New electric scooters : ఒకేసారి 5 ఎలక్ట్రిక్​ స్కూటర్లను దింపిన​ విన్​ఫాస్ట్​- రెట్రో స్టైల్​తో!-vinfast evo s theon s and other electric scooters showcased at auto expo 2025 check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New Electric Scooters : ఒకేసారి 5 ఎలక్ట్రిక్​ స్కూటర్లను దింపిన​ విన్​ఫాస్ట్​- రెట్రో స్టైల్​తో!

New electric scooters : ఒకేసారి 5 ఎలక్ట్రిక్​ స్కూటర్లను దింపిన​ విన్​ఫాస్ట్​- రెట్రో స్టైల్​తో!

Sharath Chitturi HT Telugu
Jan 21, 2025 06:31 AM IST

VinFast electric scooters : ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలతో ఇండియాలోకి గ్రాండ్​ ఎంట్రీ ఇచ్చిన దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ విన్​ఫాస్ట్.. ఇప్పుడు ఎలక్ట్రిక్​ స్కూటర్స్​ని కూడా తీసుకొచ్చింది. ఆటో ఎక్స్​పో 2025లో వీటిని ప్రదర్శించింది. ఈ మోడల్స్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

విన్​ఫాస్ట్​ ప్రదర్శించిన ఎలక్ట్రిక్​ స్కూటర్లు..
విన్​ఫాస్ట్​ ప్రదర్శించిన ఎలక్ట్రిక్​ స్కూటర్లు..

వియత్నామీస్ వాహన తయారీ సంస్థ విన్​ఫాస్ట్ 2025 ఆటో ఎక్స్​పోలో భారత మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించింది. త్వరలో ఇండియాలో లాంచ్​ చేయనున్న అనేక మోడల్స్​ని సంస్థ ఇప్పటికే ప్రదర్శించింది. విన్​ఫాస్ట్ వీఎఫ్ 7, వీఎఫ్ 3, వీఎఫ్ 9 వంటి ఎలక్ట్రిక్ ఎస్​యూవీలను భారతీయులకు పరిచయం చేసింది. ఇక ఇప్పుడు ఈ కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిని కూడా ఎక్స్​పోలో ప్రదర్శించింది. 

ప్రస్తుతం భారతదేశంలో అత్యంత అభివృద్ధి చెందుతున్న సెగ్మెంట్లలో ఒకటి ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్, ఎలక్ట్రిక్ స్కూటర్లు. దీనిని క్యాష్​ చేసుకునేందుకు ప్రయత్నంలో భాగంగానే కొత్త మోడల్స్​ని సంస్థ తీసుకొచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను లాంచ్ చేయడం విన్​ఫాస్ట్​కు విజయాన్ని చేకూరుస్తుంది. ఈ ఎక్స్ పోలో కంపెనీ విన్​ఫాస్ట్ ఈఓ ఎస్, థియోన్ ఎస్, క్లారా ఎస్, ఫెలిజ్ ఎస్, వెంటో ఎస్, డ్రెగ్న్​ఫ్లై సహా అనేక ఈ2డబ్ల్యూలను ప్రదర్శించింది. ఈ మోడల్స్​కి చెందిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

విన్​ఫాస్ట్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు

విన్​ఫాస్ట్ ఈఓ ఎస్ ఎలక్ట్రిక్​ స్కూటర్​ రెట్రో స్టైలింగ్​తో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్. ఎక్స్ పోలో ప్రదర్శించినది ప్రకాశవంతమైన పసుపు రంగు ఆప్షన్​ని కలిగి ఉంది. ఇది 3.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​తో పనిచేస్తుంది. విన్​ఫాస్ట్ థియోన్ ఎస్​లో డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్​లైట్స్​ని అమర్చారు. ఇది 3.5 కిలోవాట్ల బ్యాటరీని ఉపయోగిస్తుంది. ముందు, వెనుక 16-ఇంచ్​ చక్రాలతో వస్తుంది.

విన్​ఫాస్ట్ క్లారా ఎస్ ఎలక్ట్రిక్​ స్కూటర్​ రెట్రో, ఆధునిక డిజైన్ అంశాలను మిళితం చేస్తుంది. ఈ మోడల్​లో 14 ఇంచ్​ ఫ్రెంట్​ వీల్​, 12 ఇంచ్​ రేర్​ వీల్​, 3.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉన్నాయి. విన్​ఫాస్ట్ ఫెలిజ్ ఎస్ కాంపాక్ట్, మినిమలిస్ట్ డిజైన్​ని కలిగి ఉంది. ఇందులో 16 ఇంచ్​ ఫ్రెంట్​ వీల్​, 14 ఇంచ్​ రేర్​ వీల్​, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. ఇది 3.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​తో వస్తుంది.

విన్​ఫాస్ట్ వెంటో ఎస్ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని సెన్సిటివ్​ కలర్ స్కీమ్​లో ప్రదర్శించారు. ఇది 3.5 కిలోవాట్ల బ్యాటరీని ఉపయోగిస్తుంది. రెండు వైపులా 12-ఇంచ్​ వీల్స్​, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కలిగి ఉంది. విన్​ఫాస్ట్ డ్రగ్న్ ఫ్లై ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ సైకిల్, ఇది సరళమైన డిజైన్, మెరుగైన టైర్లను అమర్చిన స్పోక్డ్ వీల్స్ కలిగి ఉంటుంది. 47.2వీ 13.6ఏహెచ్ బ్యాటరీ, ఫ్రంట్, రేర్ డిస్క్ బ్రేకులు ఇందులో ఉన్నాయి.

రానున్న రోజుల్లో ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్ల ధరలు, రేంజ్​, లాంచ్​లపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం