Vespa 2025 : వావ్.. వెస్పా కొత్త స్కూటర్లు లాంచ్.. డిజైన్, ఫీచర్స్ చూస్తే పడిపోతారు!-vespa 2025 scooter lineup launch price starting at 1 32 lakh rupees tft screen special editions ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vespa 2025 : వావ్.. వెస్పా కొత్త స్కూటర్లు లాంచ్.. డిజైన్, ఫీచర్స్ చూస్తే పడిపోతారు!

Vespa 2025 : వావ్.. వెస్పా కొత్త స్కూటర్లు లాంచ్.. డిజైన్, ఫీచర్స్ చూస్తే పడిపోతారు!

Anand Sai HT Telugu
Updated Feb 11, 2025 11:37 AM IST

Vespa 2025 LineUp : వెస్పా 2025 మోడల్ లైన్‌అప్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. కొత్త తరం కస్టమర్లను ఆకర్షించేలా రీడిజైన్‌తో వచ్చింది.

వెస్పా 2025 లాంచ్
వెస్పా 2025 లాంచ్

వెస్పా తన 2025 మోడల్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. 2025 వెస్పా లైన్‌అప్‌లో కొత్త టెక్నాలజీ కూడా ఉంది. కొనుగోలుదారులను మరింత ఆకర్షించేందుకు ప్రత్యేక ఎడిషన్లను కూడా కంపెనీ అందిస్తోంది. 2025 వెస్పా లైన్‌అప్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 1.32 లక్షలు. టాప్ వేరియంట్ ధర రూ.1.96 లక్షల వరకు ఉంటుంది. కంపెనీ ఇందులో స్మూత్ యాక్సిలరేషన్, హై గ్రేడబిలిటీ కోసం కొత్త ఇంజిన్‌ను అందించింది.

వెస్పా వేరియంట్లు

వెస్పా 125 2025 వేరియంట్ లైనప్‌లో ఇప్పుడు వెస్పా, వెస్పా ఎస్, వెస్పా టెక్, వెస్పా ఎస్ టెక్ ఉన్నాయి. బేస్ వెర్షన్ అదే డిజైన్‌తో కొనసాగుతుంది. వెస్పా, వెస్పా ఎస్ లను 125cc, 150cc ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంచారు.

కలర్ ఆప్షన్స్

వెస్పాలో వెర్డే అమాబిల్, రోస్సో రెడ్, పెర్ల్ వైట్, నీరో బ్లాక్, అజురో ప్రోవెన్జా, బ్లూ, పెర్ల్ వైట్, ఆరెంజ్, పెర్ల్ వైట్ వంటి రంగులు అందుబాటులో ఉన్నాయి. వెస్పా ఎస్‌తో గోల్డ్ టింట్‌తో కూడిన కొత్త ఒరో స్పెషల్ ఎడిషన్ కూడా అందుబాటులో ఉంటుంది. వెస్పా ఎస్‌ పాలెట్‌లో రంగుల విషయానికొస్తే.. వెర్డే ఎంబిజియోసో (మాట్), ఒరో, పెర్ల్ వైట్, నీరో బ్లాక్ (మాట్), జియాలో యెల్లో (మాట్), అరెన్సియో ఇంపల్సివో, రెడ్, పెర్ల్ వైట్, బ్లాక్, పెర్ల్ వైట్ ఉన్నాయి.

వెస్పా టెక్

కంపెనీ వెస్పా టెక్, వెస్పా ఎస్‌ టెక్‌లతో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.92 లక్షలు. వెస్పా టెక్, వెస్పా ఎస్ టెక్ వేరియంట్లకు 125cc, 150cc ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్లలో ఆధునిక టెక్నాలజీని చేర్చారు. దీని ఫీచర్ల గురించి మాట్లాడితే ఇందులో కీలెస్ ఇగ్నిషన్, కొత్త టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. 

ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. వెస్పా టెక్‌.. వెస్పా క్వాలా అనే కొత్త ప్రత్యేక ఎడిషన్ కూడా అందుబాటులో తీసుకొచ్చింది. ఇందులో ట్రెడిషనల్ మెహందీ ఆర్ట్‌ను డిజైన్‌లో చేర్చారు. వెస్పా టెక్ కోసం ఎనర్జికో బ్లూ, గ్రిగియో గ్రే కలర్ ఆప్షన్స్ అందిస్తారు. వెస్పా ఎస్ టెక్ కోసం నీరో బ్లాక్(మాట్), పెర్ల్ వైట్ కలర్స్ ఉన్నాయి. 

ఫిబ్రవరి 25 నుంచి

2025 వెస్పా లైన్‌అప్ ఫిబ్రవరి 25 నుండి కంపెనీ అన్ని డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది. భారతదేశంలో వెస్పా లగ్జరీ-లైఫ్‌స్టైల్ బ్రాండ్‌గా అభివృద్ధి చేస్తోంది.

Whats_app_banner