రైలు ప్రయాణికులకు అలర్ట్​! ఈ క్రెడిట్​ కార్డులతో సూపర్​ రివార్డులు- భారీ మొత్తంలో డబ్బులు ఆదా-useful irctc credit cards which give you the best travel perks ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  రైలు ప్రయాణికులకు అలర్ట్​! ఈ క్రెడిట్​ కార్డులతో సూపర్​ రివార్డులు- భారీ మొత్తంలో డబ్బులు ఆదా

రైలు ప్రయాణికులకు అలర్ట్​! ఈ క్రెడిట్​ కార్డులతో సూపర్​ రివార్డులు- భారీ మొత్తంలో డబ్బులు ఆదా

Sharath Chitturi HT Telugu

వివిధ బ్యాంకులు అందించే ఐఆర్​సీటీసీ క్రెడిట్​ కార్డుల గురించి మీకు తెలుసా? రైలు టికెట్​ బుకింగ్​కి వీటిని వినియోగిస్తే అనేక విధాలుగా ప్రయోజనాలు ఉన్నాయి. రివార్డ్​ పాయింట్లతో పాటు డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు. పూర్తి వివరాలు..

ఈ ఐఆర్​సీటీసీ క్రెడిట్​ కార్డులు బెస్ట్​!

మీరు రైళ్లలో తరచుగా ప్రయాణిస్తారా? వివిధ బ్యాంకుల సహకారంతో ఐఆర్​సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) అందించే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి! టికెట్ల బుకింగ్​ కోసం మీరు కార్డులు వాడితే రివార్డ్​ పాయింట్స్​తో పాటు అనేక విధాలుగా డబ్బులు ఆదా అవుతాయి. ఐఆర్​సీటీసీ లాయల్టీ స్కీమ్​ ద్వారా మీరు ఆయా క్రెడిట్​ కార్డులో ఐఆర్​సీటీసీ ఈ-పోర్ట్​లో టికెట్​లు బుక్​ చేసుకున్నప్పుడు మీకు విలువైన ట్రావెల్​ పాయింట్స్​ లభిస్తాయి. ఈ పాయింట్స్​ని రైలు టికెట్లను బుక్​ చేసుకునే సమయంలో రిడీమ్​ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ క్రెడిట్​ కార్డుల ఫీచర్లను, బెనిఫిట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

ఐఆర్​సీటీసీ హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్..

  1. జాయినింగ్/రెన్యువల్ ఫీజు రూ. 500
  2. కార్డు జారీ చేసిన మొదటి 37 రోజుల్లో కార్డు యాక్టివేషన్​పై రూ. 500 విలువైన గిఫ్ట్ వోచర్ లభిస్తుంది.
  3. ఐఆర్​సీటీసీ టికెటింగ్ వెబ్సైట్, రైల్ కనెక్ట్ యాప్​లో టికెట్లపై ఖర్చు చేసే ప్రతి రూ.100కు ఐదు రివార్డు పాయింట్లు లభిస్తాయి.
  4. ఇతర కేటగిరీలపై ఖర్చు చేసే ప్రతి రూ. 100పై ఒక రివార్డు పాయింట్ పొందొచ్చు.
  5. ఐఆర్​సీటీసీ టికెటింగ్ వెబ్సైట్, రైల్ కనెక్ట్ యాప్​లో ఐఆర్​సీటీసీ రైలు టికెట్ బుకింగ్స్​పై 1% ట్రాన్సాక్షన్ ఛార్జీ మినహాయింపు పొందొచ్చు.
  6. 'ఐఆర్​సీటీసీ ఎగ్జిక్యూటివ్ లాంజ్'లను ఎంపిక చేసుకోవడానికి ఏడాదికి ఎనిమిది సార్లు కాంప్లిమెంటరీ యాక్సెస్ (త్రైమాసికానికి రెండు) లభిస్తుంది.
  7. ఐఆర్​సీటీసీ టికెటింగ్ వెబ్సైట్, రైల్ కనెక్ట్ యాప్​లో జరిపే లావాదేవీలకు రూ.1తో సమానంగా రివార్డు పాయింట్ లభిస్తుంది.
  8. త్రైమాసికంలో రూ.30000 ఖర్చులపై రూ. 500 మైల్ స్టోన్ గిఫ్ట్ వోచర్ తీసుకొవచ్చు.

