మైనింగ్ రంగ దిగ్గజం వేదాంత షేర్లు మంచి లాభాలను ఆర్జిస్తున్నాయి. రూ.3.46 నుంచి రూ.465.50కి ఈ షేరు ధర చేరింది. ఈ స్టాక్ గత 25 సంవత్సరాలలో 13366 శాతం పైగా రాబడిని ఇచ్చింది. అంటే ఈ స్టాక్ ఈ కాలంలో లక్ష రూపాయల పెట్టుబడిని కోటి 34 లక్షలకు పైగా పెంచింది. వేదాంత షేర్లు నేడు వార్తల్లో నిలుస్తు్న్నాయి. జూన్ త్రైమాసికంలో అల్యూమినియం, జింక్, ఇనుప ఖనిజం, ఉక్కు ఉత్పత్తిలో వృద్ధిని కంపెనీ ప్రకటించింది.
ఈ ఏడాది ఇప్పటివరకు 80 శాతానికి పైగా రాబడులను ఇచ్చాయి. గత ఏడాది కాలంలో 67 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. అయితే గత ఆరు నెలల్లో 75 శాతం పెరిగాయి. 52 వారాల గరిష్టం రూ.506.75, కనిష్టంగా రూ.208గా ఉంది.
అల్యూమినియం ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే మొదటి త్రైమాసికంలో 3 శాతం పెరిగి 5,96,000 టన్నులకు చేరుకుంది. దీంతో ఈ కంపెనీ షేర్లు లాభాల బాట పడుతున్నాయి. గురువారం ఎన్ఎస్ఈలో వేదాంత షేరు రూ.468.10 వద్ద ప్రారంభమై రూ.470.80 వద్ద ఒక రోజు గరిష్టాన్ని తాకింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1.69 లక్షల కోట్లుగా ఉంది.
జింక్ ఇండియా అమ్మకపు లోహ ఉత్పత్తి 260,000 టన్నుల నుండి 262,000 టన్నులకు పెరిగింది. జింక్ ఇంటర్నేషనల్ లో మైనింగ్ మెటల్ ఉత్పత్తి 38,000 టన్నులకు పడిపోయింది. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇది 68,000 టన్నులకు పైగా ఉంది. అయితే ఈ త్రైమాసికంలో చమురు, గ్యాస్ ఉత్పత్తి 17 శాతం క్షీణించి 1,34,900 నుంచి 1,12,400కు పడిపోయింది.
విక్రయించదగిన ఇనుప ఖనిజం ఉత్పత్తి 1.2 మిలియన్ టన్నుల నుంచి 1.3 మిలియన్ టన్నులకు పెరిగింది. మొత్తం సీయబుల్ స్టీల్ ఉత్పత్తి 10 శాతం పెరిగి 3,56,000 టన్నులకు, విద్యుత్ అమ్మకాలు 13 శాతం పెరిగి 4,256 మిలియన్ యూనిట్ల నుంచి 4,791 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. ఇవన్నీ ఈ షేర్ల మీద ప్రభావం చూపిస్తున్నాయి.
వేదాంత లిమిటెడ్ భారతదేశం, దక్షిణాఫ్రికా, నమీబియా, లైబీరియా, యుఎఇ, కొరియా, తైవాన్, జపాన్ లలో విస్తరించి ఉన్న కంపెనీ. ప్రపంచంలోని ప్రముఖ సహజ వనరుల కంపెనీలలో ఒకటైన వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. ఇది ఆయిల్ అండ్ గ్యాస్, జింక్, సీసం, వెండి, రాగి, ఇనుప ఖనిజం, ఉక్కు, నికెల్, అల్యూమినియం, విద్యుత్ రంగాలలో ఉంది.
గమనిక : గతంలో ఈ స్టాక్ పెరిగిన అంశాన్ని ఆధారంగా చేసుకుని కథనం ఇచ్చాం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు సంబంధిత నిపుణుల సలహాను కచ్చితంగా తీసుకోవాలి. కేవలం సమాచారం ఇవ్వడం మాత్రమే మా బాధ్యత.