భారత ఈవీ మార్కెట్‌పై కన్నేసిన వియత్నాం కంపెనీ.. VF 7, VF 9 ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చేందుకు రెడీ!-vietnam base automobile company focus on indian ev market vinfast vf 7 and vf 9 electric suvs debut at auto expo 2025 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  భారత ఈవీ మార్కెట్‌పై కన్నేసిన వియత్నాం కంపెనీ.. Vf 7, Vf 9 ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చేందుకు రెడీ!

భారత ఈవీ మార్కెట్‌పై కన్నేసిన వియత్నాం కంపెనీ.. VF 7, VF 9 ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చేందుకు రెడీ!

Anand Sai HT Telugu
Jan 13, 2025 03:00 PM IST

Electric Cars : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పెరుగుతుంది. దీంతో విదేశీ కంపెనీలు సైతం ఇక్కడ ఫోకస్ చేస్తున్నాయి. వియత్నంకు చెందిన విన్‌ఫాస్ట్ VF 7, VF 9 ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది.

వీఎఫ్ 9 ఎలక్ట్రిక్ కారు
వీఎఫ్ 9 ఎలక్ట్రిక్ కారు

కొత్త ఎలక్ట్రిక్ కార్లు భారత మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అన్ని ప్రధాన ఈవీ బ్రాండ్‌లు భారతదేశంలోకి ప్రవేశించబోతున్నాయి. ఇప్పటికే టాటా, ఎంజీ లాంటి కంపెనీలు ఈ సెగ్మెంట్‌లో దూసుకెళ్తున్నాయి. అయితే ఈ మార్కెట్‌పై వియత్నాంకు చెందిన కంపెనీ కూడా ఫోకస్ చేస్తోంది. తక్కువ ధరకు గొప్ప ఈవీలను అందించాలనుకుంటోంది. ఇందులో భాగంగా కంపెనీ తన రాబోయే మోడళ్లను 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది.

విన్‌ఫాస్ట్ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించే రెండు మోడళ్ల టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఆటో ఫెయిర్‌లో VF 7, VF 9 అనే రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు వియత్నామీస్ కంపెనీలో భాగంగా ఉంటాయని సూచిస్తుంది.

వీఎఫ్ 7 ఫీచర్లు

VF 7 విషయానికొస్తే.. హ్యుందాయ్ టక్సన్ పరిమాణంలో 5 సీట్ల ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా ఉంటుంది. ఈ ఈవీ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారు ఆకారం, స్పోర్టింగ్ లైట్ యూనిట్‌లు కచ్చితంగా అందరి దృష్టిని ఆకర్శించగలవు. విదేశీ మార్కెట్లలో ఈ వాహనం ఎకో, ప్లస్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీఎఫ్ 7 ఈవీ 75.3kWh(నెట్) బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎకో వెర్షన్ 204బీహెచ్‌పీ శక్తిని, 310ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల ఫ్రంట్ మోటార్‌ను కలిగి ఉంటుంది. దీని ప్లస్ వేరియంట్ కోసం 354బీహెచ్‌పీ శక్తిని, 500ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగల డ్యూయల్ మోటార్ సెటప్‌ను కూడా సిద్ధం చేసింది.

విన్‌ఫాస్ట్ వీఎఫ్ 7 ఎకో 450 కిలో మీటర్లు, ప్లస్ 431 కిలో మీటర్ల రేంజ్ కలిగి ఉంటుందని తయారీదారులు పేర్కొన్నారు. రెండు వేరియంట్ల మధ్య ఇతర తేడాలు అల్లాయ్ వీల్స్ పరిమాణంలో ఉంటాయి. ఎకో మోడల్‌కు 19-అంగుళాల చక్రాలు, ప్లస్‌కు 20 లేదా 21 అంగుళాల చక్రాలు లభిస్తాయి.

వీఎఫ్ 9 ఫీచర్లు

విన్‌ఫాస్ట్ లైనప్‌లో వీఎఫ్ 9 అతిపెద్ద ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఫ్యామిలీ సంతోషంగా ప్రయాణించవచ్చు. ఇది 6, 7 సీట్ల ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంటుంది. వీఎఫ్ 9 ఈవీ ఎకో, ప్లస్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. రెండూ ఒకే 123kWh బ్యాటరీ ప్యాక్‌ని పొందుతాయి. మోడ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 531 కి.మీల రేంజ్ అందిస్తుంది. వీఎఫ్ 9 ఈవీ 408బీహెచ్‌పీ శక్తిని, 620ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే డ్యూయల్ మోటార్ ఏడబ్ల్యూడీ సెటప్‌తో అమర్చబడి ఉంది. వీఎఫ్ 9 ఎకో కేవలం 6.6 సెకన్లలో 0-100 కేఎంపీహెచ్ స్పీడ్ అందుకుంటుంది. ప్లస్ 0-100 కి.మీలకు 6.7 సెకన్లు పడుతుంది.

రూఫ్ రెయిల్‌లు, పెద్ద 21-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఆటో-డిమ్మింగ్ అవుట్‌సైడ్ రియర్‌వ్యూ మిర్రర్స్‌తోపాటు మరిన్ని ఫీచర్లు ఉంటాయి. 8-అంగుళాల వెనుక ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, సబ్ వూఫర్‌తో 13 స్పీకర్లు ఉన్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్‌ సూపర్‌గా ఉండనుంది.

Whats_app_banner