ఐఆర్​సీటీసీ ఆర్బీఎల్​ కార్డ్..

  • జాయినింగ్/రెన్యువల్ ఫీజు రూ. 500
  • 500 రివార్డ్ పాయింట్ల వెల్కమ్​ బెనిఫిట్​.
  • ఐఆర్​సీటీసీ వెబ్సైట్, అన్ని తరగతులకు 'రైల్ కనెక్ట్' యాప్​లో ఖర్చు చేసిన ప్రతి రూ.200పై ఐదు రివార్డులు పొందొచ్చు.
  • www.air.irctc.co.in, www.irctctourism.com లో ఖర్చు చేసిన రూ. 200 పై రెండు రివార్డు పాయింట్లు.
  • ఫ్లైట్ / హోటల్ / క్రూయిజ్ టికెట్ బుకింగ్​పై టికెట్ బుకింగ్​పై 1% ట్రాన్సాక్షన్ చార్జీ మినహాయింపు ఉంటుంది.
  • ప్రతి సంవత్సరం ఎనిమిది సార్లు.. ఎంపిక చేసిన ఐఆర్​సీటీసీ లాంజ్​లకు కాంప్లిమెంటరీ యాక్సెస్ (త్రైమాసికానికి రెండు) లభిస్తుంది.
  • రూ.5000 వరకు 'ట్రైన్ క్యాన్సిలేషన్ ప్రొటెక్ట్' ఫీచర్ కూడా ఉంది.
  • ప్రయాణ తేదీ- షెడ్యూల్ చేసిన రైలు సమయం నుంచి 24 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయంలో భారతీయ రైల్వే రద్దు చేసిన రైళ్లకు మాత్రమే రూ .5000 వరకు ట్రైన్​ కాన్సిలేషన్​ కాంప్లిమెంటరీ ప్రొటెక్షన్ కవరేజ్ వర్తిస్తుంది. ఆర్బీఎల్​ బ్యాంక్ తన స్వంత విచక్షణ మేరకు అవసరమైన విధంగా నియమనిబంధనలను సవరించవచ్చు.
  • ఐఆర్​సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ నుంచి విమానాలు, హోటళ్లు, క్రూయిజ్లను బుక్ చేసుకుంటే రూ.200కు రెండు రివార్డు పాయింట్లు లభిస్తాయి.
  • ఫాస్టాగ్ రీఛార్జ్/ఎన్సీఎంసీ రీలోడ్/యూటీఎస్ యాప్పై ఖర్చు చేసిన రూ.200పై మూడు రివార్డు పాయింట్లు పొందొచ్చు.
  • ఇతర కేటగిరీలపై ఖర్చు చేసే ప్రతి రూ. 200పై ఒక రివార్డు పాయింట్ లభిస్తుంది.
  • మెట్రోలు, బస్ స్టేషన్లలో ప్రయాణాలకు 'ట్యాప్ అండ్ ట్రాన్సిట్' ఫీచర్​ వర్తిస్తుంది.

ఐఆర్​సీటీసీ బీఓబీ కార్డ్..

  1. జాయినింగ్/రెన్యువల్ ఫీజు రూ. 500/ రూ. 300
  2. 500 బోనస్ రివార్డు పాయింట్ల వెల్ కమ్ బెనిఫిట్ ఉంటుంది.
  3. ఐఆర్​సీటీసీ టికెట్లపై ఖర్చు చేసే ప్రతి రూ.100కు 40 బ్యాంక్​ ఆఫ్​ బరోడా కార్డులో రివార్డు పాయింట్లు ఉంటాయి.
  4. ఐఆర్​సీటీసీ రైలు టికెట్ బుకింగ్​పై 1% ట్రాన్సాక్షన్ చార్జీ మినహాయింపు ఉంటుంది.
  5. ఎంపిక చేసిన రైల్వే లాంజ్​లకు ప్రతి సంవత్సరం నాలుగు సార్లు కాంప్లిమెంటరీ యాక్సెస్ (త్రైమాసికానికి ఒకటి) పొందొచ్చు.
  6. ఇతర కేటగిరీలపై ఖర్చు చేసే ప్రతి రూ. 100పై నాలుగు రివార్డు పాయింట్లు ఉంటాయి.

