దిగ్గజ వివో సంస్థ ఇటీవలే మరో స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. దీని పేరు వివో వీ50 లైట్ 4జీ. గతేడాది వచ్చిన వివో వీ40 లైట్ 4జీకి ఇది సక్సెసర్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టింది. డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా టెక్నాలజీలో అనేక అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
వివో వీ50 లైట్ 4జీలో 6.77 ఇంచ్ అమోఎల్ఈడీ డిస్ప్లే, ఎఫ్‌హెచ్‌డీ+ రిజల్యూషన్ ఉంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్, 387 పీపీఐ పిక్సెల్ డెన్సిటీని అందిస్తుంది. డిస్ప్లే డీసీఐ పీ3 కలర్ గేమింగ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. మెరుగైన వ్యూయింజ్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఎస్జీఎస్-సర్టిఫైడ్ ఐ కంఫర్ట్, లో బ్లూ లైట్ టెక్నాలజీని కలిగి ఉంది.
7.79 ఎంఎం స్లిమ్ ప్రొఫైల్, 196 గ్రాముల బరువుతో, ఎంఐఎల్-ఎస్టీడీ -810 హెచ్ సర్టిఫికేషన్‌ని ఈ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది. ఇది కఠినమైన పరిస్థితుల్లోనూ మన్నికను నిర్ధారిస్తుంది. ఇది ఐపీ65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ని కలిగి ఉంది.
వివో వీ50 లైట్ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 685 చిప్సెట్, ఆక్టాకోర్ సీపీయూ, అడ్రినో 610 జీపీయూతో పనిచేస్తుంది. 8 జీబీ LPDDR4X ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజ్, వర్చువల్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఆప్షన్ ఇందులో ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై వీ50 లైట్ పనిచేయనుంది. ఏఐ ఫోటో స్టూడియో, ఏఐ సూపర్ లింక్, సర్కిల్ టు సెర్చ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఫోటోగ్రఫీ కోసం ఈ వీ50 లైట్ స్మార్ట్‌ఫోన్‌లో 50 ఎంపి సోనీ ఐఎంఎక్స్ 882 ప్రధాన కెమెరాతో వస్తుంది. ఇది 2 ఎంపీ మాక్రో కెమెరాతో కనెక్ట్ చేసి ఉంటుంది. మెరుగైన షాట్ల కోసం కెమెరా వ్యవస్థను ఏయూఆర్ఏ లైట్‌తో భర్తీ చేశారు. ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా హైక్వాలిటీ సెల్ఫీలను అందిస్తుంది.
6,500 ఎంఏహెచ్ బ్లూవోల్ట్ బ్యాటరీని ఇందులో అందించారు. 90వాట్ ఫ్లాష్‌ఛార్జ్‌తో బ్యాటరీని కేవలం 57.5 నిమిషాల్లో 0% నుంచి 100% వరకు పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని వివో పేర్కొంది. ఇది 6వాట్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. మెరుగైన ఆడియో కోసం 400 శాతం వాల్యూమ్ మోడ్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది.
ఈ వివో వీ50 లైట్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం టర్కీలో అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో అనేక దేశాల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వివో వీ50 లైట్ 4జీ 8 జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర టీఆర్వై 18,999 (సుమారు రూ.45,000). ఇది టైటానియం బ్లాక్, టైటానియం గోల్డ్ అనే రెండు రంగుల్లో లభిస్తుంది. వివో బడ్స్ ట్రూ కొనుగోలుతో పాటు టీఆర్వై 3,000 (సుమారు రూ.7,100) వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ని ఉచితంగా అందిస్తోంది.
సంబంధిత కథనం