Vivo X100s launch : త్వరలోనే వివో ఎక్స్100 సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే!
Vivo X100s price in India : వివో ఎక్స్ 100ఎస్ సిరీస్‌తో పాటు వివో ఎక్స్ 100 అల్ట్రా.. త్వరలోనే లాంచ్కానుంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్స్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Vivo X100s launch date in India : వివో ఎక్స్100ఎస్, ఎక్స్100ఎస్ ప్రో, వివో ఎక్స్100 అల్ట్రా స్మార్ట్‌ఫోన్స్‌ని మే 13న విడుదల చేయనున్నట్లు వివో ప్రకటించింది. లాంచ్‌కు ముందు, లీకులు చక్కర్లు కొడుతున్నాయి. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్స్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూద్దాము..
వివో ఎక్స్ 100ఎస్..
చైనా వీబోలో ఇటీవల వచ్చిన లీక్స్ ప్రకారం.. ఈ మూడు స్మార్ట్‌ఫోన్స్ డిస్ప్లే, బ్యాటరీ స్పెసిఫికేషన్లకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. వివో ఎక్స్100ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో విజనక్స్ తయారు చేసిన '1.5కే' రిజల్యూషన్‌తో కూడిన స్క్రీన్ ఉండనుంది. వివో వీ2 ఇమేజింగ్ చిప్‌తో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ఎస్వోసీతో ఈ ఫోన్ పనిచేయనుంది. 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ, వేగవంతమైన 100వాట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
వివో ఎక్స్ 100ఎస్ ప్రో..
Vivo X100s pro : వివో ఎక్స్ 100ఎస్ ప్రో అదే చిప్సెట్, స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. అదనంగా, ఇది వీ3 ఇమేజింగ్ చిప్‌ని కూడా కలిగి ఉంటుంది. 100 వాట్ వైర్డ్ ఛార్జింగ్, 30 వాట్ వయర్ లెస్ ఛార్జింగ్ రెండింటికీ మద్దతుతో డ్యూయల్ ఛార్జింగ్ ఎంపికను అందిస్తుంది. ఇవన్నీ 5,400 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తాయి.
ఇదీ చూడండి:- Demat Account: మీ డీమ్యాట్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ హిస్టరీ సహా అన్ని వివరాలు తెలుసుకోవడం ఎలా?
వివో ఎక్స్ 100 అల్ట్రా..
మరోవైపు.. కెమెరా-సెంట్రిక్ డివైజ్‌గా పిలుస్తున్న వివో ఎక్స్ 100 అల్ట్రాలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, వివో ఇమేజింగ్ చిప్ వీ3+ ఉంటాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మూడు జీస్-బ్రాండెడ్ కెమెరాలతో కూడిన విలక్షణమైన వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ని ప్రదర్శిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ లైవ్ ఫొటోలు స్పెసిఫికేషన్లు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. ఇందులో 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ సెన్సార్‌తో పాటు ఇతర అధునాతన కెమెరా ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం.
Vivo X100 Ultra price in India : వివో ఎక్స్ 100 అల్ట్రా, ఎక్స్ 100ఎస్, ఎక్స్ 100ఎస్ ప్రో అధికారిక లాంచ్ ఈవెంట్ మే 13న చైనాలో జరగనుంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మూడు స్మార్ట్‌ఫోన్స్ ప్రీ-రిజర్వేషన్లు ప్రస్తుతం చైనాలోని వివో ఆన్లైన్ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. వివో ఎక్స్ 100 అల్ట్రా వివిధ కలర్ ఆప్షన్లు, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో ఉంటాయి. మే 28 నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
అయితే.. ప్రస్తుతం ఇవి రూమర్స్ మాత్రమే. లాంచ్ సమయానికి ఫీచర్స్పై పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి. ధరకు సంబంధించిన వివరాలు కూడా అప్డేట్ అవుతాయి.
సంబంధిత కథనం