Recharge Plan : రూ.450లోపు రిఛార్జ్ ప్లాన్.. రోజుకు 3 జీబీ డేటా, 15 ఓటీటీ యాప్స్ ఫ్రీ
Recharge Plan : టెలికాం కంపెనీలు ఛార్జీలు పెంచిన తర్వాత కొత్త కొత్త ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగా వొడాఫోన్ ఐడియా కూడా మంచి ప్లాన్స్ అందిస్తోంది. డేటా, ఓటీటీ యాప్స్ వంటి ఆప్షన్స్ పెంచింది.
తక్కువ ధరలో డేటా, ఓటీటీ ప్రయోజనాలతో ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే.. మీ కోసం మంచి ఆప్షన్ ఉంది. వొడాఫోన్-ఐడియా(వీఐ) రూ .449 ప్లాన్ తక్కువ ధరలో లభిస్తుంది. వొడాఫోన్ ఐడియా ఈ ప్లాన్‌లో మీరు రోజుకు 3జీబీ డేటాతో అపరిమిత కాలింగ్ పొందుతారు. దీనితో పాటు ఈ ప్లాన్‌లో మొత్తం 15 ఓటీటీ యాప్స్‌ను ఉచిత యాక్సెస్ కూడా కంపెనీ అందిస్తోంది. ఇది కాకుండా వొడాఫోన్ ఐడియా ప్లాన్ అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వీఐ అందిస్తున్న ఈ ప్లాన్ గురించి తెలుసుకుందాం..
వొడాఫోన్ ఐడియా రూ.449 ప్లాన్
ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇందులో మీరు ఇంటర్నెట్ ఉపయోగించడానికి ప్రతిరోజూ 3జీబీ డేటాను పొందుతారు. కంపెనీ అందించే ఈ ప్లాన్‌లో ఇతర ప్రయోజనాలు కూడా పొందుతారు. ఇందులో వినియోగదారులు ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా ప్రతి నెలా 2జీబీ వరకు బ్యాకప్ డేటా ఇస్తారు.
ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను అందించే ఈ ప్లాన్‌లో మీరు అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఈ ప్లాన్ కంపెనీ వీఐఎంటీవీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. ఇది సోనీ లివ్, జి5 వంటి 15 ఓటిటి యాప్‌లకు ఉచిత యాక్సెస్‌తో వస్తుంది. ఈ ప్లాన్ వీకెండ్ డేటా రోల్ఓవర్ బెనిఫిట్ కూడా లభిస్తుంది.
వీఐ రూ.795 ప్లాన్
వొడాఫోన్-ఐడియా మరో ప్లాన్ గురించి చూద్దాం.. రూ.795 ప్లాన్‌లో మీకు 4 రోజుల వ్యాలిడిటీ ఉచితంగా లభిస్తుంది. అదనపు వాలిడిటీ కోసం మీరు కంపెనీ యాప్ లేదా వెబ్‌సైట్ నుంచి ఈ ప్లాన్‌ను సబ్‌స్రైబ్ చేయాలి. ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజులు. ఇందులో రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది.
ఈ ప్లాన్ బింజ్ ఆల్ నైట్ బెనిఫిట్‌తో వస్తుంది. ఇందులో కంపెనీ ఉదయం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అపరిమిత డేటాను అందిస్తోంది. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు ఇచ్చే ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా లభిస్తుంది. వీకెండ్ డేటా రోల్ఓవర్, డేటా డిలైట్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.