Vivo T4x 5G : వివో నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్- ఈసారి అతిపెద్ద బ్యాటరీతో..
Vivo T4x 5G launch : వివో టీ4ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే లాంచ్‌కు రెడీ అవుతోంది. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో ఇదే అతిపెద్ద బ్యాటరీ కలిగిన గ్యాడ్జెట్ అవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో నుంచి సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్ ఇండియాలో లాంచ్‌కు రెడీ అవుతోంది. ఈ వివో టీ4ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఇంకొన్ని రోజుల్లో ఇండియాలో లాంచ్ చేయనుంది సంస్థ. దీనికి సంబంధించిన టీజర్స్‌ని వదులుతోంది. అంతేకాదు, లాంచ్‌ని ధ్రువీకరిస్తూ.. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్‌కి సంబంధించిన వివరాలను కూడా పంచుకుంది. ఈ నేపథ్యంలో ఈ వివో టీ4ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వివో టీ4ఎక్స్ 5జీ లాంచ్..
వివో తన రాబోయే టీ4ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ని మార్చ్‌లో లాంచ్ చేయనుంది. అయితే అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించాల్సి ఉంది. రూ.15,000 లోపు ధర కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్.. సెగ్మెంట్లోనే భారీ బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. గత సంవత్సరం, వివో టీ3ఎక్స్ 5జీ 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. కాబట్టి, కొత్త తరం గ్యాడ్జెట్ ఊహించిన విధంగా పెద్ద బ్యాటరీతో రావొచ్చు. వివో టీ4ఎక్స్ 5జీ కోసం ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్పై ఒక ఫుట్ నోట్ ఈ స్మార్ట్‌ఫోన్ 6500 ఎంఏహెచ్ బ్యాటరీతో రావచ్చని వెల్లడించింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు.
పెద్ద బ్యాటరీతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులను ఆకట్టుకునే కొన్ని ఆసక్తికరమైన ఏఐ ఫీచర్లను కూడా అందించనుంది. చివరిగా.. వివో టీ4ఎక్స్ 5జీ వివో అధికారిక సైట్, ఇతర రిటైల్ స్టోర్లలో విక్రయించనున్నట్టు సంస్థ ధ్రువీకరించింది.
వివో టీ4ఎక్స్ 5జీ: స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..
వివో టీ4ఎక్స్ 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పర్ఫార్మెన్స్ని బూస్ట్ పొందుతుందని భావిస్తున్నారు. యాంటు బెంచ్‌మార్క్‌లో ఈ ప్రాసెసర్ 7,28,000 పాయింట్లను సాధించింది. ఈ స్మార్ట్‌ఫోన్.. వివో వై58 మాదిరిగానే కెమెరా మాడ్యూల్ సమీపంలో డైనమిక్ లైట్‌ని కలిగి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. చివరగా, ఇది ప్రోంటో పర్పుల్, మెరైన్ బ్లూ అనే రెండు కలర్ వేరియంట్లలో లాంచ్ కానుంది. ఇప్పుడు, ఈ స్పెసిఫికేషన్లను ధృవీకరించడానికి, బడ్జెట్ స్మార్ట్ఫోన్స్వైపు చూసే తన కొనుగోలుదారుల కోసం ఏం రెడీ చేస్తోందో తెలుసుకోవడానికి అధికారిక లాంచ్ వరకు వేచి చూడాల్సిందే!
వివో వీ50 కూడా..!
వివో సంస్థ మంచి జోరు మీద ఉంది. వరుసపెట్టి లాంచ్‌లను సిద్ధం చేస్తోంది. వివో వీ50ని ఇండియాలో లాంచ్ చేస్తున్నట్టు దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ స్పష్టం చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న వివో వీ40కి ఇది అప్డేటెడ్ వర్షెన్‌గా రాబోతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. టెక్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి..
సంబంధిత కథనం