రూ. 25వేల ధరలోపు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! వివో సంస్థ నుంచి మిడ్ రేంజ్ సెగ్మెంట్లో కొత్త గ్యాడ్జెట్ తాజాగా లాంచ్ అయ్యింది. దాని పేరు వివో వై400 ప్రో. ఇదొక 5జీ స్మార్ట్‌ఫోన్. ఇందులో బడా బ్యాటరీతో పాటు అనేక ఫీచర్స్ లభిస్తున్నాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
వివో Y400 ప్రో 5G 8GB ర్యామ్- 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 24,999. అలాగే, 256GB స్టోరేజ్‌తో కూడిన హై-ఎండ్ వేరియంట్ రూ. 26,999కి లభిస్తుంది. ఈ పరికరాన్ని వివో ఇండియా వెబ్‌సైట్ ద్వారా ముందస్తు ఆర్డర్ చేసుకోవచ్చు. జూన్ 27 నుంచి వివో అధికారిక సైట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. కస్టమర్‌లు ఫ్రీస్టైల్ వైట్, ఫెస్ట్ గోల్డ్, నెబ్యులా పర్పుల్ అనే మూడు ఆకర్షణీయమైన రంగులలో ఎంచుకోవచ్చు.
వివో వై400 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ఉంది. ఇది 4ఎన్ఎం ఆక్టా-కోర్ ప్రాసెసర్. దీనికి 8జీబీ LPDDR4X ర్యామ్ కనెక్ట్ చేసి ఉంటుంది. అలాగే, ఇందులో 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్టచ్ఓఎస్ 15పై పనిచేస్తుంది.
ఈ పరికరంలో 6.77 ఇంచ్ ఫుల్-హెచ్‌డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది 3డీ కర్వ్డ్ డిజైన్‌తో వస్తుంది. ఈ డిస్ప్లే 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 300హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్‌కి మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా, ఇది 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉండటంతో, ప్రకాశవంతమైన పరిస్థితుల్లో కూడా స్పష్టమైన వీక్షణను అందిస్తుంది. నెబ్యులా పర్పుల్ ఎడిషన్ కేవలం 7.49ఎంఎం మందంతో, కర్వ్డ్ డిస్ప్లేను అందించే స్లిమ్మెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా వివో పేర్కొంది.
కెమెరా విషయానికి వస్తే, ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో f/1.79 అపెర్చర్‌తో కూడిన 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్882 సెన్సార్‌తో పాటు 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో f/2.45 అపెర్చర్‌తో కూడిన 32ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ముందు, వెనుక కెమెరాలు రెండూ 4కే వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తాయి. వినియోగదారులకు హై-రిజల్యూషన్ చిత్రాలు, వీడియోలు తీసే సామర్థ్యాన్ని అందిస్తాయి.
వివో వై400 ప్రో ఏఐ-ఆధారిత ఇమేజింగ్ ఫీచర్లు, ఏఐ ఫోటో ఎన్‌హాన్స్, ఏఐ ఎరేజ్ 2.0 వంటి వాటితో వస్తుంది. ఉత్పాదకత కోసం, ఏఐ నోట్ అసిస్ట్, ఏఐ ట్రాన్‌స్క్రిప్ట్ అసిస్ట్, ఏఐ స్క్రీన్ ట్రాన్స్లేలేషన్, ఏఐ సూపర్‌లింక్ వంటి టూల్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా, ఇది గూగుల్‌కు చెందిన సర్కిల్ టు సెర్చ్ ఫంక్షనాలిటీకి కూడా మద్దతు ఇస్తుంది.
ఈ వివో వై400 ప్రో 5జీలో 5,500ఎంఏహెచ్ బ్యాటరీ పవర్‌ని అందిస్తుంది. 90వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వడంతో, తక్కువ సమయంలోనే వేగంగా ఛార్జ్ అవుతుంది. కనెక్టివిటీ ఫీచర్లలో డ్యూయల్-సిమ్ 5జీ సపోర్ట్, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఓటీజీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.
సంబంధిత కథనం