Smartphones Offer : వాలెంటైన్స్ డే సేల్ ఆఫర్లు.. తక్కువ ధరలో 200ఎంపీ, 108ఎంపీ కెమెరాలతో వచ్చే ఫోన్లు!-valentines day sale offers best deals on 200mp and 108mp camera smartphones check out details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Smartphones Offer : వాలెంటైన్స్ డే సేల్ ఆఫర్లు.. తక్కువ ధరలో 200ఎంపీ, 108ఎంపీ కెమెరాలతో వచ్చే ఫోన్లు!

Smartphones Offer : వాలెంటైన్స్ డే సేల్ ఆఫర్లు.. తక్కువ ధరలో 200ఎంపీ, 108ఎంపీ కెమెరాలతో వచ్చే ఫోన్లు!

Anand Sai HT Telugu Published Feb 12, 2025 08:45 AM IST
Anand Sai HT Telugu
Published Feb 12, 2025 08:45 AM IST

Valentines Day Smartphones Offer : ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ సేల్‌లో 200ఎంపీ, 108ఎంపీ కెమెరాలతో కూడిన రెండు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు ఆఫర్లలో లభిస్తున్నాయి. బ్యాంక్ డిస్కౌంట్లు, కాష్‌బ్యాక్ ఆఫర్లతో మీరు ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మీరు మంచి కెమెరా ఫోన్ కోసం వెతుకుతున్నారా? అయితే ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే సేల్‌ను మిస్ అవ్వకండి. ఈ సేల్‌లో 200 మెగాపిక్సెల్, 108 మెగాపిక్సెల్ కెమెరాలతో కూడిన రెండు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. బ్యాంక్ డిస్కౌంట్లు, కాష్‌బ్యాక్ ఆఫర్లతో మీరు ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా మీరు వీటి ధరను మరింత తగ్గించుకోవచ్చు. ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో లభించే డిస్కౌంట్ మీ పాత ఫోన్ స్థితి, బ్రాండ్, కంపెనీ ఎక్స్‌చేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. అంతేకాదు.. మీరు ఈ ఫోన్లను ఈఎంఐ పద్ధతిలో కూడా తీసుకోవచ్చు. ఈ రెండు ఫోన్లపై ఉన్న డీల్స్ చూద్దాం..

రియల్‌మీ నోట్ 13 ప్రో 5జీ

8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చే ఈ ఫోన్ వేరియంట్ ధర రూ.21,999. వాలెంటైన్స్ డే సేల్‌లో మీరు దీన్ని రూ.750 బ్యాంక్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డులతో చెల్లింపు చేసే వినియోగదారులకు 5 శాతం కాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఫోన్ నో కాస్ట్ ఈఎంపై కూడా పొందవచ్చు.

ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే, 6.67 అంగుళాల అద్భుతమైన డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం 200 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్ బ్యాటరీ 5100mAhగా వస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ

ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.15,999. ఈ సేల్‌లో మీరు ఫోన్‌ను రూ.1200 వరకు బ్యాంక్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డులతో చెల్లింపు చేసే వినియోగదారులకు 5 శాతం కాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఫోన్ రూ.563 ప్రారంభ ఈఎంఐపై కూడా మీరు సొంతం చేసుకోవచ్చు.

ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ ఫోన్‌పై రూ.10,900 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ అందుబాటులో ఉంది. ఫీచర్ల విషయానికి వస్తే, ఇన్ఫినిక్స్ ఫోన్‌లో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఫోన్ వెనుక భాగంలో 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ప్రాసెసర్‌గా డైమెన్సిటీ 7020 చిప్‌సెట్ వస్తుంది.

గమనిక : ఈ ఆఫర్ వాలెంటైన్ సేల్‌లో భాగంగా మాత్రమే. తర్వాత ఈ ధరలు తగ్గవచ్చు, పెరగవచ్చు.

Anand Sai

eMail
Whats_app_banner