ఐఆర్​సీటీసీ ఎస్బీఐ కార్డ్ ప్రీమియర్

  • జాయినింగ్/రెన్యువల్ ఫీజు రూ. 1499గా ఉంది.
  • 1500 బోనస్ రివార్డ్ పాయింట్ల వెల్ కమ్ బెనిఫిట్ ఉంటుంది.
  • ఐఆర్​సీటీసీ టికెట్లపై ఖర్చు చేసే రూ.100కు పది రివార్డు పాయింట్లు లభిస్తాయి.
  • విమాన టిక్కెట్లు, ఈ-క్యాటరింగ్ కోసం ఖర్చు చేసే రూ. 100కు ఐదు రివార్డు పాయింట్లు ఉంటాయి.
  • రైలు, విమాన బుకింగ్​లపై 1 శాతం ట్రాన్సాక్షన్ చార్జీ మినహాయింపు ఉంటుంది.
  • ఎంపిక చేసిన రైల్వే లాంజ్​లకు ప్రతి సంవత్సరం ఎనిమిది సార్లు కాంప్లిమెంటరీ యాక్సెస్ (త్రైమాసికానికి రెండు) పొందొచ్చు.
  • భోజనం చేయడానికి ఖర్చు చేసిన రూ. 125 కు మూడు రివార్డు పాయింట్లు పొందొచ్చు.
  • రూ.125 రెగ్యులర్ ఖర్చులపై ఒక రివార్డు పాయింట్ వస్తుంది.

ఐఆర్​సీటీసీ ఎస్బీఐ కార్డ్​ (రూపే ప్లాట్ ఫామ్​పై)

  1. జాయినింగ్/రెన్యువల్ ఫీజు రూ. 500/రూ. 300
  2. క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్​పై 350 బోనస్ రివార్డ్ పాయింట్ల వెల్ కమ్ బెనిఫిట్ ఉంటుంది.
  3. ఐఆర్​సీటీసీ టికెట్లపై ఖర్చు చేసే రూ.100కు పది రివార్డు పాయింట్లు పొందొచ్చు.
  4. ఐఆర్​సీటీసీ రైలు టికెట్ బుకింగ్​పై 1% ట్రాన్సాక్షన్ చార్జీ మినహాయింపు ఉంటుంది.
  5. రూ.125 రెగ్యులర్ ఖర్చులపై ఒక రివార్డు పాయింట్ లభిస్తుంది.
  6. ఎంపిక చేసిన రైల్వే లాంజ్​లకు ప్రతి సంవత్సరం నాలుగు సార్లు కాంప్లిమెంటరీ యాక్సెస్ (త్రైమాసికానికి ఒకటి) పొందొచ్చు.

ఐఆర్​సీటీసీ ఎస్బీఐ కార్డ్

  • జాయినింగ్/రెన్యువల్ ఫీజు రూ. 500/ రూ. 300
  • కార్డ్ యాక్టివేషన్​పై 350 బోనస్ రివార్డ్ పాయింట్లతో వెల్ కమ్ బెనిఫిట్ ఉంటుంది.
  • ఐఆర్​సీటీసీ టికెట్లపై ఖర్చు చేసే ప్రతి రూ.100కు పది రివార్డు పాయింట్లు వస్తాయి.
  • ఐఆర్​సీటీసీ రైలు టికెట్ బుకింగ్​పై 1% ట్రాన్సాక్షన్ చార్జీ మినహాయింపు ఉంటుంది.
  • ఎంపిక చేసిన రైల్వే లాంజ్​లకు ప్రతి సంవత్సరం నాలుగు సార్లు కాంప్లిమెంటరీ యాక్సెస్ (త్రైమాసికానికి ఒకటి) పొందొచ్చు.
  • రూ.125 రెగ్యులర్ ఖర్చులపై ఒక రివార్డు పాయింట్ ఉంటుంది.

మరిన్ని వివరాల కోసం ఆయా బ్యాంకుల అధికారిక వెబ్​సైట్​, కస్టమర్​ కేర్​ని సంప్రదించాల్సి ఉంటుంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం