Vivo V50e : వివో వీ50ఈలో వెడ్డింగ్​ పోర్ట్రెయిట్​ స్టూడియో ఫీచర్​.. లాంచ్​ ఎప్పుడు?-vivo v50e set to launch soon with india exclusive wedding portrait studio feature report ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo V50e : వివో వీ50ఈలో వెడ్డింగ్​ పోర్ట్రెయిట్​ స్టూడియో ఫీచర్​.. లాంచ్​ ఎప్పుడు?

Vivo V50e : వివో వీ50ఈలో వెడ్డింగ్​ పోర్ట్రెయిట్​ స్టూడియో ఫీచర్​.. లాంచ్​ ఎప్పుడు?

Sharath Chitturi HT Telugu

వివో వీ50ఈ స్మార్ట్​ఫోన్​ని​ ఇండియాలో ఎక్స్​క్లూజివ్​ వెడ్డింగ్ పోర్ట్రెయిట్ స్టూడియో ఫీచర్​తో లాంచ్ చేయడానికి సంస్థ సన్నాహాలు చేస్తోంది. రాబోయే స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..

వివో వీ50ఈ (Vivo)

వివో వీ50ఈ స్మార్ట్​ఫోన్​ భారత్​లో లాంచ్​కు రెడీ అవుతోంది. ఈ ఫోన్ ఇప్పటికే బీఐఎస్ సర్టిఫికేషన్ సైట్​లో కనిపించింది. ఇటీవలి రెండర్లు దాని పూర్తి డిజైన్​ని వెల్లడించాయి. కెమెరా సామర్థ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఈ స్మార్ట్​ఫోన్ భారత మార్కెట్ కోసం రూపొందించిన ఇండియా-ఎక్స్​క్లూజివ్ వెడ్డింగ్ పోర్ట్రెయిట్ స్టూడియో ఆప్షన్​ను కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వివో వి50ఈ కెమెరా..

మైస్మార్ట్ ప్రైస్ నివేదిక ప్రకారం.. వివో వీ50ఈ స్మార్ట్​ఫోన్​ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)ను సపోర్ట్ చేసే 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్​తో వస్తుంది. కెమెరాలో సోనీ మల్టీఫోకల్ పోర్ట్రెయిట్స్ 1x, 1.5x, 2x ఫోకల్ లెంగ్త్​లు కూడా ఉంటాయి. ప్రైమరీ కెమెరాతో పాటు ఇండియా ఎక్స్​క్లూజివ్​ వెడ్డింగ్ పోర్ట్రెయిట్ స్టూడియో ఫీచర్ హైలైట్​గా నిలవనుంది. ఇది వినియోగదారులకు ప్రత్యేకమైన ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది.

వివో వీ50 5 జీని పోలిన పనితీరును అందించడానికి ఈ వివో వీ50ఈ కెమెరా సెటప్​ని రూపొందించింది సంస్థ. కానీ మరింత సరసమైన ధరలో ఇది వస్తుండటం విశేషం. బడ్జెట్​లో హై-ఎండ్ ఫీచర్ల కోసం చూస్తున్నవారికి ఇది ఆకర్షణీయమైన ఎంపిక అవ్వొచ్చు.

వివో వీ50ఈ: కీలక ఫీచర్లు (అంచనా)

వివో వీ50ఈ డిజైన్ ఇటీవల విడుదలైన వివో వీ50ని పోలి ఉంటుంది. ఇందులో 1.5కే రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో 6.77 ఇంచ్​ క్వాడ్ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్​ప్లేని అందించనుంది. డైమెన్సిటీ 7300 చిప్ సెట్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్​ను ఇందులో అందించనుంది సంస్థ.

రేర్​ కెమెరా సెటప్​లో ప్రైమరీ 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ ఉంటుంది. సెల్ఫీల కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండొచ్చు. వివో వీ50ఈ స్మార్ట్​ఫోన్​ 90వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,600 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉండనుంది.

ఇన్-డిస్​ప్లే ఫింగర్​ప్రింట్ సెన్సార్, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68+ఐపీ69 రేటింగ్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

వివో వీ50ఈ: భారతదేశంలో ధర (అంచనా)..

వివో వీ50ఈ ధర రూ.25,000 నుంచి రూ.30,000 మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది సఫైర్ బ్లూ, పెర్ల్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ఏప్రిల్ మధ్యలో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది, అయినప్పటికీ ఖచ్చితమైన విడుదల తేదీ ధృవీకరించలేదు.

లాంచ్​ నాటికి ఈ స్మార్ట్​ఫోన్​కి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి.

వివో వై300 ప్రో ప్లస్​..

వివో వై300 సిరీస్​లో మరో స్మార్ట్​ఫోన్​ని సంస్థ లాంచ్​ చేసేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం. ఈ మోడల్​ పేరు వివో వై300 ప్రో ప్లస్​. ఈ నెల 31న చైనాలో ఈ స్మార్ట్​ఫోన్​ లాంచ్​ అవుతుందని పలు లీక్స్​ సూచిస్తున్నాయి. ఇక ఈ వివో వై300 ప్రో ప్లస్​కి సంబంధించిన కొన్ని ఫీచర్స్​ ఇప్పటికే లీక్​ అయ్యాయి. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం