ఏఐ ఫీచర్లు, పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో వివో టీ4 లైట్ 5జీ లాంచ్.. బేస్ మోడల్ ధర రూ.9,999!-vivo t4 lite 5g smartphone with 6000mah battery and 50mp sony camera launched starting price at 9999 rupees ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఏఐ ఫీచర్లు, పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో వివో టీ4 లైట్ 5జీ లాంచ్.. బేస్ మోడల్ ధర రూ.9,999!

ఏఐ ఫీచర్లు, పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో వివో టీ4 లైట్ 5జీ లాంచ్.. బేస్ మోడల్ ధర రూ.9,999!

Anand Sai HT Telugu

టెక్ కంపెనీ వివో తన కొత్త బడ్జెట్ డివైజ్ వివో టీ4 లైట్ 5జీని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ ఏఐ కెమెరా, 6000 ఎంఏహెచ్ సామర్థ్యంతో పెద్ద బ్యాటరీ ఉన్నాయి.

వివో టీ4 లైట్ 5జీ

టెక్ బ్రాండ్ వివో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వివో టీ4 లైట్ 5జీని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. బడ్జెట్ సెగ్మెంట్‌లో స్టైలిష్ అండ్ స్ట్రాంగ్ డిజైన్‌తో ఈ డివైజ్‌ను మార్కెట్లో భాగం చేశారు. ఇందులో 6000 ఎంఏహెచ్ సామర్థ్యంతో ఏఐ ఫీచర్లు, పెద్ద బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ బ్యాటరీ 5 సంవత్సరాల పాటు మంచి పనితీరును పొందుతుందని కంపెనీ తెలిపింది.

ఫీచర్లు

వివో టీ4 లైట్ 5జీ పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రకాశవంతమైన సూర్యరశ్మిలో కూడా సులభంగా కనిపిస్తుంది. కళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉండేందుకు ఈ ఫోన్‌కు టీయూవీలో బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఇచ్చారు. ఐపీ64 రేటింగ్ పొందింది. వివో టీ4 లైట్ 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఎంటీయూ బెంచ్‌మార్క్‌లో 43000 పాయింట్లు సాధించింది. 4 జీబీ నుంచి 8 జీబీ వరకు ర్యామ్ ను ఇందులో అందించారు. 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ కూడా ఉంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే వివో టీ4 లైట్ 5జీలో 50 మెగాపిక్సెల్ సోనీ ఏఐ కెమెరా, 2 మెగాపిక్సెల్ బోకే లెన్స్‌తో డ్యూయల్ కెమెరా ఉన్నాయి. ఏఐ ఎరేజ్, ఏఐ ఫోటో ఎన్హాన్స్మెంట్, డాక్యుమెంట్ మోడ్ వంటి ప్రత్యేక ఏఐ ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీనికి 3 సంవత్సరాల పాటు రెండు ప్రధాన ఓఎస్ అప్‌డేట్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇస్తామని హామీ ఇచ్చారు.

ధరలు

ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగిన వివో డివైజ్ బేస్ మోడల్ ధర రూ.9,999. 6 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.10,999కు, 8 జీబీ ర్యామ్‌తో 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.12,999కు కొనుగోలు చేయవచ్చు. జూలై 2, 2025 నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమవుతాయని, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇది టైటానియం గోల్డ్, ప్రిజం బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.