వివో కంపెనీ తన వీ-సిరీస్ స్మార్ట్‌ఫోన్ల శ్రేణిలో కొత్త మోడల్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. పండుగ సీజన్‌కు ముందు తమ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ, వివో తాజాగా వివో వీ60ఈ ని లాంచ్ చేసింది. ఈ కొత్త హ్యాండ్‌సెట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో చిప్‌సెట్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వివో వీ60ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారతదేశంలో రూ. 29,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ధర 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు నిర్ణయించారు.
8జీబీ + 256జీబీ వేరియంట్ ధర: రూ. 31,999
12జీబీ + 256జీబీ స్టోరేజ్ ఉన్న టాప్-ఎండ్ మోడల్ ధర: రూ. 33,999
ఈ పరికరం రెండు రంగుల్లో లభిస్తుంది. వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఇతర అధీకృత రిటైల్ స్టోర్ల నుంచి దీనిని కొనుగోలు చేయవచ్చు.
ఈ వివో వీ60ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.77 ఇంచ్ క్వాడ్ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 1.07 బిలియన్ రంగులకు సపోర్ట్ చేస్తుంది. మన్నికను పెంచడానికి, కళ్లకు హాయిగా ఉండేలా ఇందులో డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్, లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా అందించారు.
ఫోటోగ్రఫీని ఇష్టపడే వారికి ఈ ఫోన్‌లో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి! వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌లో ప్రధాన సెన్సార్‌గా 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది ఓఐఎస్ (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), 30ఎక్స్ జూమ్, 85ఎంఎం పోర్ట్రెయిట్ ఇమేజింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీనికి తోడు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, ఆరా లైట్ సెటప్‌ని అందించారు. ఇది ఎల్ఈడీ ఫ్లాష్‌గా కూడా పనిచేస్తుంది.
ముందు భాగంలో, హోల్-పంచ్ కటౌట్‌లో 50 మెగాపిక్సెల్ ఐ ఆటో-ఫోకస్ గ్రూప్ సెల్ఫీ కెమెరా ఉంది. ఏఐ ఫెస్టివల్ పోర్ట్రెయిట్, ఏఐ ఫోర్ సీజన్ పోర్ట్రెయిట్, ఇమేజ్ ఎక్స్‌పాండర్ వంటి ఏఐ మోడ్‌లను కలిగి ఉన్న భారతదేశంలోనే మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే అని వివో పేర్కొంది. ఇది వినియోగదారులకు క్రియేటివ్ ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది.
వివో వీ60ఈ స్మార్ట్‌ఫోన్‌లో పెద్ద 6500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 90డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో ఎన్ఎఫ్సీ, ఐఆర్ బ్లాస్టర్, మెరుగైన నెట్‌వర్క్ యాక్సెస్ కోసం 360-డిగ్రీ ఆమ్నిడైరెక్షనల్ ఆంటెన్నా వంటివి ఉన్నాయి.
మన్నికపై దృష్టి సారించిన వివో, ఈ హ్యాండ్‌సెట్‌కు వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లను అందించింది. సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే, ఈ ఫోన్‌లో ఏఐ క్యాప్షన్స్, ఏఐ ఎరేజ్ 3.0, ఏఐ స్మార్ట్ కాల్ అసిస్టెంట్, జెమిని ఇంటిగ్రేషన్ వంటి కొత్త ఏఐ-ఆధారిత సాధనాలను పరిచయం చేశారు. ఇవి రోజువారీ కార్యకలాపాలను మరింత సులభతరం చేస్తాయని కంపెనీ పేర్కొంది.
సంబంధిత కథనం