Vivo T3x 5G Discount : ఈ వివో 5జీ స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్.. రూ. 12,999కే కొనుగోలు చేయెుచ్చు-vivo t3x 5g smartphone gets discount you can buy at 12999 rupees know offer details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo T3x 5g Discount : ఈ వివో 5జీ స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్.. రూ. 12,999కే కొనుగోలు చేయెుచ్చు

Vivo T3x 5G Discount : ఈ వివో 5జీ స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్.. రూ. 12,999కే కొనుగోలు చేయెుచ్చు

Anand Sai HT Telugu
Jan 01, 2025 12:30 PM IST

Vivo T3x 5G Discount : వివో కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్. వివో టీ3ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ తగ్గింపు ధరతో వస్తుంది. ఆ వివరాలేంటో చూసేద్దాం..

వివో టీ3ఎక్స్ 5జీపై డిస్కౌంట్
వివో టీ3ఎక్స్ 5జీపై డిస్కౌంట్

ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్ల మీద తగ్గింపు ధరలను ప్రకటిస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని పాపులర్ ఫోన్లు డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. అందులో వివో టీ3ఎక్స్ 5జీ మెుబైలు కూడా ఉంది. దీని మీద భారీగా డిస్కౌంట్ ఉంది. ఈ సమయంలో కొనుగోలు చేస్తే ఆఫర్ ద్వారా బెనిఫిట్ పొందవచ్చు.

yearly horoscope entry point

వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్ మీద 25 శాతం ప్రత్యక్ష తగ్గింపుతో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇప్పుడు కొనుగోలుదారులు ఈ ఫోన్ 4జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 12,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

వివో టీ3ఎక్స్ 5జీ మొబైల్ ఫోన్ 4జీబీ ప్లస్ 128జీబీ, 6జీబీ ప్లస్ 128 జీబీ, 8జీబీ ప్లస్ 128జీబీ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఫీచర్లు

వివో టీ3ఎక్స్ 5జీ మొబైల్ 6.72-అంగుళాల డిస్‌ప్లేతో 120 Hz రిఫ్రెష్ రేట్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఇది 1000 నిట్స్ HBM బ్రైట్‌నెస్ ఆప్షన్, 339 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 83 శాతం NTSC కలర్ గామట్‌తో 2408 x 1080 పిక్సెల్‌ల పూర్తి HDప్లస్ రిజల్యూషన్ సామర్థ్యం గల డిస్‌ప్లే.

కెమెరా వివరాలు

వివో టీ3ఎక్స్ 5జీ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్ ప్రాసెసర్‌లో రన్ అవుతుంది. Adreno 710 GPU ద్వారా కూడా సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 14తో ఉంటుంది. మొబైల్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. సెకండరీ కెమెరా 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఇది ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంది.

వివో టీ3ఎక్స్ 5జీ మొబైల్ బరువు 199 గ్రాములు, యాస్పెక్ట్ రేషియో 165.70 - 76.0 - 7.99mm. ఇది 6000 mAh కెపాసిటీ బ్యాటరీతో వస్తుంది. 44W ఫ్లాష్ ఛార్జ్‌కు సపోర్ట్ చేస్తుంది.

గమనిక : డిస్కౌంట్ రోజురోజుకు మారుతూ ఉండవచ్చు. ప్రస్తుతం ఉన్న ఆఫర్ ఆధారంగా కథనం ఇచ్చాం. భవిష్యత్తులో ఈ ఆఫర్ ధరలో మార్పు జరగవచ్చు.

Whats_app_banner