Vivo X100 : లాంచ్​కి ముందే వివో ఎక్స్​100 ఫీచర్స్​ లీక్​..-vivo x100 features leaked ahead of launch all you need to know ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo X100 : లాంచ్​కి ముందే వివో ఎక్స్​100 ఫీచర్స్​ లీక్​..

Vivo X100 : లాంచ్​కి ముందే వివో ఎక్స్​100 ఫీచర్స్​ లీక్​..

Sharath Chitturi HT Telugu
Nov 06, 2023 12:50 PM IST

Vivo X100 : లాంచ్​కి ముందే వివో ఎక్స్​100 ఫీచర్స్​ లీక్​ అయ్యాయి. చైనాలో ఈ మోడల్​ త్వరలోనే లాంచ్​కానుంది. ఆ వివరాలు..

లాంచ్​కి ముందే వివో ఎక్స్​100 ఫీచర్స్​ లీక్​..
లాంచ్​కి ముందే వివో ఎక్స్​100 ఫీచర్స్​ లీక్​..

Vivo X100 : వివో సంస్థ నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్​ లాంచ్​కు సిద్ధమవుతోంది. దీని పేరు వివో ఎక్స్​100. ఈ స్మార్ట్​ఫోన్​ సిరీస్​ని.. చైనాలో ఈ నెల 13న లాంచ్​ చేయనుంది వివో. కాగా.. లాంచ్​కి ముందే, ఈ గ్యాడ్జెట్​కి సంబంధించిన పలు ఫీచర్స్​, ధర వంటి వివరాలు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. ఆ వివరాలు..

వివో ఎక్స్​100 ఫీచర్స్​ ఇవే..!

ఆన్​లైన్​లో లీక్​ అయిన డేటా ప్రకారం.. వివో ఎక్స్​100లో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.78 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. యూజర్​ ఎక్స్​పీరియన్స్​ స్మూత్​గా, ఇంప్రెసివ్​గా ఉంటుంది. ఇక ఈ మోడల్​లో 50ఎంపీ ప్రైమరీ, 50ఎంపీ అల్ట్రావైడ్​, 64ఎంపీ పెరిస్కోప్​ సెన్సార్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా వస్తుంది. 3ఎక్స్​ ఆప్టికల్​ జూమ్​ ఆప్షన్​ సైతం లభిస్తోంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం.. ఈ వివో కొత్త స్మార్ట్​ఫోన్​లో 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తుంది.

Vivo X100 launch date in India : ఈ డివైజ్​లో మీడియాటెక్​ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్​ ఉంటుంది. ఎల్​పీడీడీఆర్​5టీ ర్యామ్​, యూఎఫ్​ఎస్​ 4.0 స్టోరేజ్​ దీని సొంతం. ఆండ్రాయిడ్​ 14 ఆధారిత ఆరిజిన్​ఓస్​ 4 సాఫ్ట్​వేర్​పై ఈ గ్యాడ్జెట్​ పనిచేస్తుంది. ఇందులో 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 120వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ వంటివి లభిస్తాయి. బ్లూటూత్​ 5.4, ఇన్​ఫ్రారెడ్​ సెన్సార్​, వైఫై-7, ఎన్​ఎఫ్​సీ వంటి కనెక్టివిటీ ఫీచర్స్​ ఉంటాయి.

ఇదీ చూడండి:- Vivo phones under 15000: 15 వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..

వివో ఎక్స్​100 ధర ఎంతంటే..

రూమర్స్​ ప్రకారం.. ఈ వివో ఎక్స్​100లో 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​, 16జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​, 16జీబీ ర్యామ్​- 512జీబీ స్టోరేజ్​, 16జీబీ ర్యామ్​- 1టీబీ స్టోరేజ్​ వేరియంట్లు ఉంటాయి. చైనాలో ఈ స్మార్ట్​ఫోన్​ సిరీస్​ ప్రారంభ ధర 3,999 యువాన్​లుగా ఉండొచ్చని టాక్​ నడుస్తోంది. అంటే.. ఇండియన్​ కరెన్సీలో అది రూ. 45,550.

Vivo X100 price in India : ఇండియాలో ఈ మోడల్​ లాంచ్​పై ఇంకా క్లారిటీ లేదు. కానీ.. రానున్న కొన్ని నెలల్లో ఈ స్మార్ట్​ఫోన్​ సిరీస్​ కచ్చితంగా లాంచ్​ అవుతుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. రూ. 45వేల రేంజ్​లో లాంచ్​ అయితే.. మిడ్​-రేంజ్​ సెగ్మెంట్​లో పోటీ మరింత పెరుగుతుందని అభిప్రాయపడుతున్నాయి.

వివో లైనప్​ చాలా అట్రాక్టివ్​గా ఉంది. రానున్న నెలల్లో వరుస స్మార్ట్​ఫోన్స్​ని లాంచ్​ చేసేందుకు సంస్థ సిద్ధమవుతోంది. ఇండియాలో కూడా అనేక మోడల్స్​ ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఫలితంగా.. స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో పోటీ మరింత పెరగనుంది!

సంబంధిత కథనం