Budget Smartphone : మంచి స్మార్ట్​ఫోన్​కి రూ. 15వేలు చాలు! ఈ రెండు బడ్జెట్​ ఫ్రెండ్లీ- ఏది బెస్ట్​?-vivo t4x vs realme p3 which is the best 5g phone under 15000 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget Smartphone : మంచి స్మార్ట్​ఫోన్​కి రూ. 15వేలు చాలు! ఈ రెండు బడ్జెట్​ ఫ్రెండ్లీ- ఏది బెస్ట్​?

Budget Smartphone : మంచి స్మార్ట్​ఫోన్​కి రూ. 15వేలు చాలు! ఈ రెండు బడ్జెట్​ ఫ్రెండ్లీ- ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu

Vivo T4x vs Realme P3 రూ. 15వేలల్లో మంచి స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? మార్కెట్​లో వివో టీ4ఎక్స్​, రియల్​మీ పీ3 మధ్య మంచి పోటీ నెలకొంది. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్​? ఇక్కడ తెలుసుకోండి..

వివో టీ4ఎక్స్​ వర్సెస్​ రియల్​మీ పీ3

ఇండియాలో బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ మార్కెట్​కి మంచి డిమాండ్​ ఉంది. ఈ సెగ్మెంట్​లో ఇప్పుడు రియల్​మీ పీ3, వివో టీ4ఎక్స్​లు పోటీపడుతున్నాయి. మరి రూ. 15వేల కంటే తక్కువ ధరతో వస్తున్న ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వివో టీ4ఎక్స్ స్పెసిఫికేషన్స్​..

వివో టీ4ఎక్స్ 6.72 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ ఎల్​సీడీ డిస్​ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో వస్తోంది. ఈ డిస్​ప్లే 1050 నిట్స్ పీక్​ బ్రైట్​నెస్​ని అందిస్తోంది. ఐ-ప్రొటెక్షన కోసం టీయూవీ రీన్​లాండ్-సర్టిఫికేట్ పొందింది ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​.

మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 8 జీబీ వరకు ర్యామ్​ని ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్​టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ స్మార్ట్​ఫోన్ లైవ్ టెక్స్ట్, సర్కిల్ టు సెర్చ్, ఏఐ స్క్రీన్ ట్రాన్స్​లేషన్ వంటి ఏఐ ఆధారిత ఫీచర్లతో వస్తోంది.

వివో టీ4ఎక్స్​లో ప్రైమరీ కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది.

వివో టీ4ఎక్స్ 5జీ స్మార్ట్​ఫోన్​లో 6500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అదనంగా, ఇది 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్​కి సపోర్ట్​ చేస్తుంది.

మన్నిక కోసం, టీ4ఎక్స్ 5జీ మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్​ని కలిగి ఉంది. ఐపీ64 రేటింగ్​తో వస్తోంది. ఇది వాటర్​ స్ల్పాష్​- డస్ట్​ రెసిస్టెన్స్​గా పనిచేసతుంది.

రియల్​మీ పీ3 స్పెసిఫికేషన్స్​..

రియల్​మీ పీ3 5జీ స్మార్ట్​ఫోన్​లో 6.67 ఇంచ్​ అమోఎల్ఈడీ డిస్​ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​, ప్రోఎక్స్​డీఆర్ సపోర్ట్ ఉన్నాయి. స్నాప్​డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్​ ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​లో అందించారు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్​మీ యూఐ 6.0 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్​లో 2ఏళ్ల ఓఎస్ అప్​డేట్స్, 3 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్​లు లభిస్తాయి.

ఈ స్మార్ట్​ఫోన్​లో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. హై రిజల్యూషన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం రెండు మోడళ్లలో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఈ రియల్​మీ పీ3 5జీలో అందించారు. ఇది ఐపీ68, ఐపీ69 వాటర్​ అండ్​ డస్ట్​ రెసిస్టెన్స్​తో వస్తుంది. అంటే ఫోన్ 1.5 మీటర్ల నీటిలో 30 నిమిషాల పాటు మునిగిపోయినా, వేడి / చల్లని నీటి జెట్లను ఏ దిశ నుంచి వచ్చినా రెసిస్ట్​ చేసుకోగలదు.

ఈ స్మార్ట్​ఫోన్స్​ ధరలు ఇవి..

వివో టీ4ఎక్స్ స్మార్ట్​ఫోన్​ ప్రారంభ 6 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .13,999. టాప్ ఎండ్ 8 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .14,999.

రియల్​మీ పీ3 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999 కాగా, 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999. అయితే ఈ ఫోన్ ప్రస్తుతం కొన్ని బ్యాంక్ ఆఫర్లను పొందుతోంది. ఇది బేస్ వేరియంట్​ని రూ .15,000 కంటే తక్కువకు తీసుకువెళుతుంది.

రూ.15,000 లోపు ఏ ఫోన్ బెటర్?

రియల్​మీ పీ3 స్మార్ట్​ఫోన్​లో అమోఎల్ఈడీ డిస్​ప్లే, ఐపీ69 వాటర్ రెసిస్టెన్స్, హై రిజల్యూషన్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. అయితే వివో టీ4ఎక్స్ స్మార్ట్​ఫోన్​లో మరింత విశ్వసనీయమైన డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఎంఐఎల్-ఎస్టీడీ-810హెచ్ మిలిటరీ సర్టిఫికేషన్ ఉన్నాయి.

రూ.15,000 లోపు ఏ ఫోన్ కొనాలి? మీకు పెద్ద బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్ కావాలంటే టీ4ఎక్స్ తీసుకోవచ్చు. అమోఎల్ఈడీ స్క్రీన్, వాటర్ రెసిస్టెన్స్ కావాలంటే రియల్​మీ పీ3ని ఎంచుకోవచ్చు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం