క్రికెట్​లోనే కాదు సంపదలో కూడా 'కింగ్​'- విరాట్​ కోహ్లీ నెట్​వర్త్​ ఎంతో తెలుసా?-virat kohli test retirement check this indian batters net worth real estate brands and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  క్రికెట్​లోనే కాదు సంపదలో కూడా 'కింగ్​'- విరాట్​ కోహ్లీ నెట్​వర్త్​ ఎంతో తెలుసా?

క్రికెట్​లోనే కాదు సంపదలో కూడా 'కింగ్​'- విరాట్​ కోహ్లీ నెట్​వర్త్​ ఎంతో తెలుసా?

Sharath Chitturi HT Telugu

క్రికెట్​లోనే కాదు సంపదలోనూ విరాట్​ కోహ్లీ కింగ్​ అనే చెప్పుకోవాలి! టెస్ట్​ క్రికెట్​కి రిటైర్మెంట్​ ఇచ్చిన నేపథ్యంలో విరాట్​ కోహ్లీ నెట్​ వర్త్​, బ్రాండ్​ ఎండోర్స్​మెంట్స్​, రియల్​ ఎస్టేట్​ సంపాదనతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

విరాట్​ కోహ్లీ.. (PTI)

టెస్టులకు అనూహ్యంగా రిటైర్మెంట్​ ప్రకటించి, యావత్​ క్రికెట్​ ప్రపంచాన్ని షాక్​కి గురిచేశాడు విరాట్​ కోహ్లీ. కింగ్​ కోహ్లీ ప్రకటన తర్వాత చాలా మంది.. "ఇక టెస్ట్​ క్రికెట్​ చూడటం ఆపేస్తాము," అని సోషల్​ మీడియా వేదికగా తమ ఎమోషన్స్​ని షేర్​ చేసుకుంటున్నారు. అది.. ఒక కెప్టెన్​గా, ఒక బ్యాటర్​గా టెస్ట్​ క్రికెట్​లో కోహ్లీ చేసిన మ్యాజిక్​! దిల్లీలోని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి వన్​ అఫ్​ ది బెస్ట్​ క్రికెటర్​గా కోహ్లీ ఎదిగిన తీరు.. నిజంగా స్ఫూర్తిదాయకం. కోహ్లీ హార్డ్​వర్క్​తో అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా మారిపోయింది. విరాట్​ కోహ్లీ రిటైర్మెంట్​ నేపథ్యంలో అతని నెట్​ వర్త్​, బిజినెస్​ వెంచర్ల గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి..

దిల్లీలో పుట్టిన విరాట్​ కోహ్లీ తండ్రి పేరు ప్రేమ్​ నాథ్​ కోహ్లీ. ఆయన ఒక లాయర్​. అతని తల్లి ఒక గృహిణి. వారిది సాధారణ మధ్యతరగతి కుటుంబం. చిన్నవయస్సులోనే క్రికెట్​పై కోహ్లీకి ఉన్న ఆసక్తిని పసిగట్టిన తండ్రి ప్రేమ్​ కోహ్లీ.. 2 వీలర్​ మీద అతడిని ప్రాక్టీస్​లకు, మ్యాచ్​లకు తీసుకెళ్లేవారు. కోహ్లీ అంచెలంచెలుగా ఎదిగి.. ఇప్పుడు అత్యంత సంపన్న క్రికెటర్స్​లో ఒకరిగా నిలిచాడు.

పలు మీడియా కథనాల ప్రకారం విరాట్​ కోహ్లీ నెట్​ వర్త్​ రూ. 1,050 కోట్ల పైమాటే. అతని భార్య అనుష్క శర్మ నెట్​ వర్త్​ రూ. 255 కోట్లు. క్రికెట్​- సినిమాల్లోనే కాదు ఈ జంట.. వ్యాపారం, పెట్టుబడులు, బ్రాండ్​ ఎండోర్స్​మెంట్లు, బిజనెస్​ వెంచర్స్​లో కూడా సక్సెస్​ సాధిచారు. వీటన్నింటి వల్ల ఇద్దరి నెట్​వర్త్​ రూ. 1,250 కోట్ల కన్నా ఎక్కువే ఉంటుందని అంచనా.

విరాట్​ కోహ్లీ నెట్​ వర్త్​..

విరాట్​ కోహ్లీ ప్రధాన ఆదాయం.. బీసీసీఐ ఏ+ సెంట్రల్​ కాంట్రాక్ట్​. ఈ లిస్ట్​లో ఉన్న క్రికెటర్లకు వార్షికంగా రూ. 7కోట్లు అందుతాయి. దీనితో పాటు మ్యాచ్​ ఫీజు (టెస్టులకు రూ. 15లక్షలు, వన్డేలకు రూ. 6లక్షలు, టీ20లకు రూ. 3లక్షలు) అందుతుంది. వీటితో పాటు ఐపీఎల్​లో 2008 నుంచి ఆర్సీబీకి ఆడుతున్న కోహ్లీకి 2025 సీజన్​లో రూ. 21కోట్లు అందుతాయి.

మొత్తం మీద చూసుకుంటే ఒక్క ఐపీఎల్​ నుంచే (2008 నుంచి ఇప్పటివరకు) విరాట్​ కోహ్లీ రూ. 212 కోట్లు సంపాదించాడని పలు నివేదికలు చెబుతున్నాయి.

బ్రాండ్​ ఎండోర్స్​మెంట్స్​లోనూ 'కింగ్​'..

ప్రపంచ క్రికెట్​లో వన్​ అఫ్​ ది బెస్ట్​ క్రికెటర్​గా గుర్తింపు తెచ్చుకున్న విరాట్​ కోహ్లీకి 30కిపైగా బ్రాండ్​ ఎండోర్స్​మెంట్స్​ పోర్ట్​ఫోలియో ఉంది. ఎంఆర్​ఎఫ్​ టైరస్​, పూమా, ఆడీ ఇండియా, మింత్ర సహా ఎన్నో బ్రాండ్స్​ని కోహ్లీ ప్రమోట్​ చేస్తున్నాడు. వీటి ద్వారా వందల కోట్ల సంపద వెనకేసుకుంటున్నాడు.

బిజినెస్​లోనూ 'కింగ్​'..

క్రికెట్​లోనే కాదు బిజినెస్​లోనూ కోహ్లీ కింగే! ఈ రన్​ మెషిన్​కి అనేక బిజినెస్​ వెంచర్లు ఉన్నాయి. వన్​8, వ్రాంగన్​, చిసెల్​ ఫిట్​నెస్​, నౌవా, రజ్​ కాఫీ, డిజిట్​ ఇన్సూరెన్స్​, బ్లూ ట్రైబ్​ వంటి వాటిల్లో కోహ్లీకి పెట్టుబడులు ఉన్నాయి. యూకే ఆధారిత స్పోర్ట్​ కాన్వోలో సైతం ఈక్విటీ ఉంది.

రియల్​ ఎస్టేట్​లోనూ 'కింగ్​'..

రియల్​ ఎస్టేట్​ విషయంలో విరాట్​ కోహ్లీ- అనుష్క శర్మ జోడి సూపర్​ హిట్​ కొట్టిందనే చెప్పుకోవాలి! వీరిద్దరికి గురుగ్రామ్​లో 10వేల స్క్వేర్​ ఫీట్​ (రూ. 80కోట్లు) ఉన్న మాన్షన్​ ఉంది. ముంబైలో కూడా ఒక అపార్ట్​మెంట్​ ఉంది. దీని విలువ సుమారు రూ. 35 కోట్లు.

విరాట్​ కోహ్లీ లగ్జరీ కార్స్​ కలెక్షన్​ లిస్ట్​ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

భారీ మొత్తంలో సంపాదన మాత్రమే కాదు, అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు కోహ్లీ. 2013లో విరాట్​ కోహ్లీ ఫౌండేషన్​ని ప్రారంభి, స్పోర్ట్స్​ని- అథ్లెట్స్​ని ప్రోత్సహిస్తున్నాడు.

ఏదేమైనా, కోహ్లీ తన కష్టంతో ఇంత సంపదను వెనకేసుకున్నాడు. మనం కూడా ఈ రన్​ మెషిన్​ సంపదని కాదు.. అతని డెడికేషన్​ని, హార్డ్​వర్క్​ని చూసి, వాటితో స్ఫూర్తి పొందితే, మనం మన ఫీల్డ్​లో ఒక కోహ్లీ అవుతాము!

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం