టెలికాం సంస్థలు పోటీపడుతున్నాయి. రిలయన్స్​ జియో ఇప్పటికే ఎగ్జైటింగ్​ ఆఫర్స్​ని ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్​లో భాగంగా జియో కస్టమర్లు.. టీవీ/ ఫోన్​లో 90 రోజుల ఉచిత జియోహాట్​స్టార్, క్రికెట్ మ్యాచ్​ల 4కే స్ట్రీమింగ్, జియో ఫైబర్ / ఎయిర్​ఫైబర్​కు 50 రోజుల ఉచిత కనెక్షన్​ని పొందవచ్చు.

జియో సిమ్ కార్డు పాత, కొత్త కస్టమర్లకు ఈ కొత్త ఎక్స్​క్లూజివ్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని టెలికాం దిగ్గజం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. రూ.299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్​తో రీఛార్జ్ చేసుకుంటే చాలు ఈ క్రేజీ బెనిఫిట్స్ పొందొచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం