Vivo V50 : వివో వీ50 లాంచ్.. ఫొటోగ్రఫీ చేసేవారికి చాలా నచ్చేస్తుంది ఈ స్మార్ట్‌ఫోన్!
Vivo V50 : వివో తన లేటెస్ట్ కెమెరా సెంటర్ స్మార్ట్ ఫోన్ వివో వీ50ని భారత్‌లో లాంచ్ చేసింది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ సెగ్మెంట్లో స్లిమ్ ఫోన్‌గా ఇది ఉంటుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..

వివో వీ50ని లాంచ్ అయింది. వివో నుంచి వచ్చిన ఈ కొత్త ఫోన్లో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, క్వాడ్ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉన్నాయి. స్లిమ్ ఫోన్‌గా ఇది ఉంటుంది. వివో వీ50 స్మార్ట్‌ఫోన్‌లో జీఈఐఎస్ఎస్‌తో కూడిన కెమెరాలు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లక్షణాలను సపోర్ట్ చేస్తుంది. వివో వి50 ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం..
ధరలు
వివో వీ50 భారతదేశంలో మూడు మెమొరీ వేరియంట్లలో లాంచ్ అయింది. వివో వీ50 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.34,999గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.36,999గానూ.. 12 జీబీ ర్యామ్ ప్లస్ 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.40,999గానూ నిర్ణయించారు. ఇప్పటికే ఈ ఫోన్ ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయని, ఫిబ్రవరి 25, 2025 నుంచి సేల్ ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.
కలర్ ఆప్షన్స్
వివో వీ50 కొనుగోలులో జీరో డౌన్ పేమెంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో 10 శాతం తక్షణ తగ్గింపు, మరెన్నో ఉన్నాయి. రోజ్ రెడ్, టైటానియం గ్రే, స్టార్రీ నైట్ రంగుల్లో ఈ కొత్త వివో ఫోన్ అందుబాటులో ఉంది.
వివో వీ50 స్పెసిఫికేషన్లు
వివో వీ50 అల్ట్రా-స్లిమ్ క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది వివో వీ సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో మొదటిది. వివో వీ50 స్మార్ట్‌ఫోన్‌లో 6.77 అంగుళాల డిస్‌ప్లే, 2392×1080 పిక్సెల్ రిజల్యూషన్ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 అంగుళాల లోకల్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ ఉన్నాయి. ఫోన్ డిస్‌ప్లేను సంరక్షించడానికి డైమండ్ షీల్డ్ గ్లాస్‌తో వస్తుంది. వివో వీ50లో ప్రత్యేక వెడ్డింగ్ పోర్ట్రెయిట్ స్టూడియో ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్ 3 ఏళ్ల ఆండ్రాయిడ్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తుంది.
భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6000 వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో 90 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.
వివో వీ50 స్మార్ట్‌ఫోన్‌లో జీఈఐఎస్ఎస్ కో-ఇంజనీరింగ్ కెమెరా సిస్టమ్ ఉంది. వెనకవైపు 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీల కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ ఏఎఫ్ సెన్సార్ ఉన్నాయి. ఈ డివైజ్‌లో వివో స్మార్ట్ ఏఐ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో సర్కిల్ టు సెర్చ్, వివో లైవ్ కాల్ ట్రాన్స్లేషన్, ఏఐ ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్‌లాంటి ఫీచర్లు ఉంటాయి.
సంబంధిత కథనం
టాపిక్