Vishnu Prakash IPO: స్టాక్ మార్కెట్లో ఐపీఓల హవా కొనసాగుతోంది. ఏరో ఫ్లెక్స్, పిరమిడ్ టెక్నో ప్లాస్ట్ ఐపీఓల తరువాత.. తాజాగా మార్కెట్లోకి విష్ణుప్రకాశ్ ఆర్ పుంగ్లియా లిమిటెడ్ ఐపీఓ వచ్చింది. ఈ ఐపీఓ కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. విష్ణుప్రకాశ్ ఆర్ పుంగ్లియా లిమిటెడ్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (EPC) సంస్థ. దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో ఈ సంస్థకు కస్టమర్లు ఉన్నారు.
ఈ విష్ణుప్రకాశ్ ఆర్ పుంగ్లియా లిమిటెడ్ ఐపీఓ బిడ్డింగ్ ప్రక్రియ ఆగస్ట్ 24న ప్రారంభమైంది. ఆగస్ట్ 28 వరకు ఇన్వెస్టర్లు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. ఆగస్ట్ 25 మధ్యాహ్నం వరకు ఈ ఐపీఓ 7.53 రెట్లు, అంటే 16.49 కోట్ల ఈక్విటీ షేర్లకు సబ్ స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓ ఇప్పటివరకు రిటైల్ కేటగిరీలో 9.86 రెట్లు, ఎన్ఐఐ కేటగిరీలో 11.97 రెట్లు, క్యూఐబీ కేటగిరీలో 0.24 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓ ద్వారా 3.12 కోట్ల ఈక్విటీ షేర్లను సేల్ చేయనున్నారు.
ఈ ఐపీఓకు గ్రే మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. శుక్రవారం ఆగస్ట్ 25న ఈ ఐపీఓ షేర్లు గ్రే మార్కెట్ లో రూ. 55 ప్రీమియం (GMP) తో ట్రేడ్ అవుతున్నాయి. నిజానికి, ఈ ఐపీఓ ఓపెన్ అయిన ఆగస్ట్ 24న ఈ షేర్ల జీఎంపీ రూ. 65 గా ఉంది. అంటే, ఒక్క రోజులో రూ. 10 మేర జీఎంపీ తగ్గింది.
ఈ ఐపీఓ ద్వారా ప్రమోటర్లు రూ. 308.88 కోట్ల నిధులను సమీకరించనున్నారు. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఒక్కో ఈక్విటీ షేర్ కు రూ. 94 నుంచి రూ. 99 మధ్య ఉంది. లాట్ సైజ్ 150 ఈక్విటీ షేర్లు. అంటే, ఒక లాట్ కు సబ్ స్క్రైబ్ చేయడానికి ఇన్వెస్టర్ కు రూ. 14,850 అవసరమవుతాయి. ఈ ఐపీఓ బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ల్లో సెప్టెంబర్ 5 వ తేదీన లిస్ట్ అయ్యే అవకాశముంది.
సూచన: ఈ కథనం మార్కెట్ నిపుణుల అంచనా మాత్రమే. ఇన్వెస్టర్లు స్వీయ విచక్షణతో నిర్ణయం తీసుకోవడం సముచితం.