అతి తక్కువ ధరకే 2 సీటర్ సోలార్ ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కి.మీ రేంజ్-vayve eva 2 seater solar electric car at the lowest price 250 km range on a single charge ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  అతి తక్కువ ధరకే 2 సీటర్ సోలార్ ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కి.మీ రేంజ్

అతి తక్కువ ధరకే 2 సీటర్ సోలార్ ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కి.మీ రేంజ్

Anand Sai HT Telugu

రోజురోజుకు కొత్త కొత్త కార్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్లకు బదులుగా జనాలు ఈవీలపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో సోలార్ ఎలక్ట్రిక్ కార్లు కూడా ఎంట్రీ ఇస్తున్నాయి.

సోలార్ ఎలక్ట్రిక్ కారు

సోలార్ ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు వైవ్ మొబిలిటీ ఈ ఏడాది జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ఎవా కాంపాక్ట్ సోలార్ ఎలక్ట్రిక్ 2 సీటర్ కారును విడుదల చేసింది. ట్రాఫిక్ రద్దీ, పరిమిత పార్కింగ్ స్థలం, పెరుగుతున్న ఇంధన ఖర్చులు వంటి నగర జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ కారును రూపొందించామని చెప్పింది. దీని ధర, ఇతర వివరాలు చూద్దాం..

ధర

ఈ 2-సీటర్ కారును రూ. 3.25 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేశారు. ఈ కారు పూర్తిగా విద్యుత్ శక్తితో నడుస్తుంది. ఛార్జ్ అయిపోయినప్పుడు సౌరశక్తిని ఉపయోగించుకునేలా రూపొందించారు. అదనపు సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం వలన ఇది సాధ్యమవుతుంది.

రేంజ్

భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు అయిన వేవ్ ఎలక్ట్రిక్ ఎవా మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఎవా నోవా, ఎవా స్టెల్లా, ఎవా వేగా. సింగిల్‌ ఛార్జ్‌కి 250 కి.మీ. రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. దీని హై-వోల్టేజ్ పవర్‌ట్రెయిన్ టెక్నాలజీ సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో 50 కి.మీ రేంజ్ అందిస్తుందని కంపెనీ హామీ ఇచ్చింది. Eva స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్, వెహికల్ డయాగ్నస్టిక్స్, రిమోట్ మానిటరింగ్, ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌లు వంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో అమర్చబడి ఉంది. మూడు వేరియంట్లలో వరుసగా 9 కిలోవాట్, 12.6 కిలోవాట్, 18 కిలోవాట్ బ్యాటరీలు ఉన్నాయి.

ఫీచర్లు

ఇందులో ఎకో, సిటీ, స్పోర్ట్ అనే మూడు డ్రైవ్ మోడ్‌లు, పనోరమిక్ గ్లాస్ రూఫ్, క్లైమేట్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన 2-స్పీకర్ ఆడియో సిస్టమ్, స్టార్ట్-స్టాప్ బటన్, 13-అంగుళాల స్టీల్ వీల్స్, ఎల్ఈడీ హెడ్‌లైట్లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్, కెమెరా, ఆటో-డిమ్మింగ్ IRVM ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన 4-స్పీకర్ ఆడియో సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇవన్నీ వేరియంట్‌ను బట్టి అదనపు ఫీచర్లను కలిగి ఉంటాయి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.