Vedanta Q3 results: 42 శాతం తగ్గిన వేదాంత లాభాలు; అయినా భారీగా డివిడెండ్
Vedanta Q3 results: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం లో వేదాంత లిమిటెడ్ (Vedanta Limited) సంస్థ లాభాలు భారీగా తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం Q3 తో పోలిస్తే, వేదాంత సంస్థ (Vedanta Limited) నికర లాభాలు 42% తగ్గాయి.
Vedanta Q3 results: వేదాంత లిమిటెడ్ (Vedanta Limited) శుక్రవారం ఈ ఆర్థిక సంవత్సరం Q3 ఫలితాలను ప్రకటించింది. సంస్థ నికర లాభాల్లో ఈ Q3 లో భారీ కోత ఏర్పడింది. డిసెంబర్ తో ముగిసే Q3 లో వేదాంత లిమిటెడ్ (Vedanta Limited) రూ. 3,092 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం Q3 లో సంస్థ ఆర్జించిన నికర లాభాలు రూ. 5,354 కోట్లు.
Vedanta Q3 results: ఆదాయం తగ్గింది
వేదాంత లిమిటెడ్ (Vedanta Limited) స్థూల ఆదాయం ఈ Q3 లో రూ. 33,690 కోట్లు, కాగా ఇది గత Q3 లో సంస్థ సాధించిన ఆదాయం రూ. 33,697 కోట్ల కన్నా 0.017 % తక్కువ. అయితే, ఈ Q2 కన్నా వేదాంత లిమిటెడ్ (Vedanta Limited) నికర లాభాలు 15% పెరిగాయి. Q2 లో వేదాంత రూ. 2690 కోట్ల లాభాలు సాధించగా, ఈ Q3 లో సంస్థ నికర లాభాలు రూ. 3,092 కోట్లు.
Vedanta interim dividend: భారీ డివిడెండ్
మరోవైపు, వేదాంత లిమిటెడ్ (Vedanta Limited) తన షేర్ హోల్డర్లకు ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగో మధ్యంతర డివిడెండ్ (Vedanta Limited INTERIM DIVIDEND) ను ప్రకటించింది.రూ. 1 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 12.50 డివిడెండ్ ఇవ్వనున్నట్లు, ఇందుకు రికార్డు తేదీ ఫిబ్రవరి 4 అని వెల్లడించింది. అంటే, ఒక్కో షేరుకు సంస్థ ఇస్తున్న ఈ మధ్యంతర డివిడెండ్ (Vedanta Limited Interim Dividend) 1250%. డివిడెండ్ల రూపేణా షేర్ హోల్డర్లకు రూ. 4,647 కోట్లు చెల్లించనున్నట్లు వేదాంత వెల్లడించింది.
Vedanta Q3 results: హిందూస్తాన్ జింక్ తో ఒప్పందం
విస్తరణ ప్రాజెక్టుల కోసం పెద్ధ ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు వేదాంత లిమిటెడ్ (Vedanta Limited) వెల్లడించింది. కొత్తగా 941 మెగా వాట్ల సామర్ధ్యం ఉన్న పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు వెల్లడించింది. అలాగే, హిందూస్తాన్ జింక్ లిమిటెడ్ తో (Hindustan Zinc Limited HZL) కుదిరిన వ్యూహాత్మక ఒప్పందం కూడా విజయవంతమైందని Vedanta Limited సీఈఓ సునీల్ దుగ్గల్ తెలిపారు. ఈ ఒప్పదం కింద వేదాంత తన వేదాంత జింక్ ఇంటర్నేషనల్ (VZI) ను హిందూస్తాన్ జింక్ లిమిటెడ్’ (Hindustan Zinc Limited HZL) కు 2,981 మిలియన్ డాలర్లకు అమ్మివేయనున్నారు. మార్కెట్ ఒడిదుడుకల కారణంగా శుక్రవారం వేదాంత షేర్ వాల్యూ 1.96% తగ్గి రూ. 319.85 కి చేరింది.