జనవరిలో జరిగిన 2025 ఆటో ఎక్స్‌పోలో తన మోడల్స్‌ని ప్రదర్శించి భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది వియత్నాం దిగ్గజం విన్‌ఫాస్ట్. ఇక ఇప్పుడు ఈ సంస్థ నుంచి రెండు ఎలక్ట్రిక్ కార్లు ఇండియాలో లాంచ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ ఏడాది చివరిలో వీఎఫ్7, వీఎఫ్6 మోడళ్లను విడుదల చేయనున్నట్టు సంస్థ వెల్లడించింది. కాగా వీటి బుకింగ్స్ ఈ నెలలోనేే ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. వియత్నాంలో డిజైన్ చేస్తున్న ఈ రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయని పేర్కొంది.
విన్‌ఫాస్ట్ భారత్‌లో తన స్టోర్‌ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. తమిళనాడులో తన ప్లాంట్‌ను ఫిక్స్ చేసే పనిలో ఉంది. వచ్చే కొద్ది వారాల్లో ఈ ప్లాంట్ అందుబాటులోకి రానుందని, ఏడాదికి 50000 యూనిట్ల ప్రారంభ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ సదుపాయం స్థానికంగా విన్‌ఫాస్ట్ వీఎఫ్7, వీఎఫ్6 లను అసెంబ్లింగ్ చేస్తుంది.
వీఎఫ్7 ఒక ప్రీమియం ఎస్యూవీ! ఇది మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీపడుతుంది. ఈ ఈవీ పెద్దది- మరింత ప్రీమియం కూడా. వీ-థీమ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, బంపర్‌పై సిల్వర్ గార్నిష్‌తో పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌లతో డిజైన్ లాంగ్వేజ్ ఇతర విన్‌ఫాస్ట్ మోడళ్లకు అనుగుణంగా ఉంటుంది. ఈ మోడల్ 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌పై ప్రయాణిస్తుంది. అదే సమయంలో 4.5 మీటర్ల పొడవు ఉంటుంది. వీఎఫ్7 కు కూపే అనుభూతిని ఇవ్వడానికి ఉద్దేశించిన రూఫ్‌లైన్ లభిస్తుంది.
వీఎఫ్7 ఈవీలో రెండు మోటారు ఆప్షన్లు ఉంటాయి. వీఎఫ్ 7 ప్లస్ సింగిల్ మోటార్ సుమారుగా 201 బీహెచ్పీ పవర్, 310 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. వీఎఫ్7 ప్లస్ ఏడబ్ల్యూడీ 343 బీహెచ్పీ పవర్, 500 ఎన్ఎమ్ టార్క్‌తో డ్యూయల్ మోటార్ సెటప్‌ను పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు రెండు వేరియంట్లలో 75.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ని అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 కిలోమీటర్ల (డబ్ల్యూఎల్టీపీ) రేంజ్ ఉంటుంది. లెథరెట్ అప్ హోల్ స్టరీ, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్ 2 ఏడీఏఎస్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
విన్‌ఫాస్ట్ వీఎఫ్6 ఎలక్ట్రిక్ కారు వీఎఫ్7 కంటే దిగువన ఉంటుంది. ఈ మోడల్ సుమారు 4.2 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవి, మహీంద్రా ఎక్స్‌యూవీ400 వంటి సెగ్మెంట్లో ఉంటుంది. చూడటానికి ఇదొక కూపే ఎస్‌యూవీలా ఉంటుంది. ఈ మోడల్ 201బీహెచ్పీ పవర్, 310ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. విన్‌ఫాస్ట్ వీఎఫ్6 ఈకో వేరియంట్ 172బీహెచ్పీ పవర్, 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు వేరియంట్లు 59.6 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ను ఒకేసారి ఛార్జ్ చేస్తే వరుసగా 399 కిలోమీటర్లు (ఎకో), 381 కిలోమీటర్లు (ప్లస్) రేంజ్ లభిస్తాయి.
వీఎఫ్7, వీఎఫ్6 రెండింటిలోనూ పనోరమిక్ సన్ రూఫ్, లెవల్ 2 ఏడీఏఎస్, స్వదేశీ యుఐ / యుఎక్స్ తో కూడిన 12.6-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్తో సమానమైన ఇంటీరియర్ లభిస్తుంది. ఈ మోడల్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్‌లో పొందుపరిచిన చాలా కంట్రోలర్స్‌తో మినిమలిస్ట్ ఇంటీరియర్‌ని కూడా పొందుతుంది, హెడ్-అప్ డిస్ప్లే (హెచ్యూడీ) రెండు మోడళ్లలో సంప్రదాయ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌ని భర్తీ చేస్తుంది.
వీఎఫ్7, వీఎఫ్6 ఈవీలు రెండూ ఈ ఏడాది చివరిలో రానున్నాయి. కంపెనీ తన డీలర్ నెట్వర్క్ని స్థాపించే పనిలో ఉంది. ఇది రాబోయే నెలల్లో చురుకుగా ఉంటుంది. విన్‌ఫాస్ట్ కూడా పండుగ సీజన్ కోసం మోడళ్లను తీసుకురావడానికి కృషి చేస్తోంది.
తయారీ కేంద్రంతో పాటు డీలర్ నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి విన్‌ఫాస్ట్ భారతదేశంలో సుమారు 2 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. భారత్‌లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కంపెనీ ఆశావహంగా ఉంది. మార్కెట్లోకి వచ్చే తదుపరి ఉత్పత్తులపై ఇప్పటికే కసరత్తు చేస్తోంది.
సంబంధిత కథనం